Menu

నవతరంగానికి నాలుగు నెలలు

నూతనసంవత్సర శుభారంభ వేళ,మంచి సినిమాను ప్రోత్సహించండీ అంటూ అంతర్జాలంలో ఎగిసిన కెరటం నవతరంగం,పాలపొంగులా, అలా.. అలలా ఆరంభశూరత్వమే కాక కాలక్రమంలో అర్ధవంతమైన సమాచారనిలయం గా మారింది.గడచిన నాలుగు నెలలలో వందలవ్యాసాలూ,విశ్లేషణలూ,వ్యాఖ్యానాలతో చలనచిత్రప్రియులను అశేషంగా ఆకట్టుకుంటుంది నవతరంగం.
జల్సా, గోదావరి లొ గూఫులు,మై డిన్నర్ విత్ ఆంద్రె ,తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!, నిండు మనిషి -శోభన్,Travellers and Magicians – భూటాన్, తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా? ,శోభన్ బాబు – అశృనివాళి , జోధా అక్బర్-సమీక్ష ,కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా,తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు,మారుతున్న సినిమా కథనం,జోధ అక్బర్ – మరో సమీక్ష,గమ్యం ,నంది బహుమతులు,నేను చూసిన సావిత్రి,గాన గంధర్వుడి గానవర్షం,నేను విన్న మన పాటలు,దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం,జొధాఅక్బర్ అనే సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే..,ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా, అకిరా కురొసావా-పరిచయం,Ikiru ( to live ),చంద్రహారం (1954), అమెరికన్ బ్యూటీలో అందమెంత ?, Download నవతరంగం ,Persepolis,2007 లో నేను చూసిన ఉత్తమ భారతీయ సినిమాలు,రషొమొన్-సమీక్ష,నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం ,షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని – స్వర్గసీమ,సుమంగళి-సంప్రదాయాలపై తిరుగుబాటు,భలే పాప (1971),కెంజి మిజొగుచి – పరిచయం,చలనచిత్రాలలో చారిత్రాత్మిక సత్యాలు, Telugu Folklore Films: The Case of Patala Bhairavi ,Okka Magadu Comical Review,నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు? Life of Oharu – సినిమా సమీక్ష ,సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 1 ,హైదరాబాదు చలనచిత్రోత్సవం – కొన్ని సూచనలు,వేమగిరి – “రాళ్ళు” చిత్ర దర్శకుడి పరిచయం, కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు, The man from earth (2007) ,రాజేశ్ టచ్రివర్ – “అనామిక” చిత్ర దర్శకుడి పరిచయం,బెర్లిన్ చిత్రోత్సవం-2008,చిత్రోత్సవం, ప్రత్యేకం,Sansho Dayu – సినిమా సమీక్ష ,సినిమాలో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి పై ‘పొద్దు’లో వ్యాసం,జోధా అక్బర్ తదితర వ్యాసాలు బహుళప్రాచుర్యం పొందగా,వ్యాసాలతో సమానంగా వ్యాఖ్యలు అలరించాయి.

కొత్తపాళీ, క్రిష్,గిరి, నాగరాజా రావు,ప్రసాద్ సామంతపూడి,మంజుల, రాకేశ్వర రావు, రాజేంద్ర కుమార్ దేవరపల్లి,వారాల ఆనంద్,శంకర్,శిద్దారెడ్డి వెంకట్,శ్రీరాం,సౌమ్య,K మహేశ్ కుమార్,S V శ్రీనివాస్ ప్రభృతులు తరచూ తమ రచనలతో నవతరంగాన్ని నిత్యనూతనంగా ఉంచుతున్నారు.

ప్రత్యేకం,చిత్రోత్సవం, ప్రకటన, ఫిల్మ్ క్లబ్, ముఖాముఖి,వీడియో, ప్రపంచ సినిమా, ప్రముఖులు, విశ్లేషణ, సమీక్ష,* భారతీయ సినిమా-ప్రముఖులు,వార్త, విశ్లేషణ,సంగీతం,సమీక్ష,లంకెలు, వివిధ వంటి విభాగాలలో వ్యాసాలు ప్రచురిస్తుంది నవతరంగం.తాజాగా చర్చావేదికనూ సమకూర్చుకుని నిష్పాక్షిక చర్చలకూ,అర్ధవంతమైన వాదోపవాదాలకూ స్థానం కల్పిస్తుంది.

ఇప్పటికే 15 వేలకు పైగా విజిటర్స్, 5o వేల దాకా హిట్స్ తో అలెక్సా ట్రాఫిక్ ర్యాంకింగ్ 249,974 కు చేరుకుంది.నాలుగు నెలల కాలంలో నవతరంగం ఇంతటి ఆదరణపొందేందుకు విజ్ఞులు,సహృదయులైన పాఠకమహాశయులేకారణం.వారి ఆదరాభిమానాలను మరింతగా పోమ్డెందుకు యధాశక్తి కృషి చేస్తూనే ఉంటామని నవతరంగం సభ్యులందరి తరపునా వినమ్రంగా మనవి చేసుకుంటూ..

2 Comments
  1. Chandu April 30, 2008 /