నంది బహుమతులు

ఇప్పుడే వీటి గురించి చదివాను. ఉత్తమచిత్రం బొమ్మరిల్లు. ఉత్తమ నటుడు నాగార్జున మరి ఉత్తమ దర్శకుడు శెఖర్ కుమ్ముల. నేను రామదాసు చిత్రం చూడలేదు. కాని ఆ చిత్రం pictures చూశాను. కనీసం వేషధారణ విషయంలొ కూడ శ్రధ్ధ తీసుకోని వాడికి ఉత్తమ నటుడి బహుమతి ఏమిటి?

ఇకపోతే బొమ్మరిల్లు. ఆ చిత్రం చివరి వరుకు కూడా కూర్చొలేకపోయాను. కొంతసేపు ఆ హీరొయిను పాత్ర mentally retarded ఎమో అనుకున్నను కాని కాదు. అది ఉత్తమ చిత్రం. మొన్ననే మనం గోదావరి గురించి చర్చించుకున్నాం. ఆ దర్శకుడు ఉత్తమ దర్శకుడు. చలనచిత్రసీమ అధోగతి ఇదే కాబోలు.

ఇంకే చిత్రాలు మంచివి గత సంవత్సరంలో రాలేదా?

Disclaimer: ఇది తిక్కలో రాసిన బ్లాగు. నన్ను తిట్టవచ్చు. నేను ఏమీ అనుకోను.

–మంజుల

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

32 Comments to “నంది బహుమతులు”

  • మీకు తప్పకుండా తిట్లు వస్తాయి,కాస్త మెల్లగా,ఒక వైపు నంది విజేతలు,మరో వైపు
    ప్రసారసాధనాలు హోరెత్తిస్తున్న్నాయి.ఇంత మంచి ఎంపిక ఈ మధ్య కాలంలో అసలు జరగలెదని.

  • Hi

    Asalu me problme enti? endhukantha chiraku meku.

    cool man cool.get some water and leave the comment :D

  • ఇంకే చిత్రాలు మంచివి గత సంవత్సరంలో రాలేదా?

    Last year vachina cinemalalo veetiki Nandhi award ravadam samanjasame.

    Kakapothe nadoka chinna sandeham. International Film Festivals lo awards vache “Sira” Modalagu samanthara cinemalaku mana Nandhi Awards endukukani Evvaru, avi manadaggara release avaledana lekapothe Nandhi awards ki entry pampinchakana????????

  • తిట్టడానికేముందండీ!
    మీరన్నది నిజమే. అన్నమయ్య సినిమాకి కొత్త రంగు పూసి రామదాసు అని పేరుపెట్టారు. మరి గోదావరికి ఉత్తమ దర్శకుడు అవార్డు అంటే మన దర్శకత్వ స్థాయి ఊహించవచ్చు. ఒక్కటే మంచి డెసిషన్ ఇక్కడ, నందితా దాస్ కి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం.

  • in awards you can observe the following

    1. The best picture cannot be picturised by best director
    2. The best actor will not act in best picture / will not work with best director
    3. The best director cannot direct best picture.

    you know why?
    the awards will not be based on quality etc etc. just based on lobby

  • Finally I have found someone who shares my view. I too felt that Genelia was a retarded character in Bommarillu, kaani andharu daanini…ante that type of acting and behaviour ni innocence ani annaru. Infact I felt Godavari stood a better chance. Stupendous performances, nice concept.

    And everyone is saying Nag took a risk and acted in Sri Ramadasu. We are appreciative about his experiments but where is the risk…how can you take a risk at the fag end of your career? He is indeed a good actor and it was a good performance but I doubt it if it deserves merit. If evoking ‘tears’ is a criteria for winning an award, there is Amma Cheppindi too.

    Why did Chiranjeevi and Mrs Surekha Chiranjeevi sob so much, so much that they could not find words to compliment Sharwanand in Amma Cheppindi? Stalin might have had a nice message but is it so good that it deserves a special jury award?

    FYI I find the comments in this blog a lot, I still haven’t found anyone accusing the blogger of having an affinity towards a particular caste.

