Menu

3:10 టు యుమా – సమీక్ష

310toyuma.jpgకథ:Ben Wade(రస్సెల్ క్రౌ) అనే గజ దొంగ దాదాపు ఇరవై కి పైగా దోపీడీలు చేసి పరారీలో వుంటాడు. మరో కొత్త దోపిడీ ప్రయత్నంలో అనుకోని పరిథితుల్లో ఒక మూరమూల ప్రాంతంలో దొరికిపోతాడు. అతన్ని బంధించి చట్టానికి అప్పచెప్పాలంటే రెండు రోజులు గుర్రాల పై ప్రయాణం చేసి కంటెనెషెన్ పట్టణం చేరుకుని అక్కడ 3:10 గంటలకి Yuma బయల్దేరి వెళ్ళే రైలులో అతన్ని ఎక్కించాలి. క్షణంలో తుపాకీ గుళ్ళ వర్షం కురిపించగల Ben Wade ని రెండు రోజుల పాటు బంధించి వుండడమంటే పెద్ద చాలేంజే!ఈ కార్యంలో సహాయపడటానికి ముందుకొస్తాడు Dan Evans(క్రిస్టియన్ బాలె)

Dan Evans ఒక పేద rancher(రైతు). యుధ్ధంలో సంభవించిన ప్రమాదంలో దాదాపుగా కాలు కోల్పోయి, మరో వైపు వర్షాలు లేక, అప్పులో కూరుకుపోయి కష్టల్లో వుంటాడు. Wade ని తీసుకెళ్ళి Yuma వెళ్ళే రైలెక్కించడంలో సహాయం చేస్తే 200 డాలర్లు ఇస్తామనడంతో ఆ పని మీద మరో ఐదుగురితో కలిసి బయల్దేరుతాడు. Evans కి తెలియకుండా అతని పెద్ద కొడుకు కూడా అతని వెంటే గుర్రమేసుకుని బయల్దేరుతాడు.

రెప్పాడించేలోపల మటుమాయం కాగల ఘరాన దొంగ ఒక వైపు, మరో వైపు అతన్ని కాపాడడానికి బయల్దేరిన అతని గ్యాంగు సభ్యులు,వీరి వెనకే బయల్దేరిన Evans కొడుకు.వీరందరి మధ్య జరిగే సన్నివేశాలే సినిమాలోని ముఖ్య భాగం.

మన వాళ్ళకి Western సినిమా అనగానే నిధులూ నిక్షేపాలు వాటి తాలూకు మ్యాపులు నలుగురు దగ్గర వుండడం లాంటి కథలే గుర్తుకోస్తాయి కానీ western సినిమాలన్నీ నిధులూ నిక్షేపాల గురించి కాదు. ఒకప్పటి అమెరికన్ way of life కి ఈ సినిమాలు అద్దం పడతాయి. ఆ మాట అటుంచితే ఈ సినిమాల్లో entertainment quotient కొంచెం ఎక్కువే. గుర్రాల సకలింపులు, ఎర్రమట్టి రేపుకుంటూ పరిగెత్తే గుర్రాలు, విశాల మైదానంలో అధ్భుతంగా ఫ్రేం చేసిన షాట్లు, గన్ ఫైట్లు లాంటి ఎన్నో అంశాల వలన Western Genre సినిమాలకు ప్రపంచం మొత్తం విపరీతమైన అదరణ వుంది.

John Ford,Howard Hawks,Sam Peckinpah, Sergio Leone లాంటి దర్శకులు ఈ Genre కు తిరుగులేని ప్రఖ్యాతిని తెచ్చిపెట్టారు.

పైన పేర్కొనబడ్డ దర్శకుల సినిమాల స్థాయిలో లేనప్పటికీ 3:10 to Yuma ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి Western సినిమా.

మరీ ఎక్కువగా హడావుడి ఫైట్లు, గందరగోళం లేకుండా, సినిమాలోని పాత్రల మధ్య నడిచే మానసిక సంఘర్షణను చూపించడంలో పూర్తిగా సఫలం కాగలిగాడు దర్శకుడు.

ఈ సినిమాలో నిజంగా జరిగే ఫైట్లకంటే మాటలతో చేసే ఫైట్లే ఎక్కువ. రసెల్ క్రౌ శత్రువుని మానసకింగా దెబ్బతీసే పాత్రలో బాగా నటించాడు.

ఇంత చెప్తున్నానని మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమా చూస్తే మీకూ నచ్చవచ్చు. ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం.

నచ్చని అంశాలు:
సాధారణంగా western సినిమాల్లో కెమెరా విపరీతంగా అటు ఇటూ తిరగదు. కెమెరా కదలికలు పోయెటిక్ గా, స్మూత్ గా వుండి ఒక మెడిటేటివ్ శైళిలో వుంతుంది. కానీ ఈ సినిమాలో అలాంటి classicism లేకపోవడం అట్టే తెలిసిపోతుంది. ఇందులో కెమెరా ఈ మధ్య వచ్చే అన్ని సినిమాల్లా కొంచెం hand-held కెమెరా విధానంలో నడుస్తుంది. అందులో తప్పేమీ లేదు కానీ Genre convention లోపించందని మాత్రమే నా బాధ. ఇక పోతే ఈ సినిమా క్లైమాక్స్ చాలా నీరసపరిచేలా పేలవంగా వుంది. నిజానికి మొదటి గంట సినిమాలో వున్నంత పట్టు రెండో సగంలో లేదు.

మీరు గతంలో Fistful of Dollars, Once upon a time in the west, High noon, Unforgiven లాంటి సినిమాలు చుసి నచ్చివుంటే ఈ సినిమా కూడా చూడొచ్చు.

రసెల్ క్రౌ(A Beautiful Mind), క్రిస్టియన్ బాలే (Batman Begins) లాంటి సత్తా గలిగిన నటులే కాకుండా, 2005 లో 5 ఆస్కార్ అవార్డులకు నామినేషన్ పొందిన Walk the line సినిమాకు దర్శకత్వం వహించిన James Mangold దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో కొంచెం మంచి సినిమానే అని చెప్పొచ్చు.

3 Comments
  1. ASHRAY MAHADEV DESHARAJU March 27, 2008 /
  2. గిరి March 30, 2008 /
  3. sasank April 30, 2008 /