నిండు మనిషి శోభన్

Mar 23rd, 2008 | రచయిత: రాజేంద్ర కుమార్ దేవరపల్లి | వర్గాలు: ప్రముఖులువ్యాసాలు

sobhan_babu.JPGఇటీవల స్వర్గస్తులైన శోభన్ బాబు తన సుదీర్ఘ చలనచిత్రజీవితంలో అంతఃసంఘర్షణ,సామాజికనిబద్దత వాస్తవజీవితానికి దగ్గరగా నిలిచిన పాత్రల ద్వారా సాధారణప్రేక్షకులకు మాత్రమే కాక ఆనాటి విమర్శకులకూ అభిమాన నటుడయ్యారు.ఉదాహరణకు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం.చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబు ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం.శోభన్ బాబు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చిత్రం వీరాభిమన్యు.భారతయుద్ధం నాటి యుద్ధవ్యూహాలను అధ్భుతంగా చిత్రించిన ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ మరచిపోలేనివికాగా,శోభన్ బాబు,కాంచన ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రశంసనీయం.

గ్లామర్ హీరో,అందాలనటుడు అని పేరొచ్చినా శోభన్ బాబుకు డిగ్లామరైజుడ్ పాత్రల ద్వారానే తన స్థాయికి తగ్గ గుర్తింపూ,తృప్తీ కలిగాయి.చెల్లెలికాపురంలో బంగారం లాంటి మనసూ,కాళిదాసు లాంటి కవితాశక్తి ఉన్నా నల్లని మేని చాయ వల్ల తెరవెనుక ఉండిపోయే పాత్ర,అలాగే మానవుడు-దానవుడు లో పగలు ప్రాణాలు కాపాడే డాక్టరుగా,రాత్రిళ్ళు దుండగుల ఆట కట్టించే దానవుడు జగన్ గా శోభన్ బాబు చూపిన నటనాకౌశల్యం అనితరసాధ్యం అని చెప్పాలి.దేవాలయం చిత్రంలో గుండు చేయించుకుని,పూజారి కొడుకుగా,తర్వాత తప్పని సరి పరిస్దితుల్లో తండ్రి స్థానంలో పూజారి గా శోభన్ బాబు పోషించిన పాత్ర ఎవరికోగాని దక్కని అపురూపమైన అవకాశం.వ్యక్తిగత విశ్వాసాల వల్ల నాస్తికుడు కానీ,పరిస్తితులప్రాబల్యం వల్ల పూజారి గా విధి నిర్వహించాలి.పూజారి నాస్తికుడైనా భక్తులకు దైవసాన్నిధ్యంలో ఎలాంటి లోటూ కనిపించకుండా చేయటం,దశావతారాలను డార్విన్ పరిణామ సిద్ధాంతాల వెలుగులో విశ్లేషించటం ఈ సినిమాలోని మరో విశేషం.సామాన్య ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా మేధావుల మన్ననలు అశేషంగా పొందిన చిత్రం దేవాలయం.అలాంటి సినిమాలో అందాలనటుడిగా విఖ్యాతి గాంచిన శోభన్ బాబు ఏమాత్రం గ్లామర్ లేని పాత్ర పోషించటం పలువురిని ఆశ్చర్యం లో ముంచినా వ్యక్తిగా ఆయన మతనమ్మకాలకు సదరు సినిమా అద్దం పట్టటం అసలు వాస్తవం.

మదర్ తెరెసాను అభిమానించే శొభన్ బాబు ఆమె అంతిమశ్వాస విడిచినప్పుడొకసారి,అంత్యక్రియలకు ఒకసారి కలకత్తా వెళ్ళి నివాళులు అర్పించివచ్చారు.మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ వారికి శొభన్ బాబు చేసిన గుప్తదానాలు,ప్రచారార్భాటానికి దూరంగా,బహుదూరంగా ఆయన అందించిన భూరి విరాళాలు సంఖ్యాపరంగా లెక్కకు మిక్కిలి.

