Menu

నికోలస్ కేజ్ ఎన్నిసార్లు తొడకొట్టాడు?

నా మానాన నేనెదో పని చేసుకుంటున్నాను.ఇంతలో పక్కింటిలో ఎవరో తొడ కొడుతున్నాడు.ఏమిటా అని చెవులు రిక్కించి మరీ విన్నా.ఈలోపు వెనుక నుంచి డప్ఫు మరియు డబ్బాల చప్పుడు వినిపించేసరికి ఒహో ఇదేదొ సినిమా గోల అని
ఊరుకునెంతలో శపధాలు స్టార్టయ్యాయి, వాళ్ళ వంశం ఎంత గొప్పదో,హిలన్ని సినిమా చివరి రీలులోపల ఎన్ని చిత్ర హింసల పాలు చేస్తాడో అడ్డమ్మానుసుగా చెప్పేస్తున్నాడు హీరో. ఇంతలో తన్నులు తింటూ ఒకసారి,మంటల్లో కాలిపోతూ ఒక సారి ఇలా రకరకాలుగా నా కళ్ళముందు నికోలస్ కేజీ కనిపించాడు.పాపం అంత పెద్ద హాలీవుడ్ హీరో అలా బేల ముఖం వేసుకోని చూస్తుంటే ఎవరికయినా జాలేస్తుంది కదా.
ఇంకొక్క సారి సానుభూతి ఘఠ్ఠిగా ప్రకటించి క్యాలుక్యులేటరు ముందేసుకొని కూర్చున్నా గత పాతికేళ్ళలొ నికోలస్ కేజీ ఎన్ని సార్లు తొడకొట్టి ఉంటాడా అని?క్యాలుక్యులేటరులో బ్యాట్టరీ వీక్ అయ్యిందో నిజంగానే కేజీ తొడకొట్టలేదొ ఎన్ని సార్లు లెక్కేసినా సున్నా చూపిస్తోంది.
మనకేమో లెక్కలు రావాయే,సరేలే అని గూగులును,ఇంకోఇద్దరిని నొక్క,వూహూ తొడ కొట్టటం రాకుండానే గత పాతికేళ్ళుగా హాలీవుద్ హీరో గా చలామణి అయిపోతున్నాడని తెలిసి బోల్డంత ఆశ్చర్యం పడిపోయి హౌరా నీకు తెలుగు సినిమాలోనే కాదు ఇప్పుదొస్తున్న టీవి సీరియళ్ళలో కూడా వేషాలు దొరకవని ,మనసు రాయి చేసుకొని ఆ హాలీవుడ్ లోనె అఘోరించమని చెప్పి పంపేశా. బస్సు రైట్ టైముకే వచ్చింది ఈపాటికి హాలీవుడ్ చేరిపోయుంటాడు.

నాకంటూ స్వంత గుర్తింపు ఉండాలని ప్రపంచసినీ ప్రేక్షకులకు పరిచయమైన తన ఇంటిపేరును మార్చుకోని నికొలస్ కేజ్ గా తెర మీద కొచ్చాడు. వంశాల పేర్ల మీద,ఇంటిపేర్ల మీద, ఇక్కడ ఎంత కధ నడుస్తోందో మన తెలుగు సినిమా పత్రికలు చదివేందుకు మన సెలూన్లలో షేవింగ్ చేయించుకుంటేగా,కనీసం తెలుగన్నా రాదు ఏ సినీ పోర్టలో చూసి నేర్చుకునెందుకు.
ఇంతకీ ఇబ్బందిగా వుందని వదిలించు కున్న కేజీ ఇంటి పేరు కొప్పోల.ప్రపంచంలోనే అత్త్యుత్తమ సినిమాలను తీసిన కొద్ది దర్శకుల్లో ఒకడు,గాడ్ ఫాదర్,డ్రాక్యులా, వంటి కళాఖండాల సృష్తికర్త,రచయిత,పత్రికా ప్రచురణకర్త,హోటళ్ళ యజమాని ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల నికొలస్ కు స్వంత పెదనాన్న.

13 Comments
 1. ravi April 1, 2008 /
 2. sujatha April 1, 2008 /
 3. Raj April 1, 2008 /
 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 2, 2008 /
 5. theja April 2, 2008 /
 6. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 2, 2008 /
 7. Chilakapati Srinivas April 3, 2008 /
 8. sandeep April 4, 2008 /
 9. sandeep April 4, 2008 /
 10. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 4, 2008 /
 11. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 4, 2008 /
 12. Aravind March 14, 2009 /