  • Boss,

    nee degerraa okka 50 lkhs unthey cheppu neee website ki jury category lo okka nandi award ipisthaaa

    yendhu boss time waste money = award adhi Oscar ayyina, filmfare ayyina nandi ayina okkathey

  • అయ్యా మ..మ్మా..మాస్ గారూ,
    అవార్డు రావల్సి వుంటే అదే వస్తుంది.
    50 lakhs మీ దగ్గర ఉంటే చెప్పండి. నంది అవార్డు కొనకుండా నిజంగా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

  • “FYI I find the comments in this blog a lot, I still haven’t found anyone accusing the blogger of having an affinity towards a particular caste….”
    సునీత గారూ,
    ఇక్కడ వాళ్ళందరిదీ ఒకే కులం. ఒకే మతం. సినిమతం. అది తప్ప మాకు తెలియదు. అందుకనే మీరు చెప్పినట్టు ఎవరూ కామెంట్ చేయలేదు. ఒక వేళ B N Reddy గురించి మేము రాస్తున్నామని మీకలా అనిపించి వుంటే అది మాతప్పు కాదు. ఇది BN శతజయంతి సంవత్సరం కాబట్టే ఆయన్ని తలుచుకుంటున్నాము. త్వరలో LV Prasad ని కూడా ఈ విధంగానే స్మరించుకుంటాము. మీకు తెలుసో లేదో ఈ సంవత్సరం ఆయనది కూడా శతజయంతి.

  • అవార్డు రావల్సి వుంటే అదే వస్తుంది.
    50 lakhs మీ దగ్గర ఉంటే చెప్పండి. నంది అవార్డు కొనకుండా నిజంగా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

    avvi lekkey kadha boss dessam kanni dessam lo work cheysedhi

  • ఉత్తమ నటుడి పురస్కారం పెద్ద joke :) బొమ్మరిల్లు గురించి ఇప్పటికే నా చేదు అనుభవాల గురించి రెండు సార్లు రాసాను..

    మీతో ఏకీభవిస్తున్నాను

  • అసలు రామదాసు సినిమాని తీసిన వారికి శిక్షవిధించాలి. అన్నమయ్య సినిమానే రామదాసు గా తీసారు. అన్నమయ్య నాకు నచ్చింది. అన్నమయ్య అదిగో అల్లదివో శ్రీ హరివాసము అని పాడినప్పుడు అందుకు తగినట్టుగా సన్నివేశాలను సృష్టించడం బానే వుంది. కానీ రామదాసులో ఆయనకు ఉప్పురొట్టెలు తినమని బలవంతం చేసినప్పుడు అవితింటూ “ఎంతో రుచిరా….” అంటూ పాడడం చాలా నీచంగా వుంటుంది. మీరు సరిగ్గా చూస్తే ఈ సినిమా మొత్తం పాటల ఆధారంగా సన్నివేశాలు సృష్టించారు. ఇంకా త్యాగయ్య, పురందరదాసు, కబీర్ ఇలా ఎంతమంది కథలు వీళ్ళు సృష్టిస్తారో ఏమో?

    • వెంకట్ గారు, నాకు నిన్నో పెద్ద కల వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకుడు, జూ ఎన్టీయార్ త్యాగయ్య, ఇలియానా… ఎవరో మీకు తెలుసు. నా కల హైలైట్ ఏంటంటే… స్వరార్ణవం సీన్ తరువాత హీరో హీరోయిన్ లకి ఒక డ్యూయెట్. ఈ పీడ కల నుంచీ తెప్పించుకునేందుకు మా ఫ్రెండ్ ఇచ్చిన ది రీడర్ సినిమా చూశాను. బానే ఉంది. ఎవరన్నా మంచి రీవ్యూ…?

      P. S.: Music by Ramana gogula, Chakri.

  • Dress sarigaa lekpothe Costume designere ni blame cheyyali. Daani ki actor yemi chesthaadu? Ynetha thikka tho raasina post ayina, mari intha thikkagaanaa??