వయసులో తను కొంచెం పెద్దవాడైనా సమకాలికులైన నటుల్లో హీరో కృష్ణ తో శోభన్ బాబు కున్న అనుబంధం బహుశా ఏ భాషా చలనచిత్రపరిశ్రమలోనూ ఉండదేమో అనిపిస్తుంది.విచిత్రకుటుంబం,మంచి మిత్రులు,గూఢచారి116,మండేగుండెలు,ముందడుగు,కృష్ణార్జునులు,పుట్టినిల్లు-మెట్టినిల్లు,ప్రవేటుమాష్టారు, మహాసంగ్రామం, లక్ష్మీనివాసం, కురుక్షేత్రం, గంగ-మంగ,ఇలా చాలా సినిమాల్లో వాళ్ళిద్దరు కలసి నటించి రికార్డు సృష్టించారు.

శోభన్ బాబు నటించిన ఘరాన గంగులు చిత్రం ద్వారానే సిల్కు స్మిత తెలుగుతెరకు పరిచయం అయ్యింది.పారితోషికం విషయంలో పైసా కూడా వదలడని పేరొందిన శోభన్ బాబు అందరూ దొంగలే,పిచ్చిమారాజు అనే రెండు సినిమాలకు పైసా కూడా తీసుకోకుండా నటించిన సంగతి అతితక్కువమందికి మాత్రమే తెలిసిన సంగతి. ఏ విషయంలోనూ వేలెత్తి చూపించుకునే మచ్చ లేని వ్యక్తిత్వం,క్రమశిక్షణ,సమయపాలన,పాత్రకు న్యాయం చెయ్యటం, ఇతరుల శ్రేయస్సు తప్ప పొల్లు మాటలు ఆడకపోవటం,వృత్తిలో పూర్తి స్థాయి ప్రొఫెషనలిజం కనపర్ఛటం ఇలా చాలా అరుదైన లక్షణాలు శోభన్ బాబును విలక్షణ నటుడిగా,వ్యక్తిగా తీర్చి దిద్దాయి.
తెలుగు సినీసంగీత రంగంలోని కొన్ని అత్త్యుత్తమ మధుర గీతాలు శోభన్ బాబు మీద చిత్రీకరించబడ్డాయి.విచిత్రకుటుంబం లోని “ఆడవే జలకమ్ములాడవే “,సత్తెకాలపు సత్తెయ్య లోని “నన్ను ఎవరో తాకిరి”,వీరాభిమన్యు లోని “అదిగో నవలోకం”,ఇలా సుమారు ఒక దశాబ్దం పైన శోభన్ బాబు నటించిన ప్రతి సినిమాలోనూ ఒక మధురగీతం ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి తప్పనిసరిగా ఉండేది.

సంగీతం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ముచ్చటించుకుందాం.సంసారపక్షంగా ఉండే సినిమాలే ఐనా శోభన్ బాబు సినిమాల్లో,అల్లరీశ్వరి గా పేరొందిన యలారీశ్వరి పాటలు,వాటికి తెలుగు సినిమాలకు ఏనాటికీ తిరుగులేని సెక్స్ బాంబైన జ్యోతిలక్ష్మీ డాన్సులు విపరీతంగా జనం ఎగబడి చూసేవారు.

అమ్మమాట నుంచి “మాయదారి చిన్నోడు నామనసే లాగేసిండు”,ఇదాలోకం నుండి “గుడియనక నాసామి గుర్రమెక్కి కూర్చున్నాడు”,జీవితం నుంచి “మాయజెసి పోతివిరో నాగులూ”,ఈ విధంగా ఆ అల్లరీశ్వరి పాటలు దాదాపు ప్రతి సినిమాలోనూ అలరించేవి.

పౌరాణిక,జానపద,సాంఘిక,సినిమాల్లో నటించిన శోభన్ బాబు తనకెరీర్ మొత్తం మీద ఒకేఒక్క కౌబాయ్ సినిమా దెబ్బకు ఠా దొంగలముఠా లో,అలాగే జగత్ జెట్టీలు,జగత్ జెంత్రీలు తదితర క్రైం సినిమాల్లోనూ తన ప్రతిభను చూపారు.కిలాడిబుల్లోడు లాంటి మామూలు మాస్ మసాలా సినిమాలొ కూడా ” ఓమై లవ్లీ డార్లింగ్,లెట్ మీ టెల్ యు సంతింగ్” “ప్రతి పుట్టిన రోజూ పండుగా కాదు,ప్రతి రేయీ వెన్నెల రాదూ” లాంటి చక్కని గీతాలు శోభన్ బాబు కే స్వంతం.

