Menu

షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని – స్వర్గసీమ

నిర్మాణం: వాహినీ ఫిలింస్

కథ:చక్రపాణి

స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి

మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య

సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు

ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే

ఎడిటింగ్:మణి

నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య

కథాసంగ్రహం:

వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న వ్యక్తి. అనుకోకుండా ఒకరోజు సుబ్బి ఇతగాడికి తారస పడుతుంది. సుబ్బిఆశించే అందలాన్ని అందుకోవడంలోఆమెకు మూర్తి తోడ్పడతాడు. క్రమంగా సుబ్బి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలొఆమె సుబ్బినుంచి సుబ్బులుగా, తరువాత సుబ్బలక్ష్మిగా మారుతుంది. చివరికి మహానటి సుజాతా దేవి గా రూపాంతరం చెందుతుంది. మరోవైపు తన వాడి చూపులతో, వేడి నిట్టూర్పులతో మూర్తిని వల్లో వేసుకుంటుంది. మూర్తి క్రమంగా సుజాత మైకంలో పడి భార్యా బిడ్డలను వదిలేస్తాడు. బస్తీలో ఆమెతోటే కాపురం పెడతాడు. ఏమైపోయాడో తెలియని భర్తను వెదుక్కుంటూ కల్యాణి తన ఇద్దరు పిల్లత మద్రాసు వస్తుంది. మూర్తిని కలుసుకుంటుంది. కానీ, సుజాత మైకంలో పడిన అతను వాళ్ళను పట్టించుకోడు.అవమాన భారంతో తిరిగి తమ వూరు వెళ్ళలేక కల్యాణి పట్నం లోనే కుట్టుపని చేసుకుంటూ పిల్లల్ని సాకుతుంటుంది.అటు సుజాతకు కొన్నాళ్ళయ్యేసరికి మూర్తి ముఖం మొత్తుతాడు.ఆవిడ మరో ప్రియుడ్ని వెదుక్కుంటుంది. ముందు మూర్తి ఇది గ్రహించడు. నిజం తెలిసాక కుప్ప కూలిపోతాడు. అతని ముఖం మీదే తలుపు వేసేస్తుంది సుజాత. కళ్ళు తెరుచుకున్న మూర్తి  చివరికి భార్యా పిల్లలను కలుసుకుని క్షమాపణ కోరుతాడు.ఆ కుటుంబం తిరిగి తమ వూరు వెళ్ళిపోయి హాయిగా వుంటుంది.

నిర్మాణ విశేషాలు:

రెండో ప్రపంచ యుద్ధానంతర రోజులు…అత్యవసర వస్తువులైన ఆహారం, చమురు, వస్త్రాలకు రేషనింగ్ పెట్టింది ఆనాటి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వం. సామాన్యుడికి వినోద సాధనమైన సినిమా మీద కూడా యుద్ధం  ప్రభావం పడింది. ముడిఫిలిం కొరత వచ్చింది. ఏ సినిమా కూడా పదకొండు వేల అడుగులు నిడివి మించరాదని ప్రభుత్వం కట్టుబాటు విధించింది.ఆ రోజుల్లో తెలుగు సినిమాలు హీనపక్షం ఇరవై వేల అడుగుల నిడివి వుండేవి. అలాంటి సంక్షుభిత కాలంలో కూడా ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారమే సినిమా తీసి దక్షిణాది అంతటా విజయబావుటా ఎగురవేసాడు బి.యెన్.రెడ్డి

3 Comments
  1. కొత్తపాళీ March 6, 2008 /
  2. Sowmya March 29, 2008 /