కాలం:1985
భాష:హింది
దర్శకుడు:గుల్జార్
నటులు: నసీరుద్దిన్ షా, రేఖ, అనురాధ పటేల్
మీరు ఏ గుల్జార్ అభిమానిని అయినా మీకు చాల నచ్చిన చిత్రం ఎమిటి అని అడిగితే ఎక్కువగా వచ్చే సమాధానం ఇజాజత్. నేను ఈ చిత్రం మొట్టమొదట కాలేజిలో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు చిత్రం బావుంది అని మాత్రం అనుకున్నాను. తర్వాత మళ్ళి మూడెళ్ళ క్రితం చూసాను. అప్పుడు ఈ చిత్రం ఒక కళాఖండం అనిపించింది.
కధ: దీనికి ఆధారం ఒక బెంగాలీ కధ. ఒక వర్షం రోజు రాత్రి మహేన్, సుధ train stationలో కలుసుకుంటారు. వారిద్దరు ఒకప్పుడు భార్యాభర్తలు. వారి దంపత్య జీవితాన్ని, విడాకులకి దారితీసిన పరిస్థితులని చర్చించుకుంటారు. కధాకాలం ఒక రాత్రి. వారి చర్చలు, Flashbackలో వారిద్దరి దాంపత్య జీవితాన్ని చూపెడతారు. చిత్రం non-linear formatలో సాగుతుంది.
ఈ చిత్రం బాగా నచ్చడానికి కారణం పాత్రల చిత్రీకరణ. దీంట్లో ముఖ్య పాత్రలు మూడు. ఒక commitment phobic ప్రేమికురాలు, పెద్దవారి గురించి పెళ్ళి చేసుకుని ప్రేమికురాలిని మర్చిపోలేని భర్త, గతం ముందే తెలిసి పెళ్ళి చేసుకున్నా ప్రేమికురాలిని మర్చిపోలేదన్న frustrationలొ ఉన్న భార్య. వీరిలో ఎవరి కధ వారిదే, ఎవరి బాధ వారిదే, ఎవరి అలోచనాసరళి వారిదే. మానవ సంభంధాలలో ఉన్న complicationsని అత్యద్భుతంగా చిత్రీకరించాడు గుల్జార్.
ఇక నటన విషయానికి వస్తే నసీరుద్దిన్ షా, రేఖ ఇద్దరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. చిట్టచివర శశికపూర్ వచ్చి తన ముద్ర వేసి వెళ్ళిపోతాడు. మంచి screen presence ఉన్న నటులలో శశి ఒక్కడు అన్న విషయం ఈ చిత్రం చూసిన తర్వాతే నాకు తెలిసింది.
సంభాషణలు చాల poeticగా ఉన్నయి. గుల్జార్ పాటలు చాల బావున్నాయి. అందులో అన్నిటికంటే బావున్న పాట ‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై’ ఈ పాట గుల్జార్ best పాట అని నా అభిప్రాయం. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఆర్ డి బర్మన్ సంగీతం.
మీ మంచి స్నేహితులని పిలిచి ఒక french wineతో గాని లేక చాయ్ తో గాని చూడవలిసిన చిత్రం. ఈ చిత్రం తర్వాత వారితో జరిగే చర్చలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి.
చివరిగా చెప్పవలిసిన మాట ఈ చిత్రంతో మా తరంవారు బాగా indentify చేసుకోగలరు. ఈ చిత్రం 1985లో వచ్చింది అంటే ఆశ్చర్యకరమే.
–మంజుల
varalaanand says:
నమస్తె
ఇజాతత్ లాంటి సినిమాలు మెచ్చే తరం వుందంటే సంతోషం గా వుంది మీ వ్యాసం బాగుంది
మాసూం కూడ చూడండి. రాయండి
ipc302 says:
thanks for mentioning a good movie…one of the strong points of the movie in addition to the actors is the amazing music given by RD BURMAN.anybody who has lsitened to the songs will never forget the amazing voice of ashabhosle, gulzar’s poetic beauty..a couple of the songs Mera kuch saman and khatra khatra
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
అనురాధా పటేల్ అంటే ఉత్సవ్ సినిమాలో శేఖర్ సుమన్ భార్య పాత్ర పోషించినావిడా మంజుల గారు?
గిరి says:
ఈ చిత్రంలో పాటలు నాకు చాలా చాలా నచ్చుతాయి, అన్నీ ఆశా భోంస్లే పాడినవే – ‘కత్రా కత్రా మిల్తా హై’, ‘ఛోటిసి కహాని సే’, ‘మేరా కుచ్ సామాన్’..
గుల్జార్ సాహిత్యం మాత్రం ఆయనదైన మూసలోనే ఉంటుంది..ఆ ఆస్మాఁ లు, ఆ చాంద్ లు, ఆ మిశ్రిలు, ఆ ఖుష్బూలు – ఆయన పాటలు కొన్ని విన్న తర్వాత మిగతా వాటిలో వినూత్నత్వం కనిపించదు.
K మహేశ్ కుమార్ says:
@రాజేంద్ర కుమార్: అవిను ఉత్సవ్ లో శేఖర్ సుమన్ భార్య పాత్రలో నటించిన అమ్మయే ఈ చిత్రంలో ప్రేమికురాలిగా నటించిన అమ్మాయి. ‘మేరా కుచ్ సామాన్’ పాటతో ఈవిడ హిందీ సినీజగత్తులో సుస్థిరస్థానం సంపాదించినట్లే!