ఫిల్మ్ ఫేర్ ఆవార్డులూ,నంది ఆవార్డులూ,క్రిటిక్స్ ఇచ్చే పురస్కారాలూ,ఇక ఆంధ్ర మహిళామణులు పట్టిన అభిమాన హారతులు అసంఖ్యాకం.

ఈ వ్యాసం శోభన్ బాబు సినీరంగప్రస్తానం పై గాని.ఆయన వ్యక్తిత్వంపై విశ్లేషణగానీ కాదు.నా జ్ఞాపకాలు,అనుభవాలు అక్కడక్కడ చదివి గుర్తుంచుకున్న అంశాలు తప్ప.ఎక్కడైనా పొరబాట్లు దొర్లి ఉంటే నా దృష్టికి తెస్తే సవరించుకుంటాను.

sobhan1.jpg

ట్యాగులు: , , ,

ఇవి కూడా చదవండి

శోభన్ బాబు - అశృనివాళి
Citizens and Subjects of Telugu Cinema

27 comments
దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి. »

  1. ఈ మధ్య చిరంజీవి చెప్పినట్లు శోభన్ బాబుతో అతను నటించిన సినిమాలు “మోసగాడు”,”చండీప్రియ” మాత్రమే కాక, “బంధాలు-అనుబంధాలు” అనే సినిమా కూడా ఉంది.ఇందులో శోభన్ బాబు,రంగనాధ్,చిరంజీవి,లక్ష్మీ ప్రధాన పాత్రధారులు.

    కె.రాఘవేంద్రరావు.బి.ఏ., దర్శకుడిగా మొదటి చిత్రం శోభన్ బాబు నటించిన “బాబు”.శోభన్ బాబు,వాణిశ్రీ,లక్ష్మీ,అరుణాఇరానీ (హిందీ నటి),గుమ్మడి,సత్యనారాయణ ప్రధానపాత్రధారులు.

  2. రాజేంద్ర గారూ,
    వ్యాసం చాలా బావుంది.చాలా సైట్లలోలా ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా కాకుండా మంచి వ్యాసం ద్వారా ఆయన్ను గుర్తు చేపించారు.
    కృతజ్ఞతలు

  3. బాగుందండీ వ్యాసం.
    ఒక మంచి నటుడిని మళ్ళీ గుర్తుకు తెచ్చారు.

  4. రాజేంద్ర గారు,
    చాలా చక్కని వ్యాసం. ధన్యవాదాలు.
    సినీరంగంలో విలువలతో ఎలా జీవించవచ్చో శోభన్ బాబు నలుగురికీ చూపారు. పరిశ్రమలో కొందరైనా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే,అదే ఆయనకి అసలైన నివాళి.

  5. చిమటా మ్యూజిక్ వారు శోభన్ బాబు,సంగీతదర్శకుడు చక్రవర్తి కలయికలో వచ్చిన కొన్ని మదురగీతాల మీద ప్రచురించిన చక్కని వ్యాసం కోసం ఈ లంకెను ఉపయోగించి చదవండి.
    http://www.chimatamusic.com/articles/sobhan-chakra.pdf

    శోభన్ బాబు చిత్రగీతాలను కూడా ఈ క్రింది లంకెలను ఉపయోగించి వినవచ్చు
    http://chimatamusic.com/solo_sobhan.php

    http://chimatamusic.com/duets_sobhan.php

  6. మీ వ్యాసం చాల విస్తారంగా వుంది. శోభన్ బాబు, చిరంజీవీ నటించిన ఇంకో చిత్రం కూడా వుంది. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో - “మోసగాడు” ఇందులో శ్రీదేవి కూడా వుంది. “ఎగరాలీ జాతీయ పతాకం ఎగరాలీ” అన్న పాట వుంటుంది.