    Bommarillu cinema miku nachvachu,nachaka povachu. Adi vere sangathi. aa cinemaa ku yenduku raakudado spashtam gaa cheppaledu.

    telugu cinema paristhithi yemo kaani, yi articles raase manishi mental sthithi mida naaku anumaanam gaa vundi

  • ఒకే నవతరంగం పోటు కొంత తగ్గాలి….
    నేను సైటు మొదలు పెట్టినప్పుడు ఇలాంటి టపాలు వస్తాయనే చాలా భయపడ్డాను.
    తెలుగు సినిమా పరిస్థితి అంత బాలేదు, ఆ విషయం అందరికీ ఎఱుకే, వారి మీద వున్న పఱాకుని ఇక్కడ తీర్చుకోవడంలోఁ కొంత నియంత్రణ పాటించాలి.

    నంది అవార్డులు బాలేవన్నారు, కానీ ౨౦౦౬ లో వచ్చిన ఇతర ఏ సినిమాలకు అవి వస్తే బావుండో కాస్తైనా వివరిస్తే బాగుండేది. ఈ సైటుకి తెలుగు సినిమా అంటే పఱాకు వున్న నలుగురి అభిప్రాయాలుగా మారకూడదు.

    నా అభిప్రాయాలు
    బొమ్మరిల్లు అంత బాలేపోయినా, గుడ్డిలో మెల్లలా దానికి అవార్డు రావడం ఫర్వాలేదు. కమ్ముల శేఖరానికి కూడా అంతే. ఇక రామదాసు గా నాగర్జున కంటే మంచి వారే వుంటారని నా నమ్మకం. ఆ అవార్డు రామ భక్తుడికిస్తే పుణ్యం వస్తుందేమోనని ఇచ్చుంటారు :)

    ఇంకో విషయం అందరూ ౨౦౦౭ సినిమాల బహుమతులు ఇస్తుంటే మనవారు ఎప్పుడో ౦౬ లో తీసిన సినిమాలకి ఇప్పుడివ్వడఁవేఁవిటో నిష్ఠూరంగా ?

    మనం మొదలు పెడదామా నవతరంగం బహుమతులని ? :)
    ౨౦౦౮ లో వచ్చిన సినిమాలకు ఏడాది చివరన పాఠకుల ఎన్నిక పెడదాం. మనదైన ఒక పుర్’ఆస్కార’ము ఇద్దాం :)

  • రాకేశ్,
    తప్పకుండా…2008 లో నవతరంగం అవార్డులు ఇద్దాం. ఎవరూ తీసుకోకపోయినా ఫర్వాలేదు. :-)

  • Rakesh gaaru,
    Navataram potu yela vunnaa yevari ki ibbandi ledu. Nijam gaa chebuthnnaanu. Yevaru follow avvaru kaabatti yedi raasukonna parvaaledu. Oke idea vunna vaallu oka gumpu gaa cherithe vaalla ku ado trupthi gaa vuntundi.”mancho..chedo..parvaaledu.manaboti vaallu inkaa kontha mandi vunnaaru” anipisthundi. anduke kadaa inni scoities, organizations ,clubs etc.
    Ikkada kuda anthe. naluguri ki nachedi “naaku nacheledu ” ante adokas thrupti kontha mandi ki. Naa vudhesyam lo anni andariki nachaalani ledu. yevari reasons vaall kuntaayi.” kaani ye reason lekunda, criticise cheyyadame target ga pettukone kontha mandi ‘intelctual perverted’ people pettukonna site/blog idi.” anedi naaku kaligina feeling.

    Don’t worry. miru ichinaa kuda oka saari mi site chusthe yevaru award thisukoru (ippati gneration vaallu).Okkatante okka valid reason kuda mi side nunchi kanapadatam ledu Nandi awars ni vyathirekenchadaniki. Kevalam”naaku nachaledu” ane reason tho vimarsisthe yelaagandi??

