Menu

Conceptual Integrity – A case study of Bollywood Title Songs

krazzy 4 poster మొన్ననే అంశనిజాయితీ మీద ఒక పరిచయ వ్యాసం వ్రాయడం జరిగింది. అక్కడే జల్సా సినిమాగా ఒక చిన్న ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. నిజాయితీ లేని సినిమాని, లేదా ఏ ఇతర కళాఖండాన్నైనా, వస్తువునైనా అశ్వాదించడం, లేదా వాడడం చాలా కష్టం. ఉదాహరణకు, సియర్సు భవంతి రూపంలో గుళ్ళు కట్టలేము. అదే విధంగా ఓ నవీన కార్యాలయాల్ని కూడా ద్రవిడ గోపుర శైలిలో నిర్మించలేము. అంతెందుకు మతాన్ని బట్టి దేవస్థాన కట్టడం వుంటుంది.అలానే సినిమాలలో కూడా, దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నదీ ముందే స్పష్టంగా నిర్ణయించుకొని దాని అనుగుణంగా మిగిలిన అంశాలన్నీ నిర్ణించుకోవాలి. అదీ సినిమా అనేది చాలా శక్తిమంతమైన దృశ్య కావ్యం లాంటిది. డబ్బు కట్టి తన సర్వ జ్ఞానేంద్రియాలను అప్పజెప్పిన ప్రేక్షకులను వీలైతే చాలా బాగా సునాయాసంగా కదిలింపగలవచ్చు.

మనము ధ్యాసను హిందీ పరిశ్రమ వైపు మళ్ళిస్తే ఒక సారి. మీరు టీవీ పెట్టాగనే ఎప్పటిలాగా క్రికెట్ ఆడుతూనో, క్విజ్౨ పోటీ నిర్వహిస్తూనో మన షారూఃఖాన్ కనబడతాడు. అప్పుడప్పుడు పాటలు పాడుతూ కూడా కనబడవచ్చు. అలా ఈమధ్య క్రేజీ ౪ అనుకుంటూ గంతులేస్తున్నారు మన బాలీవుడ్ బాదుషా (త్వరలో ఏవత్ భారతానికి బాదుషా). తాను మంచి చొక్కా ప్యాంటు ధరించి, చొక్క నిక్కరు ధరించిన భామలను వెంటేసుకొని
Say it with a K, Say thats the Way. Krazzy ! అనుకుంటూ దుమ్ముదులిపేస్తున్నారు రాజుగారు.

ఇంకేం చేస్తాం. ఏ ఛానల్ పెట్టినా ఈయనేగా అని చూస్తూనే వుండాలి. పోనీలే చూశాం. పాట బాగుంది, ఇంతకీ ఏ సినిమాకి అని అడిగితే. ఒక నలుగురి పిచ్చోళ్ల కథ అంట! భగవంతనే ! నిక్కర్లు వేసుకున్న పాపలకు, నలుగురి పిచ్చోళ్ళ దృష్టిలోనుండి ప్రపంచాన్ని చూపించడానికి పొంతన ఏఁవిటి రాకేశా ? అన్నట్టు నాకు ముందు కొన్ని రోజులు అర్థం కాలేదు Krazzy అని ఎందుకుంది పేరు అన్న విషయం. అది ఎందుకంటేనంట మన రాకేశ రోషను గారు ఏ సినిమాకైనా పేరును k తో మొదలవ్వాలిగా అందుకు! ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు. నాలుగు రోజులు పోయాక మన అభినవ యక్షుడు హృతిక్ రోషను, Krazzy ౪ అనుకుంటూ చిందులేస్తున్నాడు. అబ్బా ఆ నృత్యం, సంగీతం, ఆ ఎఱుపు రంగూ, గ్రాఫిక్సూ మొదలైనవి. ఏఁవని చెప్పగలం. అన్నట్టు సినిమాలో రాకీ సావంత్ తో ఒక ఐటము నెంబరు కూడా వుందండోయ్!

సరే అయితే మన రాకేశ్ రోషన్ గారికి తన కథ మీదా, కథాంశం మీద, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకమహాశయుల బుఱ్ఱలమీదా నమ్మకం లేక, ఇలా పబ్లిసిటీ కోసం స్టారు పవర్ ని వాడుకుంటున్నాడన్న మట. అని నాలో నేను సరి పెట్టుకున్నాను.

