Menu

Monthly Archive:: March 2008

జొధాఅక్బర్ అనే సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే..

ఈ సినిమా దర్శకుడు అశుతోష్ ని అందరూ అభినందించాలి.చాలా విభిన్నమైన కధను ఎంచుకుని,తాపీగా,భారీగా తీసినందుకు.చాలా వరకు ఇవ్వాళ వస్తున్న హిందీ సినిమాలు,మల్టీప్లెక్సుల కోసం,విదేశాల్లోని భారతీయులకోసం రూపొందుతున్న నేపధ్యంలొ నాయికానాయకులను చిన్నప్పటి నుంచీ చూపటమనేది అరుదై పోయింది.కానీ ఇందులో ఇద్దరినీ చిన్నతనం నుంచి చూయించి పాత సాంప్రదాయానికి మళ్ళీ ఒక సారి ఊపిరి పోసాడు.హృతిక్ రోషన్,లక్ష్య సినిమా తర్వాత కాస్త నటించేందుకు ప్రయత్నించాలని చాలా కష్టపడ్డాడు.ఐశ్వర్య ని క్లోజప్ లో చూయించినప్పుడల్లా ఆమె కళ్ళల్లో ఆస్కార్ ఉత్సవంలో ఫొటోగ్రాఫర్ల

రషొమొన్-సమీక్ష

ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను. ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత బోధకుడు,కట్టెలు కొట్టుకొనేవాడు తాము అప్పుడే

స్పిరిట్యువల్ సినిమా సర్కిల్

రెండు నెలల క్రితం ఒక స్నేహితుడు పంపించిన ఈమెయిల్‌ను చూసి, ప్రయత్నిద్దాం అని స్పిరిట్యువల్ సినిమా సర్కిల్ అనే వెబ్‌సైట్లో రిజిష్టర్ అయ్యాను. ఎన్నో అత్యద్భుతమైన సినిమాలు సరిపడ వ్యాపార విలువలు లేవనే కారణంతో హాలీవుడ్‌లో విడుదల కాలేవు అన్నది చేదు నిజం. అవి మరుగున పడిపోయి వాటి కష్టానికి తగిన గుర్తింపు లేకుండా పోతున్నది. ఇది గమనించిన ఔత్సాహికులు కొందరు, వీటిని ఆదరించే ప్రేక్షకుల కోసం ఒక సినిమా సర్కిల్‌ను నెలకొల్పారు. సర్కిల్‌లోని సభ్యులకు నెలకు

సయూద్ అఖ్తర్ మీర్జా – ఒక పరిచయం

వర్తమాన భారతంలో నెలకొని వున్న సామాజిక, రాజకీయ, అర్థిక, మత విచ్చిన్నకర పరిస్థితుల విషయంలో తరపి చేసిన ప్రతిభావంతమయిన వ్యాఖ్య, విమర్శ సయీద్ అఖ్తర్ మీర్జా. ఆయన చిత్రంలోని అరవింద్ దేసాయిలాగా ఆయన కూడా స్పష్టంగా బాధితులవైపు, మైనారిటీల వైపు, వెనకబడ్డ వారి వైపు నిలుచున్నాడు. అంతెందుకు ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ఖచ్చితంగా జీవితాంతం ప్రతిపక్షంలోనే నిలుచుంటాను” అంటాడు. అలా సుస్పష్టమయిన ఆలోచన నిబద్దలతో చిత్రాలు తీస్తున్న సయీద్ మీర్జా తన చిత్రాలకు పెట్టిన పెర్లే ఆయన

సలీం లంగ్డే పే మత్ రో

దర్శకత్వం:Saeed Mirza కాలం:1989 నటీ నట వర్గం: పవన్ మల్హోత్రా, మకరంద్ దేశ్‍పాండే, అశుతోష్ గోవరికర్ సలీం ముంబాయు లోని మురికి వాడలో జీవించే ఒక ముస్లిం యువకుడు. ఇంట్లోని ఆర్థిక పరిస్థుతుల కారణంగా చదువుకోలేకపోతాడు. చిన్నప్పటినుండి వీధుల వెంట జులాయిగా తిరుగుతూ ఒక చిన్నపాటి రౌడిగా ముంబాయి వీధుల్లో తిరుగుతుంటాడు. సలీం చేసే అల్లరి చిల్లరి పనుల్లో అతనికి తోడుగా వుంటూంటారు అతని మిత్రులు పీరా మరియు అబ్దుల్.జైలుకెళ్ళడం, దొంగతనాలు చెయ్యడం లాంటవి వీరి జీవితంలో