  • కలికాలం గారు లేదా మీ-అసలు-పేరేదైతే-అది గారు,
    నమస్కారం.
    నవతరంగం ఉద్ధేశం మీరనుకున్నది కాదు, కానీ మీలాంటి వారికి అలా అనిపించడం దురదృష్టకరం. మీ అభిప్రాయం మాకు విలువైనది, దానిని మార్చడానికి మేము భావిలో కృషి చేస్తాం.
    ఇక మేమూ మీలానే సినీఅభిమానులం మంచి తెలుగు సినిమా కోరుకుంటాం. ఆ దిశగా మా ప్రయత్నం ఇది. నలుగురికీ మంచి సినిమా గురించి తెలపడం, వీలైతే రేపు మంచి సినిమా తీయడం.

    మీరెప్పడూ నవతరంగం పాఠకులుగా వుంటారని ఆశిస్తూ,
    రాకేశ్వర రావు
    తా.క – మీరు వీలైతే మీ పేరు లంకె ఇచ్చి పరిచయం చేసుకోగలరా ?

  • Prasthutha kalam lo awars ivvadaniki criteria antu emi ledhu. Guddilo mella laga anniti kanna takkuva daridramga unna cinema ki isthunnaru.
    ee sari nandi awards teesukunte Nagurjuna ki ivvadam ento ardham kaledhu. kevalam bahkti rasa chitram lo natincharu ani icchinattu unnaru.
    Inka bommarillu nacchani vallalo nenu unnanu.Godavari cinema antara adbhutham kakapoyina chettaga matram ledhu.sekhar kammula gariki icharu ante adi popular demand emo inka supporting actors and actresses gurinchi matladukovadam dandaga

  • నేను ఒక విషయం ఒప్పుకుంటాను. నా ఈ టపా చాలా negativeగా ఉంది. నేను బొమ్మరిల్లు చిత్రాన్ని constructiveగా criticize చెయ్యవలసినది.
    రాకేష్ గారు, నేను చూసే కొత్త తెలుగు చిత్రాలు చాలా తక్కువ. బొమ్మరిల్లు, గోదావరి అంతే. గ్రహణం 2006 లొ విడుదల అయిఉంటే గ్రహణం. కబట్టి ఈ చిత్రానికి ఏ చిత్రానికి ఇవ్వవచ్చో చెప్పలేను. నా rantఅల్లా ఇవి మంచి చిత్రాలు అంటే చిత్రాలు అయినా అధోగతిలో ఉన్నయి లేక పొతే ఎన్నికయినా సరిగ్గాలేదు.

    వెంకట్ గారు, నాకు ఇంకా కమలి చూసే అవకాశం రాలేదు. కాని నందితా దాస్ మంచి నటి.

    కలికాలం గారు, వాచికం, వేషధారణ పాత్రకి తగ్గట్టుగా ఉండాలి. ఇకపోతే నాకు మీ point నాకు అర్ధం అయ్యింది. ఇది negative సైటుకాదు. మీరు ఒక టపా లేక ఒక రచయిత(నా) అభిప్రాయాలు చదివి ఈ అభిప్రాయం ఏర్పర్చుకున్నారని నాకు అనిపిస్తోంది. మిగిలిన టాపాలు చదవండి. మీ అభిప్రాయం మారవచ్చు.

    ఇంకపోతే భవిష్యత్తులొ కొంచం తక్కువ negataiveగా రాయడానికి ప్రయత్నిస్తాను.

    ధన్యవాదాలు,
    మంజుల

  • Bommarillu cinema param ga ela unnaa jenelia character matram nijjam ga mentally retarded. How can it be innocent or cute? ayina janalaki (or may be director ki) heroin character tingari ga, burra buddi pani cheyanidi ga unte nacchutundemo.. sagam paiga cinemallo alage untundi. emunna lekapoyina kanisam sense ayina undoddu? sye cinemalo kuda alage untundi jenelia character.

  • ఈ టపా గురించి, రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాల గురించి వ్యాఖ్య వ్రాయటం అంత బుధ్ధితక్కువ పని ఇంకొకటి లేదు. అలాగే సమయం వృధాచేసుకోవటం అంత అవివేకం కూడా మరొకటి లేదు.

    ముఖ్యంగా ఇక్కడ నేను మూడు విషయాలను ప్రస్తావించదలచాను.

    1. నేను పైన చెప్పినట్టుగా అన్నీ తెలిసి కూడా నేనీ వ్యాఖ్య వ్రాయడానికి ముఖ్య కారణం….వెంకట్ గారిచే మలచబడిన 24fps మరియు ఈ నవతరంగం అనే సినీ బ్లాగ్స్ పై మరియు ఇప్పటి వరకు నేను చదివిన అన్ని టపాలు ఎంతో వివరణాత్మకంగా, విపులంగా, మధించి, శోధించి, ఆలోచనలన్నింటికీ ఒక సక్రమ రూపం ఇచ్చినట్లుగా ఉండటమే … బ్లాగ్ లో మనం వ్యక్తపరచేవి మన spontaneous reactions కి అక్షర రూపం అవటంలో తప్పులేదు .. ఇవే అభిప్రాయాలు ఈ రచయిత్రి తన సొంత బ్లాగులో వ్రాసి ఉంటే నేను చదివి నిశ్శబ్ధంగా వెళ్లిపోయి ఉండేవాడిని … ఖచ్చితంగా స్పందించేవాడిని కాదు తన అభిప్రాయాలు తనవి అనే ఉద్దేశ్యంతో… ..కానీ ఈ టపా చదివిన తరువాత, అసలీ టపా ఈ సైట్ లో ఎలా ప్రచురణార్హమైనదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానూ మరియు ఒకింత బాధగానూ ఉంది. ఒక్క టపాను బట్టి మాత్రమే ఏ సైట్ యొక్క ప్రమాణాలను అంచనా వేయటం ఖచ్చితంగా తప్పే గానీ,మొదటిసారి ఇట విచ్చేసినవారికి మాత్రము ఇది కూడా ఇంకో అడ్డగోలు తెలుగు రివ్యూ సైట్ అనీ లేక తరచుగా/అనునిత్యం ఇక్కడి టపాలు చదివే వారికి ఈ సైట్ లో ఇక ముందు ఇలాంటివి కూడా ఉంటాయేమో మరియు ఈ సైట్ పరిణామ క్రమంలొ ఈ టపా మొదటి అడుగేమో అనే భావన కలిగిస్తే … అంతకు మించి దురదృష్టకరమైన సంఘటన ఈ తెలుగు సినీ బ్లాగ్ప్ర్పంచానికి ఇంకొకటి లేదేమో అంటే అతిశయోక్తికాదేమో .. బాగా ఆలోచించి చూడండి. ఒక్కసారికే లేక ఒక్క టపాతోనే అభిప్రాయం ఏర్పరచుకునే వారి గురించి మేము/మనం పట్టించుకోనవసరం లేదు అనుకొని మీరు సాగిపోవాలి అనుకుంటే ఇక చేయ(చెప్ప)గలిగిందేమీ లేదు.

    2. ఇప్పటికే ఈ టపా వ్రాసిన వారు (మంజుల గారు) ఈ టపాను ఇంకా విపులంగా వ్రాసి ఉంటే బాగుందని చెప్పారు కాబట్టి … ఇక దాని గురించి వ్యాఖ్యానించటం కన్నా తన మరో టపా కోసం ఎదురు చూసి లేక పాతవి ఉంటే చదివి అప్పుడు తన శైలి గురించి ఆలోచించుకోవటమే ఉత్తమమైన పని. కనుక దీనిని ఇంతటితో వదిలివేద్దాము. ఒకవేళ మేము కొంతమందికి కొన్ని logins ఇచ్చాము వాటి ద్వారా వారి టపాలను ప్రచురిస్తున్నారు అంటే మాత్రము మీరు ముందుగా మరొక్క సారి అందరికీ టపాలను 24fps మరియు నవతరంగం స్థాయిని కొంచెం దృష్టిలో పెట్టుకొని వ్రాయమని స్నేహపూర్వకంగా చెప్పటం మంచిది. (ఒక్క టపాకే మొడెరటిఒన్ పెట్టవలసిన అవసరం లేదు)

    3. ఇకపోతే ఈ సినిమాలకే, నటీనటులకే ఎందుకు/ఎలా అవార్డ్స్ ఇచ్చారు అంటే …. అందుకు ఒక మంచి సమాధానం ఈ టపా మరియు వ్రాసిన రచయిత్రి గారి ఈ టపా వ్రాయటానికి పూనుకున్న విధానమే…

    a) నేను రామదాసు చిత్రం చూడలేదు. కాని ఆ చిత్రం పిcటురెస్ చూశాను. కనీసం వేషధారణ విషయంలొ కూడ శ్రధ్ధ తీసుకోని వాడికి ఉత్తమ నటుడి బహుమతి ఏమిటి? …..

