Menu

జల్సా

pawan-jalsa.jpgపవన కళ్యాణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన జల్సా మొత్తానికి ఇవాళ విడుదలయింది. దాదాపు రెండేళ్ళుపైనే నిర్మాణ కార్యక్రమంలో వున్న ఈ సినిమా అత్యధిక థియేటర్లలోవిడుదలవడం లాంటి ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అసలే Q1 బ్యాడ్ గా వున్న తెలుగు సినిమా పరిశ్రమకు Q2 లో జల్సాతో పండగే అనుకున్నారు. మరి ఏమయింది? పండిందా లేదా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే!

కథ: ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ఇలియానా హీరోయిన్, ముఖేష్ ఋషి విలన్, తనికెళ్ళ భరణి విలన్ కుడిభుజం, సునీల్, బ్రహ్మానందం, ధర్మవరపు కామెడియన్స్, కమలిని ముఖర్జి, శివాజి అతిధి నటులు, పార్వతి మిల్టన్ హీరోయిన పక్కనుండే పిల్ల, ఆలీ, ఉత్తేజ్ లు హీరో వెనుక తిరిగేవాళ్ళు, ప్రకాశరాజ్ హీరోయిన్ తండ్రి. వీరందరినీ కలిపేలా ఏ కథైనా రాసుకోండి, అది గ్యారంటీగా జల్సా అంత బాగోకపోయినా దానికి సరితూగగలదనుకుంటాను.అంతకంటే ఈ సినిమా కథ గురించి చెప్పడానికేమీ లేదు అని చెప్పడానికి బాధాకరంగా వున్నా అది నిజం.

నటీనటవర్గం:పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే చేశారు. అంటే అప్పుడు బాగానే చేసారనిపించినవాళ్ళకి ఇప్పుడూ బాగానే చేసారనిపించవచ్చు. ఇంతకముందు ఆయన సినిమాల్లో నటన చూసి “ఇదేం యాక్టింగ్ రా బాబూ” అనుకున్న వాళ్ళకి ఇప్పుడూ అలాగే అనిపించే అవకాశాలు ఎక్కువ. ఇలియానా నటన గురించి ఏమీ చెప్పక్కరలేదు. ప్రకాశ్‍రాజ్ సత్తా లేని పాత్రలో వేస్ట్ అయిపోయాడు. ముకేష్ ఋషి ఒక తపస్సులా ఒకే రకమైన పాత్రలో ఒకే రకమైన నటనను పండించడంలో బాగా రాటుదేలిన నటుడు కాబట్టి తన పాత్రను అవలీలగా పోషించారు. సునీల్ ఉన్నంతలో కాసేపు నవ్వించాడు. బ్రహ్మానందం జోకులు పేలలేదనే చెప్పాలి.

స్క్రీన్‍ప్లే: పసందైన డైలాగులతో మంచి స్క్రీన్‍ప్లే-సంభాషణలతో ఎన్నో చిత్రాలను హిట్ అనిపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్‍ప్లే సమకూర్చడంలో తీవ్రంగా విఫలమయ్యారు. అసలీ సినిమా genre ఏంటో ముందే డిఫైన్ చేసుకునివుంటే ఇన్ని తంటాలుండి వుండకపోను. మొదట్లో కాసేపు కాలేజీలో సాగే లవ్ స్టోరీ అనుకుంటాం. ఆ మొదటి కాలేజీ సన్నివేశం తర్వాత మళ్ళీ కాలేజీలో మరో సన్నివేశం లేకపోవడంతో ఆ ఫీలింగ్ పోతుంది. సినిమా మొదలయిన కాసేపటికి ముకేశ్ ఋషి ఒక ఫ్యాక్షనిస్ట్ పాత్రలో నానా హడావుడి చేసి పవన కోసం గాలింపు చర్యలు చేపట్టడం చూసి మరో ఇంద్ర/సమరసింహారెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమా అనిపిస్తుంది. ఇంతలోనే సునీల్ ఎంట్రీతో నువ్వు నాకు నచ్చావ్ టైప్ లో బ్రీజీ రొమాన్స్ అనుకుంటాం.ఇంతలో ఇంటర్వెల్ కి ముందు పవన్ ఒక బ్యాంగ్ తో “నేను నక్శలైట్ అయ్యాను” అని మరీ మరీ అరిచి చెప్పడంతో కథ ఇక నుంచీ రసవత్తరంగా వుంటుందనుకున్నవాళ్ళకి ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసి ఏం చెయ్యాలో అర్థం కాదు.ఈ రెండో సగమంతా విపరీతమైన వయొలెన్స్ తో కూడిన కామెడీ తో వుంటుంది.

