Menu

Monthly Archive:: April 2008

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం నెరుపుతున్న

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో! అభిమాన కథ-ప్రజాకళ ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్ నివాళి-తెలుగు జర్నల్ చిడియాఖానా-24fps రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 

పెద్దలు – ప్రేమలు – సినిమాలు

“దేవదాసు” కు దాస్యం చేసి, “మల్లీశ్వరి” ని రాణి ని చేసి, “సాహసం సేయరా ఢింభకా…రాకుమారి దక్కుతుందని” (పాతాలభైరవి) ప్రేమని ప్రోత్సహించిన తాతయ్య,బామ్మ ల తరం ఒకటైతే, “మేఘసందేశా”న్ని మధించి “ప్రేమాభిషేకా”న్ని పొంగించిన నాన్నలు,అమ్మల తరం మరోటి. కానీ,ఈ రెండు జనరేషన్లూ ప్రేమకు వ్యతిరెకమే.మళ్ళీ ఏమైనా ఆంటే “ఈకాలం సినిమాలున్నాయి చూసారూ…ఇవి పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయి” అంటూ రాగాలు పోవడం పరిపాటి. నిజంగా సినిమాలు అంత మహత్తును కల్గి ఉంటాయా? మానవ సంభంధాలను అదీ ముఖ్యంగా ప్రేమను నిర్వచించి,ప్రోత్సహించే

Dersu Uzala (1975)

“Dersu Uzala” – మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు. విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా

మంచి సినిమాని ప్రోత్సాహించండి

సినీ గోయర్ సైటులో ఇటీవల విడుదలైన మీ శ్రేయోభిలాషి సినిమా గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. మంచి సినిమాలకు ఆదరణ కరువయిందని సత్యసాయి గారు ఆందోళన చెందుతున్నారు,’ఇంత అన్యాయమా? ఇలా చేస్తే మంచి సినిమా చనిపోతుంది’ అనే వ్యాసంలో. మీ శ్రేయోభిలాషి సినిమా కమర్షియల్ సినిమా కాదు అని సమాధానం చెబుతున్న ఆయా ఛానెల్ నిర్వాహకులు కమర్షియల్ సినిమాకూ, అవార్డు చిత్రాలకూ…ఇలా విడివిడిగా ప్రత్యేక నిర్వచనాలు ఇవ్వగలరా? పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.