    అవార్డ్స్ కమిటీ లో వుండే వారు కూడా మీలాగానే … మీరేమో సినిమా చూడకుండా, just pictures చూసి వేషధారణను బట్టి ఆ నటునికి ఉత్తమ నటుడి అర్హత లేదు అని నిర్ణయించారు … వారేమో ఏ లాబీయింగ్ బాగా జరిగితే, ఎవరెక్కువ ఒత్తిడి తెస్తే, ఎవరు గట్టిగా అరవగలిగితే వాటి(రి)కే వచ్చేలా నిర్ణయిస్తారు …

    b) నేను చూసే కొత్త తెలుగు చిత్రాలు చాలా తక్కువ. బొమ్మరిల్లు, గోదావరి అంతే. గ్రహణం 2006 లొ విడుదల అయిఉంటే గ్రహణం.

    ఇక్కడ మాత్రం ఒక్క విషయంలో మీరిద్దరూ ఒకటే … సినిమాలు చూడకుండా మీరేమో టపాలు వ్రాస్తారు … వాళ్లేమో అవార్డ్స్ నిర్ణయిస్తారు …

    ముగింపు : మీ(మా) లాగా, హిట్టో లేక నాలుగు రోజులు జనాల నోళ్లలో నానిన ఆ నాలుగో/అయిదో సినిమాలు చూసి (వాళ్లు ఏమన్నా మనలాగా అంటే సగటు తెలుగు సినీఅభిమానులలాగా వెర్రిపప్పలా విడుదలయైన అన్ని సినిమాలు చూసెయ్యటానికి), బట్టలు నలిగేలోపు, సమావేశంలొ తాగిన కాఫీ/టిఫిన్ అరగక ముందు … ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎక్కడ మెదడు(ఉంటే లేక ఉన్నది అనే భ్రమలో ఉన్నవారికి) పనిచేయటం(?) మొదలుపెట్టి అరికాళ్లలోనుంచి పైకి వస్తుందేమో అని భయం వేయబోయే ముందు awards నిర్ణయించేస్తారు….దయచేసి అర్ధంచేసుకోండి …

  • I admit this is a really bad blog. I can delete it, please let me know if you want me to.

    Thanks
    Manjula

  • @manjula:u dont need to feel bad about what u have written. It is upto the ppl 2 decide to agree with it or not and express their views in a healthy manner. Don’t let ur spirits down, a lot of ppl have accused me of being biased, have a caste feeling but just ignore it. At the end of the day u have spoken ur mind fearlessly and that’s what matters.

  • @Sunita, This is a board about films. This post of mine is a rant rather than an analysis. I dont feel bad, I just wonder if it this post is appropriate for this forum.

  • Manjula Garu,

    Please don’t even think about deleting this post because of comments. You just expressed your spontaneous reactions and that’s what a blog is all about, like I mentioned earlier. And the important thing is, you knew already that it should have been much better if you elaborated your views in a clear way.

