Menu

రషొమొన్-సమీక్ష

rashomon-1.jpg ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క
విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను.

ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత బోధకుడు,కట్టెలు కొట్టుకొనేవాడు తాము అప్పుడే కోర్టులో సాక్ష్యం చెప్పి వచ్చిన ఒక సంఘటన గురించి తర్కించుకొంటూ ఉంటారు. టజొమరు అనే ఒక పేరుపొందిన బందిపోటు అడవి మార్గాన వెళ్ళే జంటను అదుపులోనికి తీసుకొని భార్య పై అత్యాచారం జరిపి భర్తను చంపేస్తాడు.

ఐతే ఇదే విషయాన్ని కోర్టులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. అందరి కధనాల్లోను అత్యాచారం హత్యా రెండూ టజొమరునే చేసాడని ధ్రువీకరించినప్పటికీ హత్యకు సంబందించిన విషయంలో మాత్రం భిన్న అభిప్రాయలను వ్యక్తపరుస్తారు.కట్టెలు కొట్టుకొనేవాడు తాను చచ్చి పడివున్న శవాన్ని చూచి భయంతో అధికారులకి తెలిజేసానని చెప్తాడు. భందిపోటు తన కధనంలో హతుడి భార్య తాను ఎవరో ఒకరితోనే జీవించాలనుకొంటున్నాని చెప్పడంవల్ల, అది ఎవరన్నది తెల్చుకొనెందుకే తామిద్దరమూ పోరాడామనీ, చివరికి ఆమె భర్త మరణించాడని చెబుతాడు.వారి వద్ద వున్న వజ్రాల బాకు గురించి అడగ్గా హడావుడిలో దాని విషయం మర్చిపోయానంటాడు.ఐతే భార్య మాత్రం అవమానభారంతో తనను చంపాల్సిందిగా భర్తను కోరినప్పటికీ తానే ఆత్మహత్య చేసుకున్నాడనీ, ఆ తర్వాత తాను కూడా ఎన్నో విధాలుగా ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమైనట్టుగా చెబుతుంది.ఇక ఆత్మ రూపంలో భర్త మరో రకంగా చెప్తాడు. అత్యాచారం తర్వాత బందిపోటు ఆమెను తనతోనే వుండమని కోరగా అందుకు ఆమె ఈ విషయం తెలిసిన ఇద్దరు పురుషులు ఉండడం తనకి ఇష్టం లేనట్టుగా(భర్తను చంపేయమనే అర్ధం వచ్చేలా) అభిప్రాయపడిందనీ, అది విన్న బందిపొటు అమె మీది వ్యమోహాన్ని కోల్పొవడమే గాక ఆమెను చంపడానికి కూడా వెంటపడి విఫలమౌతాడు. ఆవమానం తట్టుకోలేని తను బాకుతో పొడుచుకొని చనిపోయినట్లుగా చెబుతాడు.ఇలా కోర్టులో జరిగిన విచారణను మతభోధకుడు బాటసారికి వివరిస్తుండగా కట్టెలు కొట్టుకొనేవాడు భర్త చెప్పింది అబద్దమని ,తాను హత్యా సమయంలొ అక్కడే ఉన్నాననీ అనవసరంగా తలదూర్చడం ఇష్టం లేక కోర్టులో చెప్పలేదని తన వ్రుత్తాంతం చెప్తాడు. ఇందులో పై ముగ్గురు చెప్పిన విషయాలకు పొంతన కుదరని విషయాలు చెప్తాడు.ఇలా అందరూ కలిపి ఏది నిజమో ఏది కాదో అన్న భ్రమలో పడేస్తారు మనల్ని.

ఇంతలో ఎవరో వదిలేసిన పిల్లవాడు కనిపిస్తాడు వీల్ల ముగ్గిరికి ఆ రషొమొన్ గేట్ దగ్గర. అందులో బాటసారి వెల్లి పిల్లాడిమీద ఉన్న వస్తువుల్ని దొంగలించుకొని వెల్లిపోబోతుంటె కట్టెలు కొట్టెవాడు అడ్డగిస్తాడు. అప్పుడు బాటసారి వాడితో ” నేనేమన్నా పిచ్చివాడిని అనుకున్నావా నువ్వు చెప్పినట్టు హత్య చెయ్యబడింది బాకుతో కాదు కత్తితో అని చెప్తే నమ్మడానికి . ఐనా ఆ వజ్రాలు పొదిగిన బాకునే దొంగలించిన నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు” అంటాడు. ఏమి చెయ్యలేని వాడు బాటసారిని వదిలేస్తాడు.ఇదంతా గమనిస్తున్న మతభోదకుదు తనకు మనుషుల మీద వున్న నమ్మకం ఈరోజుతో పోయిందంటాడు. కాని ఆ అనాధ పిల్లాడ్ని తన ఆరుగురు పిల్లలతో కలిపి పెంచుకుంటానని అన్న కట్టెలుకొట్టేవాని మాటలతో ఇంకా మానవత్వం ఉందని ఆనందిస్తాడు. ఆ పిల్లాడితో కట్టెలుకొట్టేవాడు బయటకు నడుచుకొంటూ వెల్లిపోతుండగా సూర్యుడు మబ్బులనుండి బయటకు వస్తూ చిత్రం ముగుస్తుంది.