  7. అవును చిన్నమయ్య గారు నేను పైన కామెంట్లలో ఆ సినిమా గురించి రాసాను చూడగలరు

  8. శోభన్ బాబు అంత్యక్రియలపై మన ఘనత వహించిన టీవీ చానళ్ళవారు చేసిన యాగీని ఆంధ్రభూమి పత్రిక ఎలా ఎత్తిపొడిచిందో ఇక్కడ చదవండి.

    http://visakhateeraana.blogspot.com/2008/03/blog-post_24.html

    లేదా
    http://andhrabhoomi.net/weakpoint.html

  9. The post by Saakshi in Andhra Bhoomi is a ‘fact’ but sad that the writer could not convey the meaning in a right manner. It is distasteful and vikaaram. I’m sure all the above people would have agreed with him provided he handled it with a sensitive and considerate terminology. I too felt the same but didn’t write about it simply bcoz i thought i wud commit the same mistake.

  10. Tappulennu varu tama tappulerugaru sumathi!

    adhi na vishayam lo ayina sunita chowdary gari vishayam lo ayina okate

    sobhanbabu garu chanipoyina rendo rojuna aayanaki , jayalalitha ki affair gurinchi aame blog lo rasaru. ikkada emo andhrabhoomi sastry gari rachana vikaram ga undhi antunnaru

    ofcourse aame tana blog lo nunchi aa article teesesaru anukondi timing bad ani

  11. రాజేంద్రా, ఈ వ్యాసం చాలా బాగా రాశారు. నటుడిగా శోభం ప్రస్థానాన్ని నెమరు వేసుకోవడమే కాకుండా ఎక్కువగా తెలియని దేవాలయం వంటి సినిమాలని గురించి చెప్పటం చాలా సంతోషం. ఆయన మహా నటుడని నేనెప్పుడూ అనుకోలేదు గానీ ఓవరేక్షన్‌ లేకుండా, తన పరిధికి తగిన పాత్రలను ఎంచుకుంటూ టేస్ట్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు చాలా ఇచ్చారు. అన్నిటికన్న మెచ్చుకోవాల్సిన విషయం, నటన నించి వైదొలగాలి అనుకున్నాక లాగుడు పీకుళ్ళు లేకుండా పూర్తిగా వైదొలిగి తన పనిలో తాను లీనమవటం .. చాలా మంది సినిమావాళ్ళు నేర్చుకోవలసిన పాఠం!

  12. ధన్యవాదాలు గురువు గారు,స్థలవిస్తరణభీతితో చాలా క్లుప్తంగా ముగించాను.వృత్తిపరంగా.వ్యక్తిగతంగా శోభన్ బాబు దెప్పుడూ కన్నుపోయేంత కాటుక పెట్టుకోకూడనేదన్న ముందుచూపనేది నా అంచనా.

  13. రాజేంద్ర గారూ,

    మీ వ్యాసం బాగుంది. శోభన్ బాబు గారు చేసిన కొన్ని పాత్రలు చూస్తుంటే, ఆయన నిజ జీవితంలో కూడా అల్లాగే ఉంటారేమో అనిపిస్తుంది, ఆదర్శవాదిగా, సున్నితంగా ! ఉదాహరణకి బలిపీఠం, కాలం మారింది, దేవాలయం, చెల్లిలి కాపురం, మల్లెపూవు వంటి సినిమాలు!

    ఆయన మరణం వల్ల కలిగిన బాధని ఇంతమంది, ఇవాళ ఇన్ని విధాలుగా పంచుకుంటున్నారంటే, కేవలం ఆయన నటన మాత్రమే కారణం కాదు, ఆయన క్రమ శిక్షణ, ప్లెయిన్ గా ఉండే జీవన విధానం కూడా అనిపిస్తోంది!

    పోయాక 24 గంటలు గడిస్తే, ఎంత అందమైన మొహమైనా వికారంగా నే మారుతుంది. అయినా, చితి మండే ద్రుశ్యాలు చూడటం , అందునా మన మనసుల్లో, అందాల నటుడిగా ముద్ర వేసుకున్న శోభన్ బాబు అలా కాలి బూడిదై పోతుంటే, మనసుకి చాలా కష్టంగా అనిపించింది.

    కానీ,ఇవాళ మీడియాకి అపరిమిత స్వేచ్చ ఇలాంటివి సంభవిస్తున్నాయి. చంద్రబాబు అన్నట్టు, మీడియా పరిమితుల మీద చర్చ జరగాలి .

  14. Andhrabhoomi raasina daantlo yemi thappundo naaku theliyadu. Kaani aayan poyina tharvaatha pogadthalu aakaasaani ki antuthunnaayi.

