Menu

Monthly Archive:: April 2008

రాటటూయీ (2007)

రాటటూయీ అకాడెమీ అవార్డు అందుకున్న యానిమేషన్ చిత్రం. ఇలా చెప్పడం మీలో కాస్త కుతూహలం కలిగించవచ్చు. మినిమమ్ గ్యారంటీ నమ్మకం కలిగించవచ్చు. ఇది పిక్సార్ సంస్థ తీసింది అనగానే యానిమేషన్ ప్రియులకి అయితే, “అయితే ఓకే” అనిపించి ఉంటుంది. అలా అనుకున్నా కూడా, ఎలుకల మీద సినిమా అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్నాళ్ళూ చూడలేదు. చివరికి తెగించి చూసాక గానీ అర్థంకాలేదు ఈ సినిమాని వీలుంటే చూసి తీరాలి అని. యానిమేషన్ ఎలుకలకూ, నిజం ఎలుకలకూ చాలా

High and Low (1963)

“High and Low” అన్నది అకిరా కురోసవా తీసిన “Tengoku to Jigoku” అన్న జాపనీస్ చిత్రానికి ఆంగ్ల నామధేయం. నిజానికి ఆ పేరు కి అర్థం “స్వర్గం మరియు నరకం” అని అట. కానీ, ఆంగ్లం లో పేరు ఇలా పెట్టడం వెనుక కారణంఏమిటో అయితే నాకు తెలీదు. ఈ సినిమా ఒకవిధంగా ఆలోచిస్తే అపరాధ పరిశోధన తరహా చిత్రమని చెప్పాలి. కానీ, మరో కోణం నుంచి చూస్తే – పేదా గొప్పా తేడా ని

ఇకిరు (1952)

ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం. కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు.

Conceptual Integrity – A case study of జల్సా

జల్సా సినిమా నచ్చలేదని చాలా మంది యాంటీ ఫాన్సు అంటూనేవున్నారని చాలా మంది ఫాన్సుకు తెలిసినదే. దానికి కారణం సినిమా చెత్తగా వుండడం అని వారన్నా, మాకు అది నమ్మసక్యంగా లేదు. పవనం నటన, త్రివిక్రమం సంభాషణలు, ఇలియానా మఱియూ పార్వతీ మెలటను సొగసులు మొదలైనవి ఎన్నో వుండగా, ఈ సినిమా బాగోకపోవడమేమిటి అని. అలాంటి దృశ్య సంపదలతోఁ బాటు, రెండు మూడు కథలు, ఒక దానితో ఒకటి అల్లేసుకొని వుండడం; అత్యాధునిక కూర్పు సాంకేతికాలు; అర్భాటంగా

హేండీక్యామ్ హారర్

మన తెలుగు సినిమా పరిశ్రమలో కానీ మరేదైనా సినిమా పరిశ్రమలోకానీ ఒక సినిమా విజయం సాధిస్తే ఆ సినిమానే అధారంగా తీసుకుని మరి కొన్ని సినిమాలు రావడం జరుగుతూనే వుండడం సహజం. ఉదాహరణకు, పోయిన సంవత్సరం సూపర్ హీరోల సినిమాల సీక్వెల్స్ తో హాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చిపడ్డాయి. ఈ సంవత్సరం విడుదలయిన క్లోవర్‍ఫీల్డ్ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమాలో ఉపయోగించిన టెక్నిక్ తో రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు వచ్చే