ఈ కధ వింటే ఎవరికైనా మన చందమామ భట్టి విక్రమార్క కధలా అనిపించొచ్చు. ఇంతకీ అసలేం జరిగిందో అన్న భేతాళ ప్రశ్నా రావొచ్చు. కాని ఇక్కడ అకిర కురసొవ చెప్పాలనుకున్న విషయం వేరే ఉంది. చాలామంది విమర్శకులు ఈ సినిమా గురించి చెప్పమంటే ” అకిర కురసొవ సినిమాలో చూపించినదానికంటే చూపించకుండా వదిలేసిన దాని ద్వారా చెప్పదలచుకున్నదే చాలా ఎక్కువ ” అని చెప్తారు. అది ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తేగానీ అర్ధం కాదు. ఒకే సంఘటనని విభిన్న వ్యక్తులు తమ మనస్థత్వాలకు అనుగునంగా ఎలా చూస్తారు అనే విషయాన్ని ఇక్కద కురసొవ చెప్పదలచుకున్నాడు.బందిపోటు చెప్పిన స్టోరీలొ తననో గొప్ప వీరునిగా చిత్రీకరించుకునేందుకు హతుడి పొరాట పటిమను మెచ్చుకుంటాడు. అదే భార్య తన కథలో అటు భర్త ఇటు బందిపోటు ఇద్దరూ తనని వంచించారని అలాగే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పడం ద్వారా సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది.ఇక భర్త ఐతే పురుషాధిక్యాన్ని ప్రదర్శించాలనే దుర్భుద్ధితో బందిపోటుని క్షమించాననడమే కాకుండా తన చావుకి పరోక్షంగా భార్యే కారణమనేలా వివరిస్తాడు. చివరిగా కట్టెలు కొట్టేవాడు తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు వారి మధ్య జరిగిన పోరాటాన్ని ఎదో అద్రుష్టం వల్ల బందిపోటు గెలిచినట్టుగా వర్ణిస్తాడు. ఇలా ప్రతీ ఒక్కరు వాళ్ళ కధ మొదలుపెట్టినప్పుడు మనం కూడా తెలీకుండానే వాళ్ళతో ఏకీభవిస్తాం. అదే ఈ సినిమా గొప్పదనం. అంతకుముందే అదే కధ వేరేగా చెప్పబడినప్పటికీ వాటిగురించి అలోచించే ఖాళీ దొరకదు మనకు చూస్తున్నంతసెపూ.ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తేనే కాని అంతుబట్టని ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం మూడే ( రషొమొన్ గేట్, కోర్ట్, అడవి ) లొకేషన్లలో తీసారని. అలానే మనకి ఎక్కడా కూడా జడ్జిని చూపించడు. కోర్టులో అందరూ ప్రేక్షకున్ని చూస్తూ సాక్ష్యం చెప్తున్నట్టుగా వుంటుంది. అంటే ప్రేక్షకుడె జడ్జి అన్నమాట ( ఇది ప్రేక్షకున్ని పూర్తిగా సినిమాతో ప్రయానం చేసేలా చేసిన ఒక కారకంగా చెబుతారు ). నిజ జీవితంలో కూడా కోర్టులలో ఇలాంటి పరిస్థితే జడ్జికి ఎదురవుతూంటుందేమో అనిపిస్తుంది సినిమా చూసాక, ఎందుకంటే కేవలం సాక్షుల కధనం మీద ఆధారపడే తీర్పివ్వాలి కాబట్టి ( మన సినిమాలలోలా అన్నిసార్లూ న్యాయం గెలవడం అనేది ఎంత హాస్యాస్పదమో అర్ధం అవుతుంది కూడా).

నటీనటుల విషయానికి వస్తే కురసొవ ఆస్థాన నటుడు మిఫునె ఈ సినిమాలో కూడ అదరగొట్టేస్తాడు. ఈ సినిమాలో నటించెముందు చాలా ఆఫ్రికన్ సినిమాలు చూపించాట్ట కురసొవ ఆ జంతువులాంటి ఎఫ్ఫెక్త్ కోసం( కొన్నిసార్లు ఒవర్గా అనిపిస్తుంది కూడా). ఇంక తర్వాత చెప్పుకోవాల్సింది భర్తగా నటించిన మసయుకి మొరి గురించి. సినిమాలో ఈ కారెక్టెర్ ఒక్కటే డిఫెరెంట్ కధల్లో డిఫెరెంట్ షేడ్స్ చూపించేది.మిగతా పాత్రలన్నీ అన్ని వెర్షన్లలోనూ ఒకేలాంటి వ్యక్తిత్వాన్ని చూపించాలి. మొరి తన పాత్రకు పూర్తి న్యాయం చేయడం ద్వారా సినిమాలో మొనాటనీ లేకుండా కాపాడాడు.మిగతా నటులందరూ న్యాయం చెసారు. ఈ సినిమాకి కెమెరా వర్క్ చేసిన కజుఒ మియగవకి మొదటిసారి సూర్యున్ని డైరెక్ట్ గా షూట్ చేసిన క్రెడిట్ ఉంది. ఈ సినిమాతోనే జపనీస్ సినిమా ఇంక కురసొవ ప్రపంచ సినిమాకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎంతోమంది ఈ సినిమా స్క్రీన్ ప్లే ని ఫాలో అయ్యారు. మన కమల్ హాసన్ పోతు రాజుకి కూడా ఇదే స్పూర్తి అంటారు. ఇంకా ఎన్నో విశేషాలు వున్నప్పటికీ సమయాభావంతో ఇక చాలిస్తున్నా. వీలుంటె మరికొన్ని విషయాలను అతికించడానికి ప్రయత్నిస్తా. హట్సాఫ్ టూ అకిరొ కురసొవ…

5 Comments
  1. శిద్దారెడ్డి వెంకట్ March 13, 2008 /
  2. మంజుల March 13, 2008 /
  3. Kiran March 14, 2008 /
  4. రానారె March 14, 2008 /