    Anjali Devi gaaru cheppina daantlo yentha nijam vunnado theliyadu.”Ye roju okka tablet vesukoni manishi” ani cheppindi. kaani aayana ku BP vundi. yeppati nuncho tablets vaaduthunnaaru(around 10 years nunchi anukontaa).

    ilaa vuntaayi yi pedha vaallu cheppe maatalu.

  15. Shobahn babu chesina daanaalu gurinchi naaku theliyadu. aayana chesindi “Gupatha daanaalu” ani chebuthunnaaru. antha guptham gaa chesthe, mari villandari ki yelaa thelisaayo naaku ardham kaavadam ledu. Theliyani vaatini gurinchi burralu badhalu kottukone kanna, thelisina vaati pai drusti pettadam manchidi.

    Shobhan Babu thana dagagra pani chese pani manushula kosam oka houses kattinchaadani appatlo apper lo paratinchi photo lu kuda veyinchukonnaaru. shobhan babu gaari inti gate ki avthala compound lo vuntaayi ippati ki. Yi jouranlists oka saari velli aa houses consitions, aa pani vaalla living conditions chudandi. vilu vunte aayaana maranam thaluku saanubhuthi challa badi naaka velli vaalla ne adagandi yentha jitham isthunnaadu? yeklaa chusukonnaadu? ane sangathulu.

    Chani poyina pramukhudu ni gurinchi avamaaninchadaani ki idi raayadam ledu. Kalla mundu kanapadina vishayaale, mana kalla mundu intha vakrikarana jaruguthunte, ika paatha kaalam pramukhulanu gurinchi raase articles llo yentha maatram nijam vundi? inkaa ynetha aakaasaani ki yethuthunnaaro? ane anumaanam vasthondi.

  16. Aayana records mida discuss cheyyochu. Nijam gaa vunna manchi qualites mida charcha jaragochu. kaani intha batraaju pogadthalu avasaramaa??

    Shobhan babu ku ‘guptha daanaalu’ chese vaade ayithe than inti daggra (Nelson Manickam Road) kattinchina chinna bus stop mida antha pedha akshraala tho Shobhan Babu peru yenduku veyinchukonnaaro ardham kaavadam ledu.

    Am i missing some thing?

  17. కలికాలం గారూ,
    కలికాలమే ఇది. చూస్తుంటే మీరు చెప్పిందీ నిజమే అనిపిస్తోంది. అయినా పోయినోళ్ళు గొప్పోళ్ళు అని ఏదో సామెత వుందిగా (వుందా?). అందుకే జనాలు ఆయన్ని గొప్ప అని పొగిడి వుంటారు. మన సునీత అక్కయ్య ఈ టైమ్ లోనే శొభన్ -జయలలిత గురించి కూడా ఏదో రాశారుగా…మీ అభిప్రాయంతో ఇప్పుడూ పాజిటివ్-నెగిటివ్ కలిసి న్యూట్రల్ అయిందనుకుంటా…:-)

  18. “a paatha kaalam pramukhulanu gurinchi raase articles llo yentha maatram nijam vundi?”
    లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నారుగా…అలా ఏది నిజమో ఎవరికి తెలుసు చెప్పండి. ఎవరి అభిప్రాయాలు వారివి. పాత కాలం ప్రముఖుల గురించి మీకు తెలిసిన నిజాలు వెలికితీయండి. చర్చిద్దాం. మీ వాదనతో నేను ఏకీభవిస్తాను. పాత వాళ్ళందరూ గొప్ప అని నేనూ ఒప్పుకోను. కాకపోతే ప్రతి మనిషిలో పాజిటివ్-నెగటివ్ పాయింట్స్ వుంటాయి. గాంధీ లాంటి వాడినే తిట్టిపోస్తున్న జనాలు లేకపోలేదు. అలాంటప్పుడు పోయినోళ్ళ వీక్‍నెస్ లు వదిలి వారి వారి మంచితనం గ్రహించి కొంతైనా నేర్చుకుంటే పోలా?

