పది నిమిషాలు
మనమెన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ అందులో ఎన్ని సినిమాలు మన జీవితకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి? నిన్న రాత్రి నేను చూసిన ఈ పది నిమిషాల లఘు చిత్రం మాత్రం నాకు మరో జీవితకాలం గుర్తుంచుకునే అనుభూతిని మిగిల్చింది. మనసున్న ప్రతి మనిషి మనసును కదిలించగలిగే ఈ పది నిమిషాల సినిమా పేరు కూడా పదినిమిషాలే (10 minutes).Bosnia-Herzegovina దేశానికి చెందిన Ahmed Imamovic దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002 లో యూరొప్ లో కెల్లా అత్యుత్తమ లఘు చిత్రం గా కూడా ఎన్నుకోబడింది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ముందు ఈ సినిమా చూసి ఆ తర్వాత చదవండి.
ఇప్పటికే సినిమా చూసేసి వుంటే కథ గురించి మీకు మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా! కానీ మొదటి సీన్లో పదినిమిషాల్లో ఫోటోలు ముద్రించగల సాంకేతికత మనం పొందుపర్చుకున్నాము కానీ యుధ్ధాల పేరుతో పదినిమషాల్లో జీవితాలు, జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులు, రాబోయే జీవితం గురించిన కలలు కళ్ళముందే కరిగి కన్నీరై రక్తంలో కలిసి ప్రవహిస్తుంటే ఆపే వారెవరు? అని ఈ సినిమా ప్రశ్నిస్తుంది.
ఈ సినిమా కథాపరంగా అధ్భుతంగా వున్నప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సాంకేతిక అంశాలు మరో ఎత్తుకి తీసుకెళ్తాయి. మీరు గమనించారో లేదో కానీ రెండో సీను మొదలయ్యి సినిమా అయ్యే వరకూ ఒక్క కట్ కూడా లేకుండా ఆ సీనును చిత్రీకరించడం ఎంత కష్టమో అలోచించండి. అసలు కెమెరా ఎక్కడ పెట్టారు? ఎలా ఆ ఇంట్లోనుంచి, వీధిలోకి కట్ లేకుండా ఆ పిల్లాడిని వెంబడిస్తూ మనమే అతని వెనక నడుస్తున్నామా అన్నట్టుగా ఆ సీను చిత్రీకరించడం అంత సులువు కాదు. కావాలంటే మరో సారి చూడండి.2:30 సమయం నుండి సినిమా చివరిదాకా కట్ లేకుండా ఒకే extended take లో వచ్చిన సీన్లు, నాకు తెలిసి , ప్రపంచ సినీ చరిత్రలో చాలా అరుదు.
Filed Under: లఘు చిత్రాలు • వీడియో
[...] పది నిమిషాలు [...]
mind blowing film, thanks a lot for you to given me a aportunity to watch this film…it’s amazing..i like it….
Hi This is Jonathan from india. I’m independent filmmaker i made two short films, and i’m planing to make another short film, plz let me know if any one would like to produce my script.
see my films here http://www.jonathanswork.com
Thanks,
Jonathan