అయినా ఇదేమి ఈ సినిమాతోఁ, కొత్త కాదు! ఇంకొన్ని సినిమాల గుఱించి చెప్పాలంటే,
౧) హరే రామ్ హరే కృష్ణ్ – బూల్ బులయ్యలో నుండి. అసలు ఆ సినిమాకి, ఆ నల్ల మఱియూ తెల్ల అమ్మాయిల ఊగే పిఱుదులకి ఏఁవైనా అసలు ఏఁవైనా సంబంధం వుందా ?
౨) ఒన్ టూ త్రీ – దునియా మేఁ ఆనా హైఁ ఫ్రీ. దునియా సే జానా హైఁ ఫ్రీ
అని ఒక పాట వస్తుంది. అందులో మొదటి పాదం “తెరి జవాని కి చర్చా హైఁ హర్ బాజా౨ర్ మేఁ” అని మొదలవుతుంది. అక్కడ మీకు, జవానికీ చర్చా కి, ఒన్ టూ త్రీ కి, దునియా మేఁ అనా జానా ఫ్రీ కి సంబంధం ఏఁవిటో అర్థఁవవ్వదు.
౩) ఇంకా ఇలా ఎన్నో ఎన్నో సినిమాలు, క్యాష్, సండే (మన తెలుఁగులోఁ వచ్చిన అనుకోకుండా ఒక రోజు ఒక వెయ్య రెట్లు నయం ఈ విషయంలోఁ) మొదలైనవి. ప్రొద్దుటే ఏ ఎమ్టీవినో జూ౨మ్ టీవినో చూడండి. ఇంకా ఎన్నో ఉదాహరణలు మీకే కనబడతాయి. ఈ పాటలు ఎప్పటినుండో వున్నా, ఈ క్రేజీ ౪ లో ఇలా రెండు పాటలు వుండడం మాత్రం నాకు చిఱ్ఱెత్తేడట్టు చేసింది. టపా వేయవలసివచ్చింది.

ఇదంతా ఇంచు మించుగా ఎప్పటినుండి మొదలైందని పిస్తుందంటే, అప్పట్లో దస్ సినిమాకి ‘దస్ బహానే కరకే లేగై దిల్’ అని ఒక పాట వచ్చేది. అదే సమయంలో ఇంకో ఒకటి రెండు సినిమాలు ఇలాంటి సినిమాకు సంబంధంలేని పాటలు తీశాయి. అప్పటినుండి ఇలా అర్థం లేని అనవసర పాటల్ని, ఆత్మవిశ్వాసం లేని సినిమాలను అమ్ముకోవడానికి వాడుకుంటున్నారు.

ఇలా మన పాటల్ని సినిమాల మధ్యలో వాడుకోవడాన్ని విదేశీయులూ ఎప్పుడూ హేళన చేస్తూనే వుంటారు. అంటే అది పూర్తిగా తప్పని నేను అనడం లేదు. కొందరు దర్శకులు దాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటారు తమ తమ సినిమాల్లో. ఉదా- మన శేఖర్ కమ్ముల. మీరు ఆయన్ని ఏ విషయంలో నైనా తప్పుబట్టవచ్చుఁగానీ, సినిమాల్లో మాత్రం నిజాయితీ ఉండేడట్టు చూసుకుంటారు.

మనవాళ్ళు అలాంటి అప్రస్తుత పాటల ఉనికిని తగ్గించడం మనేశి, బాలీవుడ్ అంటే బంచ్ ఆఫ్ సాంగ్స్ గా తీర్చిదిగ్గడం మొదలు పెట్టారు.
తీస్తే మ్యూసికల్స్ తీయండి, లేదా ఉన్న పాటల్ని కొంతైనా సినిమాలో ఇమిడేడట్టు చూడండి. మఱీ ఇలా విచ్చల విడిగా, పిచ్చోళ్ళ సినిమాల్లో కూడా షారుఃఖాన్ని, హితిక్‌ని కూల్ గా చూపించి, సినిమా హాళ్ళకు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు విరమించండి. దయచేసి. అంతగా మీకు మీ కథలో

పట్టు లేదనిపించినప్పుడు అలాంటి సినిమాలు తీయవద్దు. దయ చేసి! లేక పోతే బాలివుడ్ సినిమాలు అనడం మానేసి, బాలీవుడ్ పాటలు అనడం మొదలు పెట్టాల్సుంటుంది!

4 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 19, 2008 /
  2. సగటు జీవి April 20, 2008 /
  3. Kathi Mahesh Kumar April 21, 2008 /