పాటలు/సంగీతం: సంగీతం ఒకే అనుకున్నా, పాటల చిత్రీకరణ పెద్ద గొప్పగా ఏమీ లేకపోవడంతో అంతగా రిజిస్టర్ కావు.

దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి పంచున్న డైలాగులు రాస్తారన్న పేరు మాత్రమే కాకుండా, “నువ్వే నువ్వే”, “అతడు” సినిమాలతో దర్శకుడిగానూ ప్రేక్షకులనుంచి మంచి స్పందనే వెల్లడయింది. అయితే ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో అపఖ్యాతిని మూటగట్టుకుంటారనిపిస్తుంది. 30 కోట్ల బడ్జెట్ తో ఎన్నో రోజుల శ్రమకోర్చి తీసిన ఈ సినిమా ఇంత పేలవంగా వుండడం నిజంగా ఆశ్చర్యమే. ఈ సినిమా గురించి ఇప్పటికే అంతర్జాలంలో విభిన్న కథనాలు వెలువడ్డాయి. నాకనిపించిందేంటంటే మొదట్లో ఆ కథ అనుకునే ఈ సినిమా మొదలుపెట్టి ఆ తర్వాత ఏదో కారణాల వల్ల కథ మార్చేసి వుండడం వల్ల ఈ సినిమా ఇలా కలగాపులగం అయిందేమో అనిపించింది. ఇంగ్లీషు సినిమా హిచ్ ఆధారంగా వుండే మొదటి కథలోని కొన్ని సన్నివేశాలు ఈ కథలోనూ చోటుచేసుకున్నాయి. రెండో భాగంలో నక్శలైట్ సమస్యను ఏదో చర్చిస్తారేమో అనుకున్నాను గానీ నాకు నిరాశే ఎదురయింది. నోమ్యాన్స్ లాండ్ సినిమా మొత్తాన్ని నాలుగు నిమిషాలకి కుదించి ఈ సినిమాలో ఒక సీనులో వాడుకుని సినిమాలోని నక్సలైట్ థ్రెడ్ ను ముగించివేశారు.

అలాగే సినిమాలో చాలా సీన్లకు అర్థం పర్థం వుండదు. ఆలీని పట్టుకెళ్ళి కొట్టే సన్నివేశం, కాలేజిలో బాంబులు పెట్టే సన్నివేశం అన్నీ సరదాగా సాగే ఒక కథలో ఇరికించినట్టుంటాయి.ఆ సీన్ల ఎఫెక్టు తర్వాతి సీన్లలో వుండదు. ఈ జిగ్సా పజిల్ ని కలిపడానికి మహేశ్ బాబు వ్యాఖ్యానం వాడుకోవడంలోని అవసరమేమిటో త్రివిక్రమ్ కే ఎరుక.

ఈ సినిమాలో హీరో పేరు సంజయ్ సాహు. సాహు అంటే ఒరిస్సాలో ఒక ఇంటిపేరు. మరి అలాంటప్పుడు హీరో కరీంనగర్ కి చెందిన వాడిలా చూపాల్సిన అవసరమేమిటో? ఒక వేళ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కోసం అలా అనుకున్నా నక్సలైట్ సమస్య ఒరిస్సాలో లేనిదేమీకాదుగా!

ముకేశ్ ఋషి పవన్ ను మొదటి సారి చూసినప్పుడు పవన్ అక్కడేం చేస్తుంటాడసలు?

ఒక పాటలో మొగ గొంతుక “మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా” అని పాడుతుంటే ఆ పాటకు ఇలియానా డ్యాన్సాడడం ఎందుకో అర్థం కాలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో….

