తెలుగువారి సినిమా పిచ్చి గురించి చెప్పేదేముంది. ఈ మధ్య బ్లాగులొచ్చి కొంతమందికైనా వేరే వ్యాపకం కల్పించాయి గానీ …..ఏదేమైనప్పటికీ తెలుగువారికి టైమ్పాసు కలిగించే సినిమాల గురించి చైతన్య పాటూరు ఇలా అంటున్నారు. అని చాలా రోజులే అయిందిగానీ ఇప్పుడు కళ్ళబడింది కాబట్టి ఇక్కడ ఇలా….
ఇక పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులకు పిచ్చ టైమ్పాస్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే(అభిమానులకి బాగుంటే) చాలు, మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుంటారు. ఇంక వీరాభిమానులు అందుకోసమే ఆడియో విడుదల నుంచే డబ్బులు ఆదా చేస్తుంటారు. ప్రతి రోజు వెళ్ళి థియేటర్ దగ్గర కలక్షన్లు లెక్క చూసుకు వస్తుంటారు. మా వూరులాంటి చిన్న టౌన్లలో పెద్ద సినిమాలు విడుదలైన మొదటి వారంలో, వూర్లోని సగం థియేటర్లలో ఆడించేస్తారు. ఆ వారంలో మొత్తం జనం చూసేసాక, ఇంక దాన్ని వంద రోజులకి ఆడించే బాధ్యత ఫాన్స్ తలకెత్తుకుంటారు. చేసిన వాళ్ళ కంటే, తీసిన వాళ్ళ కంటే, వీళ్ళు ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతారు.
పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.
sathish says:
సినిమా ఆసక్తి చాలా మందికి ఉందిగానీ, చూసే జనాభా మరీ అంత ఎక్కువేమీ కాదు. అదే నిజమైతే కలెక్షన్లు భారీగా ఉండాలి.
మన వాళ్ల కబుర్లలో సినిమా ఎక్కువగా నలుగుతూ ఉంటుంది. దాంతో అందరికీ సినిమా పిచ్చి అనే ఇంప్రెషన్ కలుగుతోంది.
ఈ వ్యాసంలో బయటి రాష్ట్రాల వాళ్ల్లకి సినిమా పిచ్చ మనకన్నా తక్కువ అని అన్నారు. అది కూడా ఇంప్రెషన్ మాత్రమే.