  19. sagatujeevi gaaru,
    nenu cheppedi kuda ade. Yedi ayinaa vishyam raasetappudu jouranlists nigraham kolpokudadu. ‘guddi yedhu chelo paddatlu” gaa saanubhuthi ayinaa, vimarsa ayinaa ponguku vasthu vuntundi mana vaallaku. limits vundatam ledu.

    aa limits lo vuntu, aaya vyakthula ku vunna positive gunaalanu highlight cheyya vachu. negative gunaalanu samayaanu kulam gaa ignore cheyyavachu. kaani leni qualities ni aapaadisthu raasthunnaaru. ade vintha gaa vuntundi naaku. Deni kosam idi chesthaaro ardham kaadu.

  20. sunita akkayya laagaa negative, anjalidevi laagaa ‘Historical lies” rendu kudaa vunda kudadu ani nenu cheppedi.

  21. @కలికాలం
    ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడ జ్యోతి గారు, రాజేంద్రగారు రాసిన వ్యాసాల్లో మీరన్నట్టు గుడ్డెద్దు చేలోపడ్డట్టు లేవని నాకనిపిస్తుంది. వీళ్ళు జర్నలిస్టులు కారుగా అందుకనేమో :-)

  22. Rajendra Kumar gary,

    Mee article lo prasthavinchina vishayaalu baagunnaayi. Mukhyamgaa Devaalayam, Balipeetam, Maanavudu Daanvavudu la gurinchi. Alaage Kaalam Maarindhi chithram koodaa oka udhaaharanagaa cheppavacchu. agra kulaaniki chendhi koodaa koka harijana sthreenu preminchi pelladina paathralo Shobhan sharada lu 3 yellake reverselo Balipeetam chithramlo natinchadam rendu cinemaalu vijayavantham kaavadam vishesham. Oka hero peak periodlo vunnappudu Kaalam Maarindhi Balipeetam laanti challenging roles cheyadam katthi meeda saame. Ainaa Shobhan vijayvanthamgaa cheyagaligaadu. Prekshakulu koodaa choodagaligaaru. Adhe natudigaa aayaana saadhinchina ghanatha.

  23. Kalikaalam,

    //Andhrabhoomi raasina daantlo yemi thappundo naaku theliyadu. Kaani aayan poyina tharvaatha pogadthalu aakaasaani ki antuthunnaayi.//

    Meeku chaalaa baadhagaa vunnatlundhe aayananu poguduthoo vunte.

    //Anjali Devi gaaru cheppina daantlo yentha nijam vunnado theliyadu.”Ye roju okka tablet vesukoni manishi” ani cheppindi. kaani aayana ku BP vundi. yeppati nuncho tablets vaaduthunnaaru(around 10 years nunchi anukontaa).//
    ilaa vuntaayi yi pedha vaallu cheppe maatalu.//

    Aayanku BP vundedhi ani meeru prove cheyagalaraa?

    //Andulo historical lie emi kanabadinadhi meeku? Vintha kaakapothe?

    Shobhan thana natajeevithamlo oke okkasaari over exertion valla injection theesukunnaadu 1971 lo Bangaaru thalli shootinglo. Aa vishayam gurinche Anjali devi gaaru cheppaaru. Aayana aarogyam gurinchi alavaatla gurinchi parishramalo andarikee telisinadhe aame cheppaaru. Andhulo aame athishayokthi gaa emi cheppindho meeku yelaa artham aiandho naaku artham kaavatledhu.

    //shobahn babu chesina daanaalu gurinchi naaku theliyadu. aayana chesindi “Gupatha daanaalu” ani chebuthunnaaru. antha guptham gaa chesthe, mari villandari ki yelaa thelisaayo naaku ardham kaavadam ledu. Theliyani vaatini gurinchi burralu badhalu kottukone kanna, thelisina vaati pai drusti pettadam manchidi.//

    Meeku theliyadhani chebuthunnaaru alaantappudu meeru vaati gurinchi endhuku maatlaadatharu?

    Guptha daanaalu ante paper ku patrikalaku 10,000 icchi laksha publicity korukune kondari herola maadhiri kaakundaa thaanu sahaayamu cheyaalani anukune vaallaku sahaayam cheyadam daaniki publicity avasaram ledhanukovadam. Alaa sahaayam chesinappudu konthamandhiki telusu Kaanee avannee ippudu enduku chebuthunnaaru vaallu? inthaku mundhu eppudoo cheppaledhe. Endukante aayanaku alaantivaati gurinchi prachaaram cheyadam istam ledhu kaabatti. Evaainaa chanipoyinappudu aa manishi manchithanam gurinche chebuthaaru kaabatti evariki theisindhi vaallu chebuthannaaru. Daaniki meeru baadha padalsina avasaram yemiti?

