కరీంనగర్ చలనచిత్రోత్సవం

kafiso-a3-poster-copy2.JPGరెండవ జాతీయ చలనచిత్రోత్సవం కరీంనగర్ లో  రేపట్నుంచి మొదలు కానుంది. అసలు కరీంనగర్ లాంటి నాన్ మెట్రో సిటి లో ఒక ఫిల్మ్ క్లబ్ వుండడం,వాళ్ళు ఒక పూర్తి స్థాయి చలనచిత్రోత్సవం జరపడం చాలా సంతోషంగా వుంది.

కరీంనగర్ లో ఇలాంటి ప్రయత్నం జరగడం వెనుక చాలా మంది సినీ ప్రేమికులే వున్నారు. వారిలో ముఖ్యుడు శ్రీ వారాల ఆనంద్. ఈయన కరీంనగర్ ప్రజలకు మేలైన సినిమాలను పరిచయం చేసే ప్రయత్నంలో ఈఫిల్మ్ క్లబ్ ఏర్పడింది.

కరీంనగర్ లోని ఈ ఫిల్మ్ సొసైటీ మాత్రమే కాకుండా ఇక్కడున్న ఒక కళాశాలలో Satyajit Ray Center for recreation అని ఒక క్లబ్ మరియు మరో మహిళా కళాశాలలోని విధ్యార్థులు స్థాపించిన స్మితా పాటిల్ ఫిల్మ్ క్లబ్ కూడా వున్నాయి.

వీరందరూ కలిసి రేపట్నుంచి (13th Feb) ఐదురోజుల పాటు ఇక్కడ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  “For us the most important of all the art is Cinema” అని చెప్పుకునే   ఈ కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లో దాదాపు 250 మంది సభ్యులున్నారు.

ఈ ఫిల్మ్ సొసైటీ గురించి మరిన్న విశేషాలు తెలుసుకోవాలంటే వారి వెబ్ సైట్ www.kafiso.org సందర్శించవచ్చు.

అలాగే ఈ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాల వివరాలు: kafiso.pdf

Filed Under: చలన చిత్రోత్సవాలుచూడదగ్గ చిత్రాలు

Tags: , ,

Comments (2)

Trackback URL | Comments RSS Feed

  1. రాజేంద్ర says:

    కరీంనగరం చలనచిత్రోత్శవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.