స్పిరిట్యువల్ సినిమా సర్కిల్

రెండు నెలల క్రితం ఒక స్నేహితుడు పంపించిన ఈమెయిల్‌ను చూసి, ప్రయత్నిద్దాం అని స్పిరిట్యువల్ సినిమా సర్కిల్ అనే వెబ్‌సైట్లో రిజిష్టర్ అయ్యాను. ఎన్నో అత్యద్భుతమైన సినిమాలు సరిపడ వ్యాపార విలువలు లేవనే కారణంతో హాలీవుడ్‌లో విడుదల కాలేవు అన్నది చేదు నిజం. అవి మరుగున పడిపోయి వాటి కష్టానికి తగిన గుర్తింపు లేకుండా పోతున్నది. ఇది గమనించిన ఔత్సాహికులు కొందరు, వీటిని ఆదరించే ప్రేక్షకుల కోసం ఒక సినిమా సర్కిల్‌ను నెలకొల్పారు. సర్కిల్‌లోని సభ్యులకు నెలకు ఒక డివిడిని పంపిస్తారు (నెలకు  $21.00  + పంపకం: $4.95 అమెరికా, $7.95 అంతర్జాతీయం). ప్రతి డివిడిలో నాలుగు చిత్రాలు ఉంటాయి; ఒక పూర్తి నిడివి సినిమా, రెండు చిట్టి/లఘు చిత్రాలు, ఒక డాక్యుమెంటరీ.

ప్రపంచంలో ఎక్కడెక్కడి నుండో తీయబడి సినిమా హాల్లో రిలీజు కాని, కాలేని వాటిల్లోంచి ఏరి మనకు పంపిస్తారు. వీటి నాణ్యత ఎంతో ఉత్తమంగా ఉంటాయి – నేను సాక్ష్యం. సినిమాలంటే అంటే కేవలం వినోదమే కాదు, కేటాయించిన సమయంలో కొంత నేర్చుకుంటే కూడా బాగుంటుంది అని మీరు నమ్మితే, భంగపడరు. సినిమా అంటే కేవలం – ఇద్దరు పెళ్ళి చేసుకోవడంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటారు అనే ఒక సమస్యకు రకరకాల వెరైటీ పరిష్కారాలు – అని మీరు నమ్మితే, తీవ్ర నిరాశ తప్పదు. మొదటి నెల డివిడి ఉచితం, పంపకం చార్జి మాత్రమే తీసుకుంటారు కాబట్టి ప్రయత్నించడంలో నష్టం ఏమీ లేదు.

మొదటి నెల అయిన తరువాత మానేద్దాం అని అనుకున్నాను కానీ జనవరి నెల డివిడిలో మీరా నాయర్ సినిమా “ది లాఫింగ్ క్లబ్” చూసిన తరువాత మానెయ్యడానికి ఏ మాత్రం ధైర్యం చాలడం లేదు. ఈ టపా రాసేటప్పుడే వెతికితే, ఆమె 1999వ సంవత్సరం ఆగస్టులో తీసిన సినిమా అని తెలిసింది! ఔరా!! చక్కటి ఉద్దేశ్యం, ఉపాయం, సందేశం వంటివి ఉన్న సినిమాలు ఏవీ మిస్సవను కదా అని ఆలోచించేసరికి ఫిబ్రవరి నెల డివిడి కూడా వచ్చింది.  అందులో The Rub of Attraction సినిమా చూసిన తరువాత మానేసే ఆలోచనను మానుకున్నాను. మీరు సభ్యులు కాకున్నా, అంతర్జాలాన కొన్ని చిట్టి చిత్రాలను చూడవచ్చు. మిగతా అన్ని వివరాలకు spiritualcinemacircle.com సైటును చూడండి.

–నాగన్న

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

5 Comments to “స్పిరిట్యువల్ సినిమా సర్కిల్”

  • I joined :!

    • chavakiran garu i need to talk something about the article my no is 9989589323

  • bale idea evarido, chala manchi prayogam , endariko upayogam

  • Thanks Nagaraja Rao gaaru. special thanks to venkat gaaru. Venkat gaaree naaku yi link ichaaru. useful information. I’ll join the club soon. 2 years back yevaro e-mail lo pampaaru link. pedha serious gaa thisukoledu appatlo.

  • naganna garu i need to talk something about the article my no is 9989589323

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories