Color of Paradise

దేశం:ఇరాన్
దర్శకుడు: మజిద్ మజిది
కాలం:1999

ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే.

ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా అన్ని పనులు చేసుకోగలడు కూడాను. అతడికి బామ్మ, ఇద్దరు చెల్లెళ్ళు, ఇంకా తండ్రి ఉంటారు. తండ్రి అతడిని వదిలించికోవడానికి చూస్తూఉంటాడు. దానికి ఆ కుర్రవాడి బామ్మ ఒప్పుకోదు. ఆ తండ్రి ఏమి చెస్తాడు అనేదే కధ.

ఈ చిత్రంలో నటన అత్యద్భుతంగా ఉంది. మొహమ్మద్ పాత్రలో నటించిన కుర్రవాడు నిజంగా అంధుడే. ఈ చిత్రం చాలా అందమయిన ప్రదేశాలలో చిత్రీకరించారు. Camera పనితనం చాలా బావుంది.

కొన్ని దృశ్యాల చిత్రీకరణ చాలా చాలా బావుంది. అందులో ఒకటి, చిత్రం మొదటిలో కుర్రవాడు అతని తండ్రి గురించి ఎదురుచూస్తున్నపుడు, పక్కన ఉన్న చెట్టు మీద ఉన్న గూటిలోంచి పక్షిపిల్ల పడిపొతుంది. ఆ కుర్రవాడు పక్షిపిల్లని తీసి చెట్టు ఎక్కి ఆ పక్షిపిల్లని గూటిలో పెట్టడం. ఇంకొకటి climax సన్నివేశం. అంధుడైన కుర్రవాడు ప్రకృతితో ఎలా సంభాషించగలడొ చాలా బాగా చిత్రీకరించారు. నేను Bicycle Thief తర్వాత పాత్రలని అంత ఇష్టపడ్డ చిత్రం ఇది.

ఈ చిత్రంలో మరొక అంశం composed background సంగీతం లేకపొవడం. ప్రకృతి శబ్దాలే ఈ చిత్రంలో background సంగీతం. చలనచిత్ర ప్రేమికులందరు చూడవలసిన చిత్రమిది.

Filed Under: ఇరాన్ప్రపంచ సినిమాసమీక్ష

Tags: , ,

Comments (4)

Trackback URL | Comments RSS Feed

  1. వెంకట్ says:

    మంజుల గారూ,
    మంచి సినిమా పరిచయం చేసారు.మీరు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ కూడా చూడండి. నా దృష్టిలో ఆ సినిమా దీని కంటే ఎన్నో రెట్లు బావుంటుంది. అబ్బాస్ కియార్స్తోమీ తో పాటు మొహెసెన్ మక్మల్బఫ్ సినిమాలు కూడా చూడండి. నా దృష్టిలో మన వాళ్ళు ఏదైనా దేశ సినిమాలను చూసి ప్రేరణ చెందాలా అంటే అది కేవలం ఇరాన్ సినిమా మాత్రమే. కానీ ఈ మధ్యనే ఒక వార్త విన్నాను. మన UTV వాళ్ళూ మజిద్ మజిది సినిమాని నిర్మిస్తున్నారట. నాకెందుకో అనుమానంగా వుంది. :-)

  2. రాజేంద్ర says:

    “ప్రకృతి శబ్దాలే ఈ చిత్రంలో background సంగీతం”–ఎంత అధ్భుతమైన ఆలోచన,ప్రకృతిని మించిన నేపధ్య సంగీతం ఎక్కడ ఉంటుంది?ఈతరహా చిత్రాలు ఇంకేమన్నా ఉన్నవేమో చెప్పగలరా?

  3. ప్రసాద్ సామంతపూడి says:

    The color of paradise is one of my favorite movies.
    ఈ సినిమా చూసి చాలా కాలం అయింది. కాని ఈ సినిమా కలిగించిన అనుభూతి ఇంకా నాతోనే ఉంది.

  4. kalpana says:

    naaku kooda colors of paradise, childrens of heaven chala chala baaga nachhayi. streelu, pillala drukkonam nunchi tese irani cinemalu choodatam manchi anubhooti.

    kalpana

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.