    //Shobhan Babu thana dagagra pani chese pani manushula kosam oka houses kattinchaadani appatlo apper lo paratinchi photo lu kuda veyinchukonnaaru. shobhan babu gaari inti gate ki avthala compound lo vuntaayi ippati ki. Yi jouranlists oka saari velli aa houses consitions, aa pani vaalla living conditions chudandi. vilu vunte aayaana maranam thaluku saanubhuthi challa badi naaka velli vaalla ne adagandi yentha jitham isthunnaadu? yeklaa chusukonnaadu? ane sangathulu.

    Panivalla kosam oka illu kaadhu varusagaa chaalaa illu katinchaadu. Vaalla current bill koodaa vaallu kattukoru aayane kattevaadu.

    Meeku thelusaa vaallu (Shobhan inti pani vaallu) nelaa nelaa entha current waste chesthaaro aa illallo?

    Vaallaku pilallu pudithe aadapilaa aithe 2 lakshalu maga bidda aithe oka laksha fixed deposit veshevaadu Shobhan. Avanee tehliyakundaa noti kocchinadhi maatladithe yelaa?

    //Chani poyina pramukhudu ni gurinchi avamaaninchadaani ki idi raayadam ledu.
    Poorthigaa vivaraalu theliyakundaa meeru ippudu raasinadhi mari yemiti? Meeru chesthunna pani adhe kadhaa?

    //Kalla mundu kanapadina vishayaale, mana kalla mundu intha vakrikarana jaruguthunte, ika paatha kaalam pramukhulanu gurinchi raase articles llo yentha maatram nijam vundi? inkaa ynetha aakaasaani ki yethuthunnaaro? ane anumaanam vasthondi.

    Manishi chanipoyinappudu manaku istam lekapothe pogadakkarledhu kaanee vimarshinchakoodadhu. Alaage pogide vaallanu vimarshinchakandi. Meeru samskaaravanthulaithe aa pani cheyandi. Ika pothe vilekharulu Shobhan gurinchi raayataaniki vaallanu Shobhan babu eppudoo encourage cheyaledhu. Idhi andarikee thelisina vishayame. TV9 live coverage valla lakshala mandhi choodagaligaaru. TV9 camera pani cheyakapovadam valla live coverage lekapoyindhi lekapothe live coverage vacchedhi. Valla TRP ratings entha perigaayo vaallane kanukkondi. Indhulo Andhrabhumi ni kaanee yevarinee thappu pattaalsina pani ledhu. Manishi chanipoyaaka evarainaa alaage vuntaaru. Kanee andhrabhumi vilekhari raasina paddhati bagaaledhu.

    //Aayana records mida discuss cheyyochu. Nijam gaa vunna manchi qualites mida charcha jaragochu. kaani intha batraaju pogadthalu avasaramaa??//
    Vaallevaro evarino pogidithe meeku badha yemitidhi? Annee manakistamainatlu manakistamainavaarine pogadaalante yelaa? Come on man cheer up.

    Shobhan babu ku ‘guptha daanaalu’ chese vaade ayithe than inti daggra (Nelson Manickam Road) kattinchina chinna bus stop mida antha pedha akshraala tho Shobhan Babu peru yenduku veyinchukonnaaro ardham kaavadam ledu.

    Akkada enthamandhiki theluso cheppandi Shobhan peru? Aayanakaa keerthi kadhoothi vunte meeru asalu bharincheleni vidhamgaa vundedhi paristhithi.

    //Am i missing some thing?
    You are missing two things: common sense (You should not talk about things which you do not know completely) and timing (to show your hatredness).

