The Accused-నిందుతులు

ఈ చిత్రం 1988లొ విడుదల అయ్యింది. జోడి ఫొస్టెర్ కి మొట్టమొదట ఆస్కర్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. ఈ చిత్రం అప్పుడు చాల వివాదాస్పదం అయింది. దానికి కారణం కధావస్తువు. Sarah Tobais ఒక రాత్రి ఒక చవకబారు బార్లొ సాముహిక బలాత్కారానికి గురి అవుతుంది. ఆమే నేరస్తులని గుర్తుపట్టినా వాళ్ళని తొమ్మిది నెలల శిక్షతో వదిలేస్తారు. కారణం ఆమె ఆరొజు గంజాయి తాగిఉండడం, వస్త్రధారణ ఇంకా ప్రవర్తన మూలంగా కేసు గెలవరని నేరస్తులతో ఒప్పందానికి వస్తారు. ఒక సంఘటనతో ఆమె లాయరు ఆ బలాత్కారానికి cheer చెసిన మనుషలని మీద కేసు పెడుతుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనల అధారంగా తీసిన చిత్రం. ఈ చిత్రం ప్రాచుర్యం పొందడానికి కారణాలు చాలేనే ఉన్నయి. ఒకటి జొడి ఫొస్టెర్ నటన. ఆమె victimగా చాలా బాగా నటినంచింది. ఇంకొటి ఈ చిత్రం లేవనెత్తిన అంశాలు. అసలు rape victimsకి ఉన్న అధికారాలు ఏమిటి? ఆమె ప్రవర్తన బావులేనంతమాత్రాన ఆమెని బాలత్కరించవచ్చా? ఒక అమ్మయి తన మీద జరిగిన అత్యాచారానికి ఎంతవరుకు బాధ్యురాలు? నాకు నచ్చిన మరొక విషయం settings చాల naturalగా ఉండడం. ఈ చిత్రం నేను చూసిన అత్యుత్తమ మహిళా చిత్రాలలో ఒకటి. నా ఉద్దేశం ప్రకారం ఇది అందరూ చూడవలసిన చిత్రం. కాని ఒక హెచ్చరిక. చివరలొ చూపించిన rape scene చాల graphicగా ఉంది. మీరు దానికి prepare అవ్వాలి.

–మంజుల

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుమన సినిమా – మొదటి భాగంగోదావరి లొ గూఫులు

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

3 Comments to “The Accused-నిందుతులు”

  • నిందితులు అని ఉండాలి మంజుల గారు,జోడీ ఫోస్టర్ చూపులు మనలను నిలదీసినట్లు ఉంటాయి,సూటిగా,వాడిగా,తన కళ్ళు జోడీకి మంచి ఎస్సెట్,మావెరిక్ సినిమాలో మెల్ గిబ్సన్ న్ను దద్దమ్మను చేసే సన్నివేశాల్లో నాకు కడుపు చెక్కలయి పోయింది.సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ సినిమాలో ఆంథొని హాప్కిన్స్ తో పోటీపడిందా లేక నటనలో అధిగమించిందా అనేది ఇన్నిఏళ్ళతర్వాత కూడా నాకు అంతుబట్టలేదు.మంచిసినిమా,మంచి నటీమణి గురించి తెలియజేసినందుకు చాలా థాంక్స్

  • Thanks for pointing out the mistake. I will correct it.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories