Menu

జమన్ – ఉత్తమ సినిమా ప్రపంచం

nav_logo-over.pngనేషనల్ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (NFDC)గురించి మీరు విన్నారా? మన దేశంలోని అత్యుత్తమ చిత్రాలు లిస్టు చేస్తే అందులో కనీసం పాతిక శాతమైనా ఈ సంస్థ నిర్మించిన చిత్రాలుంటాయని నాకనిపిస్తుంది. సత్యజిత్ రే, శ్యాం బెనగల్, సయీద్ మీర్జా లాంటి అత్యుత్తమ సినిమా దర్శకులచే సినిమాలు నిర్మింపజేసిన ఘనత ఈ సంస్థకు వుంది. మన కమ్ముల శేఖరుని సినిమా ఆనంద్ కి కూడా ఈ సంస్థే సగం నిర్మాణ వ్యయం అందచేసింది.అంతేకాదు ఆసక్తి వున్న దర్శకులకు ఈ సంస్థ లోను ఇచ్చి సినిమా నిర్మించుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. నిజంగానే భారతీయ సినిమా అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తున్నప్పటికీ ఈ సంస్థలో ఒక పెద్ద లోపం వుంది. ఈ సంస్థ సినిమా నిర్మాణం అయితే బాగానే చేస్తుంది కానీ సినిమా పంపిణీ చేయడంలో మాత్రం చాలా మెతక వైఖరి అవలంబిస్తుంది. దానికి కారణమేమిటో తెలియదు.

ఇంతకీ సంగతేమిటంటే అలా NFDC పంపిణీ వ్యవస్థలోని లోపాలవల్ల ఎన్నో ఉత్తమ సినిమాలు ప్రేక్షకులకు చేరకుండా వుండిపోయాయి. ఈ సినిమాలు ఎప్పుడైనా దూరదర్శన్లో వేస్తే తప్పితే మరో విధంగా చూసే అవకాశం ఇన్నాళ్ళూ లేకపోయింది. కానీ జమన్ పుణ్యమా అని ఇప్పుడు NFDC నిర్మించిన సినిమాలు (దాదాపు 30 సినిమాలు)జమన్ లో లభ్యమవుతున్నాయి.

జమన్ లో సభ్యత్వం తీసుకోవడం చాలా సుళువు. ఉచితంగానే మీరు సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. ఇందులో చేరడం ద్వారా మొదటి రెండు సినిమాలు ఉచితంగా డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కో సినిమాకు కొంత సొమ్ము చెల్లించి సినిమాలను డౌన్‍లోడ్ (అద్దెకు లేదా సొంతానికి)చేసుకోవచ్చు.

జమన్ లో ఉన్న 30 NFDC సినిమాల వివరాలు ఇక్కడ చూడొచ్చు.

జమన్ లో చేరండి. ఉత్తమ సినిమా ప్రపంచంలోకి అడుగువెయ్యండి.

One Response
  1. kalikaalam March 27, 2008 /