    //nenu cheppedi kuda ade. Yedi ayinaa vishyam raasetappudu jouranlists nigraham kolpokudadu. ‘guddi yedhu chelo paddatlu” gaa saanubhuthi ayinaa, vimarsa ayinaa ponguku vasthu vuntundi mana vaallaku. limits vundatam ledu.
    Mare adhe journalistlu vaaram koodaa sariggaa aadani cinemaalalo natinche oka hero peru mundhu superstar ani aa star anee ani birudhulu tagilisthe correctaa mee uddheshamlo?
    //aa limits lo vuntu, aaya vyakthula ku vunna positive gunaalanu highlight cheyya vachu. negative gunaalanu samayaanu kulam gaa ignore cheyyavachu. kaani leni qualities ni aapaadisthu raasthunnaaru. ade vintha gaa vuntundi naaku. Deni kosam idi chesthaaro ardham kaadu.//

    Lenivemee thagilichataledhu. Shobhan eppudoo vilekharulaku dabbulicchi thana gurinchi baagaa raayamani cheppaledhu. Adhi cine parishrmalo andarikee telusu. Meeku koodaa telusani anukuntunnaanu. Ippudu evarinaa raasthunnarante adhi kevalam abhimaanam thone. Andulo mare uddesham ledhu.

    //sunita akkayya laagaa negative kudaa vunda kudadu ani nenu cheppedi.
    Aameku anubhavam thakkuva aavesham ekkuva. Kanee thana thappu thaanu teluskundhigaa tharvaatha (timing gurinchi)?

    Kalikaalam

    I want to tell you onething. Leniponivi Shobhan gurinchi chebuthunnaaru ani thega baadhapadipoyaaru meeru. Avi oka manishi gurinchi cheppe manchi maatalu. Vaati gurinche meeru antha baadhapadipothe oka manishi gurinchi chedugaa matlaadithe (avi nijaaliu kaakapothe) inkentha badha padaali? Adhee eppudu manishi chanipoyinappudu. I think everybody got the meaning between talking about good and talking about bad that too after a person’s death.

  24. Vijay gaaru,
    Chaalaa late gaa chusaanu mi post. I do not know weather it is good or bad to discuss at this time. i am out of this this discussion at this time.

    Kaani shobhan babu mida kaksha tho nenu avi raayaledu. Navatarangam pettina dagagra nunchi naa posts chudandi.

    “paatha goppa.Kotha rotha” ane daani ni nenu vyathirekisthune vunnaanu. Ippude kaadu ..yeppudu kudaa.

    Naa posts chusthe… yekkadaa naaku theliyanivi cheppaledu. naaku chaalaa vishayaalu theliyavu(especially collections..technical vishyaalu etc).

    Kaani cinema vaalla ku vunna hypocracy ki thodu..crics hypocracy ni saitham nenu khandisthaanu. cinema vaalla double standards yedo oka time lo ardham avuthaayi chuse vaalla ku.

    kaani critics chesedi chaalaa dangerous. print lo vunandi nijam ani namme vaallu yekkuva(ippati ki).Oka popular figure gurinchi raasetappudu vurike “bhajanthri’ attitude tho raayakudadu. Prasad gaaru “padakkurchi kaburlu” chudandi..yentha neat gaa vuntaayo..Saavitri gaari gurinchi raasthu “she literally messed up her finances” ani raasaaru. vaalla plus points raasthune..kaastha anna nijam raayaali anedi naa abhipraayam

  25. Kalikalam

    Nuvvu manasulo edo pettukuni rasinattu undi.

    Shobhan acted free in two movies, which were produced for the production staff. Aa times ki, top four lo okade kada. Show me one other hero, who did that gesture.

    Panimanushulaki illu inka ye hero ayina kattinchada? Valla living conditions ani neekedo pedda thelisinattu pose. Sontha illu vunna pani manushulu entha mandi untaru?

  26. A mis-timed and unnecessary post Mr.Kalikalam. Whether the bus-stop in NMR bears Sobhan’s name or If he had BP and on medication..How/Why should that matter ? The author started this as a Tribute to the deceased Actor and IMHO there is absolutely NO NEED for your hypocrytic remarks here. I said hypocritic coz you are trying to cover-up your silly posting by saying you never had any hatred for Sobhan but again did not like what the jurnos wrote and all. If you don’t like what the film jurons write write-it up somewhere else OR even mention as if you would like to see a more balanced wrtite-up from them or etc. Why should we talk any ill/half-truths about Shobhan. Please stop judging people especially the deceased.

  27. kali kaalam gari idhi nijam gaa kali kaalam ani manaki gurthu cheyataniki try chestunnaru. poyina aayana gurinchi (unnavi, lenivi )tidithey tappa idi kali kaalam avadu anukunnaremo.

దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి.