నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నవతరంగంలో మాత్రమే కాకుండా ఎన్నో వెబ్‍సైట్స్ లో ఇది వరకే ఆయన గురించి ఎంతో విలువైన సమాచారం వుంది.ఆ సమాచారానికి సంబంధించిన కొన్ని లంకెలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.
ఎల్వీ ప్రసాద్ గురించి తెలుసుకోగోరిన వాళ్ళు ముందుగా ఆయన కోసమే ప్రత్యేకంగా కేటాయించిన వెబ్‍సైట్, www.lvprasad.org సందర్శించవచ్చు. ఈ వెబ్‍సైట్ లో ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన గురించి ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఆయన గురించి మరింత సమాచారం కోసం ఈ క్రింది లంకెలు చూడండి.
- ఎల్వీ ప్రసాద్ గురించి హిందూ వార్తా పత్రికలో ఎం.యల్. నరసింహం ప్రచురించిన A leader and a visionary వ్యాసం.
- ఐడిల్ బ్రెయిన్ వెబ్‍సైట్ లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాల పరిచయం
- ఆయన సినిమాల గురించి తెలుగు వీకిపీడియా వ్యాసాలు
- సినీ గోయర్ సైటులో ప్రసాద్ సినిమాల వివరాలు
- ఇవి కాకుండా ప్రముఖ సినీ పాత్రికేయుడు, దర్శకుడు శ్రీ K.N.T శాస్త్రి గారు ఎల్వీ ప్రసాద్ – మోనోలాగ్ నుంచి కూడా కొన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేచిచూడండి.
ఫేస్ బుక్ కామెంట్స్