చివరిగా:సినిమాలో లాజిక్ లు గట్రా చూడొద్దు, సినిమాని సినిమాగానే చూడండి అనేవాళ్ళు డిస్కషన్ బోర్డుల్లో లైవ్ అప్‍డేట్లతో సినిమా గురించి జిల్ల్లాల వారీగా రిపోర్టులు వేస్తూ, ఒకరి ఫ్యాన్స్ మీద ఒకరు బూతులు తిట్టుకుంటూ మీవాడి సినిమానే పెద్ద ఫ్లాపు అంటే కాదు మీవాడిదే అని రోజుల తరబడి డిస్కస్ చేస్తూ సినిమాని సినిమాగా వుంచకుండా చేసేసారు గనక నేను సినిమాని సినిమాగా చూడలేక ఈ నా బాధను ఇలా వ్యక్తం చేస్తున్నాను. ఇక ఈ సినిమా చూసి తరిస్తారో లేదో బాధ్యత మీదే.

71 Comments
 1. అన్వేషి April 2, 2008 /
 2. prabhakar April 2, 2008 /
 3. Sanjay April 2, 2008 /
 4. krushi April 2, 2008 /
 5. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 2, 2008 /
 6. వేదపండిత April 2, 2008 /
 7. jyothi April 2, 2008 /
 8. jaya simha reddy April 2, 2008 /
 9. jaya simha reddy April 2, 2008 /
 10. Kishore Pothuri April 2, 2008 /
 11. అన్వేషి April 2, 2008 /
 12. Arjun April 2, 2008 /
 13. Eshwar April 2, 2008 /
 14. Arjun April 2, 2008 /
 15. bagalamukhy April 2, 2008 /
 16. venkat.siddareddy April 2, 2008 /
 17. Uttara April 2, 2008 /
 18. sathish April 2, 2008 /
 19. Uttara April 2, 2008 /
 20. chavakiran April 2, 2008 /
 21. Chilakapati Srinivas April 2, 2008 /
 22. Nags April 2, 2008 /
 23. Nags April 2, 2008 /
 24. నాగరాజా April 3, 2008 /
 25. Anonymous April 3, 2008 /
 26. Jonathan April 3, 2008 /
 27. Rams April 3, 2008 /
 28. సుధాకర్ April 3, 2008 /
 29. praveen April 3, 2008 /
 30. jhansi April 4, 2008 /
 31. prasad April 6, 2008 /
 32. srivyal April 8, 2008 /
 33. sujatha April 10, 2008 /
 34. Kathi Mahesh Kumar April 19, 2008 /
 35. sasank April 24, 2008 /
 36. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 24, 2008 /
 37. Kathi Mahesh Kumar April 24, 2008 /
 38. Uttara April 24, 2008 /
 39. శిద్దారెడ్డి వెంకట్ April 24, 2008 /
 40. శంకర్ April 24, 2008 /
 41. veerni April 25, 2008 /
 42. sasank April 30, 2008 /
 43. sasank April 30, 2008 /
 44. sasank April 30, 2008 /
 45. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 30, 2008 /
 46. భాను May 2, 2008 /
 47. Sekhar May 4, 2008 /
 48. Uttara May 4, 2008 /
 49. Uttara May 4, 2008 /
 50. K.మహేష్ కుమార్ May 5, 2008 /
 51. sasank May 5, 2008 /
 52. sasank May 5, 2008 /
 53. Uttara May 5, 2008 /
 54. Uttara May 5, 2008 /
 55. శిద్దారెడ్డి వెంకట్ May 5, 2008 /
 56. సగటు జీవి May 5, 2008 /
 57. Uttara May 5, 2008 /
 58. sathish May 8, 2008 /
 59. bhanu May 8, 2008 /
 60. Chetana May 8, 2008 /
 61. sathish May 8, 2008 /
 62. bhanu May 9, 2008 /
 63. Chetana May 9, 2008 /
 64. bhanu May 10, 2008 /
 65. o v n prasad September 29, 2008 /
 66. venkat April 8, 2009 /
 67. Santosh April 10, 2009 /
 68. Dheeraj April 27, 2009 /