  • తెలుగు వాడిని గారు తనదైన సహజశైలి లో వివరించారు బాగా.కానీ ఈ నందులను మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది నావరకూ.గత కొన్ని సంవత్సరాల నుంచీ కొన్ని పేర్లు క్రమం తప్పకుండా కనిపిస్తుంటే వీళ్ళు తప్ప ’ఇరగదీసే వాళ్ళు ఇంకెవరూ లేరా’ అనిపించటం సహజమేగా.మంజుల గారు రామదాసు సినిమా చూసి ఉండకపోవటం పెద్దవిషయం కాదు ఇక్కడ.హైందవేతిహాసాలనుతెరకెక్కించటంలో మన తెలుగు వారిది అందెవెసిన చెయ్యి.మరి నాగార్జున రామదాసు చూసిన వారికి గత వైభ్హవ చిహ్నాలు తలపుకొచ్చి బాధ కలగని వారుంటారా?రామదాసును చూసి మాకు ఇవి నచ్చాయీ అని చెప్పి అందువల్ల నందిని ఇచ్చారూ అంటె బాగుంటుంది.నవతరంగం లో రాసే వారు ఎవరికీ ఫలానా నటుడు/సినిమా మీద వ్యక్తిగత ద్వేషాలూ,కక్షలూ లేవనీ కేవలం మంచి సినిమా కోసం తపిస్తున్న వారని అర్ధం చేసుకున్నందుకు చాలా సంతోషం.మంజుల గారి ఆవేదన దిగజారుతున్న తెలుగు సినిమా ప్రమాణాల మీద ప్రధమ ఆవేశం తప్ప పరుషంగా మాట్లాడాలన్న ఉద్దేశ్యం కాదు.సునిత బ్లాగులో చాలామంది చేస్తున్న కామెంట్లు,తను చూపుతున్న సహనం నాకు చాలా ఆశ్చ్యర్యం కలిగిస్తుంది.

  • తీసివేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీలా భావించే సినీఅభిమానులు చాలా మంది వున్నారన్నిది వ్యాఖ్యలు చూస్తే తెలుస్తూనేవుంది.
    మనందరిలో ఎవరి పాఠకవర్గం వారికి వుంటుంది.
    నేను కూడా ఈ సూచనని మన రచయితల చర్చావేదికలో ఇవ్వాల్సింది, ఇలా బహిరంగంగా కాకుండా.
    నా ఇటీవలి టపా యొక్క విషయం కూడా ఇలానే వుండడం విడ్డూరం.
    మనం నస పెట్టేటప్పుడు కొంత సాంకేతిక పరిభాష వాడితే సరిపోతుందనుకుంట. అబ్బో ఈమెకు చాలా విషయాలు తెలుసే అనుకుంటారు జనులు :)

  • బావా బావమరిదికి సుమన్కి నంది ఇచ్చినప్పుడే ఈ అవార్డుల స్థాయి అర్ధమైంది.జగపతిబాబుకు ఇవ్వడం పరాకాష్ఠ. ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి తూతూ మంత్రంగా ప్రభుత్వం పని కానిచ్చేస్తోంది. అవార్డు తీసుకునే అర్హత నటుడికి ఉందా లేదా, ఉంటే సినిమాలో ఎలా నటించాడు అన్నది లెక్కలోకి తీసుకోవాలి. జాతీయ అవార్డుల పరిస్థితీ అలాగే ఉంది. భారత చలన చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించినవారికి ‘దాదాసాహెబ్’ అవార్డ్ ఇస్తున్నారు. అది అందుకున్నవారిలో ఎంత మందికి అర్హత ఉంది? అక్కినేని గొప్ప నటుడే. ఆయన ఖాతాలో మంచి సినిమాలు ఉన్నాయి. అయితే అక్కినేని మొత్తం కెరీర్ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం దాదాసాహెబ్ తీసుకోవడానికి అర్హుడు కాదు. తెలుగు సినిమాకు నందమూరి, అక్కినేని రెండు కళ్ల లాంటి వారంటారు. 50ల్లోనే వాళ్లిద్దరూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 60ల్లో తెలుగు సినిమా పతనంతో పాటు వీళ్లూ దిగజారారు. తమ స్థానం కాపాడుకోవడానికి పరిస్థితులకు తగ్గట్టుగా మారారు. 80లకి వచ్చేసరికి వెకిలి చేష్టలు, కుప్పిగంతులు మొదలుపెట్టారు. ఇదే విషయం మీద సాగరసంగమంలో కామెంట్ ఉంది.

    చిరంజీవి నటుడే. కానీ తెలుగు సినిమాకు ఏంచేసాడని పద్మభూషణ్ ఇచ్చారు?

  • వ్యాసంలోని అభిప్రాయం పట్ల పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదు.

    అదేదో నాటకంలో పాతాళాన్ని వర్ణిస్తూ నటుడు ఆకాశం వైపు చెయ్యి చూపిస్తున్నాడట. నాటకం చూస్తున్న శ్రీశ్రీతో మిత్రుడు.. “పాతాళమంటూ చెయ్యి ఆకాశానికేసి చూపిస్తాడేంటి?” అన్నాడు. దానికి శ్రీశ్రీ..

    “వీళ్ళ ప్రదర్శన స్థాయి పాతాళానికన్నా దిగువన ఉందిలే, అంచేత అలా పైకి చూపిస్తున్నాడు” అని అన్నాడంట.

    (ఇదివరకో బ్లాగులో ఉదహరించిన ముక్కే ఇది.)

    మన ముష్టి సినిమాల స్థాయీ అలానే ఉంది… వాటికిచ్చే పురస్కారాల స్థాయీ అలానే ఏడిచింది.

    నవతరంగం ఆస్కారులు:
    నాదో సలహా.. పరమ దిక్కుమాలిన సినిమాలకు ఇవ్వండి పురస్కారాలు. (అక్కడెక్కడో ఇస్తారట కూడా గదా.. రాస్ప్‌బెర్రీలో ఏవో !) చెత్తకుప్పలోంచి ఓ చెత్తపోగును ఏరడం కష్టమే, కాదన్ను.

    నందులను సమర్ధిస్తూ..
    ఇప్పుడూ…
    మనల్ని పాలించేవాడొకణ్ణి ఎన్నుకుంటున్నామా.. ఏం చేస్తున్నాం? ఆ యదవనో.., కాకపోతే ఈ చవటనో ఎన్నుకుంటున్నాం. అవునా!? మనకు మరో అవకాశమేదీ? ‘చవట కంటే యదవ నయం కదా, చవట నెన్నుకోటం తప్పు’ అని ఎవరైనా అంటే ఏమనగలం? నందులూ అంతే! ఎవుడో ఒకణ్ణి ఎంచుకోవాలి. మాకు పనికొచ్చేవాణ్ణో, మమ్మల్ని గుర్తుంచుకునేవాణ్ణో ఎంచుకున్నామనుకోండి.. ఉభయతారకం! పైగా సినిమా అంటే సినిమా మాత్రమే కాదుగదా.. రాజకీయం, కులం, ప్రాంతం, వర్గం (దళిత, పీడిత, తాడిత, మహిళా, బలహీన, బడుగు, యువజన, గిరిజన..) ఇవన్నీ ఉన్నాయి కదా! సినిమా బావుందా లేదా అని మాత్రమే చూసి నందులిచ్చేస్తే ఈటి సంగతెవుడు పట్టించుకుంటాడు?

    • @చదువరి,

      >> “నందులూ అంతే! ఎవుడో ఒకణ్ణి ఎంచుకోవాలి. మాకు పనికొచ్చేవాణ్ణో, మమ్మల్ని గుర్తుంచుకునేవాణ్ణో ఎంచుకున్నామనుకోండి.. ఉభయతారకం”

      ఇప్పుడిలాగే నడుస్తుంది కానీ అప్పుడెప్పుడో (గుమ్మడి నంది సెలక్షన్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న ఏడాది అనుకుంటా) .. ‘మా ప్రమాణాలనందుకున్న ఎంట్రీ ఒక్కటీ రాలేదు కాబట్టి ఈ ఏడాదికి ప్రధమ ఉత్తమ చిత్రం అంటూ ఏదీ లేదు పో’ అనేసి ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలకు మాత్రమే అవార్డులిచ్చేశారు (అసలు ద్వితీయ, తృతీయ అంటూ ర్యాంకులేమిటనేది వేరే ప్రశ్న)

  • అ౦తా బాగు౦ది కాని…..
    బొమ్మరిల్లు, గోదావరి కాకు౦డా ఏ సినిమాలకి అవార్డు ఇస్తే బాగున్నో చెబితే ఇ౦కా బాగు౦టు౦ది….!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories