పేరు:వేమ వెంకట గిరి వర ప్రసాద్
పుట్టింది పెరిగింది:గేటు గట్టు పాళెం, నందనవనం, ప్రకాశం జిల్లా
చదువు: ఇంటర్ వరకూ ప్రకాశం జిల్లాలో, డిప్లొమో : పాడేరు, విశాఖ జిల్లా, డిగ్రీ: కావలి
సినిమాలపై ఆసక్తి: నాకు చిన్ననాటినుంచీ నాటకాల పై ఆసక్తి. ఊర్లో పెద్దలు ప్రదర్శించే నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. కొన్నాళ్ళకు వాళ్ళు నాట్కాలు వేయడం మానేసాక స్వంతంగా నాటక రచన చేసి ప్రదర్శించడం మొదలుపెట్టాను.పై చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళినా నాటకాన్ని మాత్రం మర్చిపోలేదు. పాడేరు కళాశాలలో ఉత్తమ నాటక రచయిత, ఉత్తమ నటుడు అవార్డులు, కావలిలో మరి కొన్ని అవార్డులు.
మొదటి అడుగు: కళాశాలలో నా నాటకాలు మెచ్చిన కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో హైదరాబాదు ప్రయాణం అయ్యాను. కొన్నాళ్ళ పాటు గేయ రచయితగా అవకాశం కోసం ప్రయత్నాలు చేసి, చేతిలో వున్న డబ్బులు అయిపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటిలో కెమెరా డిపార్ట్మెంట్ లో చేరాను. మూడేళ్ళ పాటు అక్కడ ఉద్యోగం చేసాక, కొన్నాళ్ళ పాటు సానా యాది రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రచయితగానూ పనిచేసాను. దాదాపు ఆరేళ్ళ నా కష్టానికి ప్రతిఫలం ‘నీ నవ్వే చాలు ‘ సినిమా తో మాటల రచయితగా నా పేరు వెండితెర పై చూసుకోవడం.
రాళ్ళు గురించి: నేను సినిమాల్లో పనిచేస్తుండగా వేరే ఎవరికోసమో సిధ్ధం చేసిన ఈ కథ, ఆయన కాదనడంతో, ఇదే కథతో నేనే సినిమా తీయాలన్న పట్టుదల కలిగింది. ఈ లోపల చాలా రోజులగా నా కోసం వెతుకుతున్న నా మిత్రుడు (శ్రీ రాం) అనుకోకుండా కలవడం, అతనికి ఈ కథ చెప్పడం, అతనికి ఈ కథ నచ్చి తనే సినిమా నిర్మిస్తాననడంతో నా కల నిజమైంది.
సినిమా నిర్మాణం గురించి:రాళ్ళు సినిమాకి బడ్జెట్ 2 లక్షలే అయినా, మా స్థాయికి అది చాలా ఎక్కువే! ఆ రెండు లక్షలు ఇప్పుడు తిరిగి ఎలా రాబట్టుకోవాలో తెలియదు. లఘు చిత్రాలకు ఆదరణ మన దగ్గర అంతగా లేదనే చెప్పాలి. హైదరాబాదు ఫిల్మ్ ఫెస్టివల్ కారణం గా ఇప్పుడిప్పుడే చాలా మంది డిజిటల్ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. నాకు శ్రీ రాం లాంటి నిర్మాత దొరకడం నా అధృష్టం. అలాగే కథ చెప్పగానే అంగీకరించి తన బిజీ షెడ్యూల్ లో ఈ సినిమా కోసం సమయం కేటాయించి, ఎటువంటి పారితోషకం తీసుకోకుండానే ఈ సినిమాలో నటించిన L B శ్రీ రాం గారికి నేనెంతో ఋణపడివుంటాను.
తదుపరి ప్రయత్నాలు: ప్రస్తుతానికి మరిన్ని సినిమాలకు మాటల రచయితగా అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ‘రాళ్ళు ‘ లాంటి మరిన్ని అర్థవంతమైన సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తాను.
గమనిక:రాళ్ళు సినిమా సమీక్ష ఇక్కడ చదవొచ్చు
రాకేశ్వర రావు says:
హిఫ్ లో ఈ సినిమా నేను చూసాను… కానీ సగమే చూసానని కి చింతుస్తున్నాను.
నేను చూసిన రెండవార్ధం నాకు బాగా నచ్చింది…
ఇక వేమ గిరి నా ప్రక్కనే కూర్చున్నారు.
సినిమా బాగున్నందుకు ఆయనకి నా అభినందనలు…
ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎకసట్రాల ‘నటన’ చాలా నిరాశాజనకంగా వుంది.
అది ఈ సినిమాకే ప్రత్యేకం కాదనుకోండి. ఏ తెలుగు సినిమా చూసినా అదే బాగోతం.
వాళ్లు డీటెయిల్సు కాబట్టి , అంత attention to detail మన దర్శకులకు ఇంకా రాలేదేమో..
ఇంతకూ నేను చెప్పేదేంటంటే.. అంతా బాగున్నా సినిమాని ఇలా జూనియర్ నటులో ఇతరులో క్రిందకు లాగేయడం దుఃఖదాయకం..
వెంకట్ says:
రాళ్ళు ప్రోమో ఈ క్రింది లింకులో చూడొచ్చు.
http://www.greatandhra.com/videos/viewvideo.php?id=370&cat=11
కొత్తపాళీ says:
చాలా ఆసక్తికరంగా ఉంది ఈ సినిమా గురించి తెలుసుకోడమూ, దర్శకుని పరిచయం చేసుకోడమూ. ఆంధ్ర దేశంలోనే కాదు ప్రపంచమంతటా చిన్ని చిత్రాలకి పట్టిన గ్రహణమే ఇది. డీవీడీలద్వారా మార్కెట్ చెయ్యటం ఒక పద్ధతి. ఇటువంటి లఘు చిత్రాలని వెలుగులోకి తెచ్చి టేలెంట్ గల కొత్త దర్శకులని ప్రోత్సహించడంలో అనేక నగరాలలో ఉన్న ఫిలిం క్లబ్బులు కీలక పాత్ర పోషించవచ్చు.
Koresh says:
mii arthi ki abhinandanalu, all the best
kalikaalam says:
Yilaanti release kaani movies, short films chudataaniki yedaina web resource vundaa??
vunte konchem cheppandi. Oka short film thiyyaalni korika gaa vundi. nenu yemi pedha cinema expert ni kaadu. Kaani ” the situation of villages in the era of economic development” ane concept tho oka short film thiyyaalni korika.
kalikaalam says:
Venkat gaaru,
Got the details in the DB. Thanks for your immidiate responce.