Menu

Monthly Archive:: April 2008

హాలీవుడ్ లో మన తెలుగువాడు

భరత్ నల్లూరి అన్న పేరు ఇంతకముందు మీరు వినివుండకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈయన గురించి మనం వినే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టనిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ళ క్రితం ’వెరైటీ ’పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ’top 10 directors to watch out for’ లో ఒకడిగా భరత్ నల్లూరి పేరు కూడా చోటుచేసుకున్నప్పటికీ అతని మొదటి హాలీవిడ్ సినిమా ’The Crow-Salvation’ సినిమా అత్యంత నిరాశాకరమైన ఫలితాలు వెల్లడించడంతో కొన్నాళ్ళు సినిమా రంగానికి దూరంగానే వున్నా

నికోలస్ కేజ్ ఎన్నిసార్లు తొడకొట్టాడు?

నా మానాన నేనెదో పని చేసుకుంటున్నాను.ఇంతలో పక్కింటిలో ఎవరో తొడ కొడుతున్నాడు.ఏమిటా అని చెవులు రిక్కించి మరీ విన్నా.ఈలోపు వెనుక నుంచి డప్ఫు మరియు డబ్బాల చప్పుడు వినిపించేసరికి ఒహో ఇదేదొ సినిమా గోల అని ఊరుకునెంతలో శపధాలు స్టార్టయ్యాయి, వాళ్ళ వంశం ఎంత గొప్పదో,హిలన్ని సినిమా చివరి రీలులోపల ఎన్ని చిత్ర హింసల పాలు చేస్తాడో అడ్డమ్మానుసుగా చెప్పేస్తున్నాడు హీరో. ఇంతలో తన్నులు తింటూ ఒకసారి,మంటల్లో కాలిపోతూ ఒక సారి ఇలా రకరకాలుగా నా కళ్ళముందు

Frozen-సమీక్ష

కథా పరంగా ఇది లాస్య అనే ఒక అమ్మాయి కథ.హిమాలయల్లోని లడఖ్ ప్రాంతంలో లాస్య, తన తండ్రి కర్మ మరియు తమ్ముడు కోమో తో కలిసి జీవిస్తుంటుంది. వారుండే ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పబడి వుండడంతో వారి జీవితాలు కూడా అక్కడి వాతావరణంలాగే వారి జీవితాలు కూడా స్తంభించి పోయివుంటాయి. ఒక పూట తిండి కోసం అష్టకష్టాలు పడే తండ్రి ఒక వైపైతే పసితనపు చాయలు అప్పుడప్పుడే వీడుతున్న లాస్య తన తమ్మునితో చేసే షికార్లు ఒక