Menu

బెర్లిన్ చిత్రోత్సవం-2008

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చలనచిత్రోత్సవాల్లో బెర్లిన్ చిత్రోత్సవం ఒకటి. ఈ చిత్రోత్సవం ప్రత్యేకత ఏంటంటే అన్ని చిత్రోత్సవాలకంటే ఇది కాస్తా ముందు జరగడంతో అంతకుముందు సంవత్సరం ఆఖరులో వచ్చిన మంచి సినిమాలు, అలాగే ప్రస్తుత సంవత్సరంలో రాబోయే మంచి సినిమాలు ఇందులో చోటు చేసుకుంటాయి.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి జరిగిన ఈ చిత్రోత్సవం గత చిత్రోత్సవాలతో పోలిస్తే నిరాశే అని కొంతమంది అభిప్రాయం.

ఈ చిత్రోత్సవంలో చోటుచేసుకున్న కొన్ని మంచి సినిమాలు:

There will be blood

ఈ సినిమా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రంలో నటించిన Daniel Day-Lewis  ఉత్తమ నటుడిగా  ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు.

Avaze Gonjeshk-ha

ఇరానియన్ సినిమా ఫాలో అయ్యే వారికి మజిద్ మజిదీ పేరు చిరపరిచతమే అయ్యింటుంది. గతంలో బరన్, చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, కలర్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రాలకు దర్శకత్వం వహించి మజిద్ మజిదీ దర్శకత్వంలో వచ్చిన Avaze Gonjeshk-ha(The Song of Sparrows) సినిమా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డ మరో మంచి చిత్రం. ఈ సినిమాలో నటించిన Reza Najie ఈ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డు కూడా  గెలుచుకున్నారు.

Happy-Go-Lucky

బ్రిటిష్ చలనచిత్ర దర్శకుల్లో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా పేరుగాంచిన Mike Leigh నాలుగేళ్ళ విరామం తర్వాత వస్తున్నసినిమా Happy-Go-Lucky. ఈ సినిమాలో నటనకు గాను  Sally Hawkins ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

Tropa de elite

ఈ సంవత్సరం బెర్లిన్ చలన చిత్రోత్సవంలో పెద్ద సెన్సేషన్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటి Tropa de elite (The elite squad). బ్రెజిల్ కి చెందిన ఈ సినిమా గతంలో వచ్చిన మరో సంచలన బ్రెజిల్ చలనచిత్రం City of Gods కంటే బావుందంటున్నారు. ఈ సినిమా ఈ చిత్రోత్సవంలో అత్యుత్తమ పురస్కారమైన Golder Bear ను కూడా దక్కించుకుంది.

ఇవి కాకుండా చైనా కు చెందిన ’Zuo you’, మెక్సికో కు చెందిన ’Lake Tahoe’, కెనడా కు చెందిన ’My Winnipeg’ సినిమాలకు కూడా ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

వీటితో పాటు తీవ్రవాదులన్న అనుమానంతో అమెరికన్ సైన్యం చేతిలో టార్చర్ కు గురికాబడ్డ వ్యక్తుల నేపధ్యంలో నిర్మితమైన డాక్యుమెంటరీ చిత్రం ’Standard Operating Procedure’ కి కూడా మంచి స్పందన లభించింది.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించిన ’faith and wisdom’ సినిమా కూడా కొంచెం సంచలనం సృష్టించింది. సినీ విమర్శకులు చెత్త సినిమా అని తేల్చేసినప్పటికీ ఈ సినిమా బానే వుందని కొందరి అభిప్రాయం. ఈ సినిమా కి దర్శకత్వం వహించింది ప్రముఖ పాప్ గాయని మడొన్నా.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగియడంతో ఇప్పుడు సినీ ప్రేమికుల కళ్ళు మే లో జరగబోయే  Cannes చిత్రోత్సవం కోసం ఎదురుచూస్తున్నాయి.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డ భారతీయ చలనచిత్రాలు:

ఓం శాంతి ఓం(హిందీ)

పరుతివీరన్(తమిళ్)

వీటితో పాటు ఉమేష్ కులకర్ణి దర్శకత్వంలో వచ్చిన The Three of Us, సిద్ధార్ధ్ సిన్హా రూపొందించిన Ubedh Bun(భోజ్‍పురి) అనే  లఘు చిత్రాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.

The Three of Us దర్శకుడు ఉమేష్ దర్శకత్వంలో వచ్చిన పూర్తి స్థాయి మరాఠీ చలన చిత్రం Valu (The Bull) ఇప్పుడు అక్కడ పెద్ద సంచలనాన్నే సృష్టిస్తోంది. ఇప్పటికే రోటర్‍డ్యామ్, వార్‍సా చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శింపబడింది. ఈ సినిమా గురించి రాస్తూ హిందూ వార్తాపత్రిక ఉమేశ్ ను ‘R.K Narayan of Indian Cinema’ అన్నదంటే ఈ సినిమా మిస్సవకూడదన్నమాట.

2 Comments
  1. మంజుల February 27, 2008 / Reply
  2. Jonathan April 23, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *