Menu

మిస్సమ్మ(1955)

అల్లుడు, అమ్మాయి అని వరసలు కలిపి సావిత్రి ని విసిగించడము, దానికి ఎన్టీయార్ సావిత్రి ని ఏదో ఒక విధంగా సముదాయించి నచ్చచెప్పడం తెర మీద బాగ అతికింది.

ఈ చిత్రంలో రేలంగి హాస్యాన్ని చక్కగ పండించారు. మిస్సమ్మ పాత్ర పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవాలని ఏయన్నార్(డిటెక్టివ్ రాజు) ప్రయత్నించినప్పుడల్లా, తైలం తైలం అని అతన్ని విసిగించే సన్నివేశాలు నవ్వుల పువ్వులు కురిపిస్తాయి. ఎన్టీయార్ సావిత్రిలతో పోలిస్తే, ఎయన్నార్ జమున ల పాత్రలు అంత ప్రాధాన్యత లేకపొయినప్పటికి, తమ తమ పరిధుల మేరకు చక్కగ నటించారు. “Mr.A.K.Raju, private detective, ex.head master & present secretary of MahaLakshmi Elementary School, Appapuram” అని పరిచయం చేసుకునే రాజుగా ఎయన్నార్ రాణించారు. – ‘డిటెక్టివ్ రాజు వున్న వూళ్ళో దొంగలు ఉండడం అసంభవం; ఉంటె నేనైనా ఉండాలి, లేకపోతే దొంగలైన ఉండాలి’ అని ఎప్పుడు పరిశోధించి, ఆఖరికి మిస్సమ్మ యే, మహాలక్ష్మి అని రుజువు చేసే పాత్ర. అమాయకమైన అల్లరి పిల్ల పాత్ర లో జమున చలాకిగా నటించారు.

సావిత్రి ఎన్టీయార్ సముఖం లో, ఏయన్నార్ కు సంగీతం నేర్పించే సన్నివేశం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి తీరక మానదు. ’మీకు మీరే, మాకు మేమే,ఎందుకీ రుస రుస” అని సావిత్రి నేర్పగా, ఎయన్నార్ ఆమెని అనుకరించదానికి పడే తాపత్రయము, దానికి ఎన్టీయార్ చిరుమందహాసం, రేలంగి గొడుగు అడ్డం పెట్టే నెపం తో ఎయన్నార్ ని మరింత గేలి చెయడం ఆ సన్నివేసాన్ని ఎంతో రక్తి కట్టించింది. ఈ సన్నివేశం హాస్యానికి పరాకాష్ఠ. సినిమా మొత్తం రేలంగి చలోక్తులు అద్భుతం.

‘ఏది మీ వంతు అణా ఇచ్చుకోండి పోస్టేజ్ కి, మనదంతా ప్యూర్ బిజెనెస్, మీ లాభాలు మీవి, మా లాభాలు మావీ అని సావిత్రి వద్ద ఉద్యోగ దరఖాస్థు నిమిత్తం అణా వసూలు చేసే సన్నివేసం; ‘తూకం దెబ్బ తిని ఉంటుంది, మీరు డబ్బుకి కక్కుర్తి పడ్డారూ’ అని కూర లో, ఉప్పు యెక్కువ ఐన విషయం గురించి రేలంగి ఎన్టీయార్ పైన చురక వేయడం, ఎన్టీయార్ పాత్ర డబ్బు విషయం లో ఎంథ జాగ్రత్తపరుడో తెలియచేస్తుంది.

సాలూరి రాజేశ్వర రావు గారు ఈ చిత్రానికి చక్కటి సంగీతం చేకూర్చారు. ప్రతి ఒక్క పాట ఈ రొజుకీ ఎంతో తాజాగా, ఎప్పటికీ మధుర గీతం గా నిలిచిపోతుంది. పింగళి నాగేంద్ర రావు గారు సందర్భోచితమైన పదాలు కూర్చి, సన్నివేసానికి తగిన పాటలు సమకూర్చి, ఆ తరం నుండి, మన ఈ తరం వరకు అందరూ మెచ్చిన మరపురాని మధుర గీతాలు అందించారు.

‘రాగ సుధ రస పానము’
‘అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడు వారి మాటలకు అర్ధాలే వేరులే’
‘బాలను రా మదనా’
‘బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే’
‘తెలుసుకొనవె యువతి, అలా నడచుకొనవె యువతీ’
‘కావాలంటె ఇస్థాలే, నావన్ని ఇక నీ వేలే’
‘కరునించు మరియా మాత, శరణింక మరియా మాతా’
‘రావోయి చందమామ, మా వింత గాధ వినుమా’
‘శ్రీ జానకి దేవి సీమంతమనరే’
‘ఏమిటో ఈ మాయా, ఓహ్ చల్లని రాజ, వెన్నెల రాజా’

ఏ.యం.రాజ, లీల, సుశీల తమ శ్రావ్యమైన స్వరాలతో వీనులవిందైన పాటలు అందించారు.రేలంగి ఈ చిత్రంలో స్వీయ గానం కూడ చేసారు – ‘ధర్మం చెయ్యి బాబు, కాణి ధర్మం చెయ్యి బాబూ ‘సిత్రం సిత్రం,పైన పటారం, లోన లొటారం, ఈ జగమంతా డంభాచారం’.

—-హనీమిస్ట్

13 Comments
 1. మంజుల April 3, 2008 /
 2. Sowmya April 3, 2008 /
 3. Theja April 3, 2008 /
 4. కొత్తపాళీ April 3, 2008 /
 5. విష్ణుభొట్ల లక్ష్మన్న April 3, 2008 /
 6. Sreenivas Paruchuri April 3, 2008 /
 7. శిద్దారెడ్డి వెంకట్ April 3, 2008 /
 8. శిద్దారెడ్డి వెంకట్ April 3, 2008 /
 9. Udayakiran April 4, 2008 /
 10. sujatha April 13, 2008 /
 11. Sreenivas Paruchuri April 14, 2008 /
 12. K. SHANKAR RAO July 13, 2008 /
 13. RAMACHARY BANGARU December 21, 2008 /