మే,జూన్,జులై

రాబోయే మూడు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam at gmail dot com కు పంపగలరు.

మే-సత్యజిత్ రే

జూన్-జాన్ అబ్రహం

జులై-యసుజిరో ఓజు

ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు.

వివరాల కొరకు navatarangam at gmail dot com కు మెయిల్ చేయగలరు.

నవతరంగం పాఠకుల సలహాలు అభిప్రాయాలు కూడా కోరుతోంది. నాలుగు నెలలుగా దాదాపు ప్రతి రోజూ ఒక వ్యాసంతో కొద్ది రోజుల్లోనే ఎంతో ఆదరణ పొందిన ఈ వెబ్ సైటు ని మరింత మందికి చేరేలా చేయడానికి, మరిన్ని వ్యాసాలు రావడానికి తెలుగు సినిమాపై ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి భవిష్యత్టులో ఇంకా ఏమేం చేయాలో మీ అభిప్రాయాలు, సలహాల ద్వారా తెలుపండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories