ఈ నెల ఫోకస్ విభాగంలో బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గురించిన సమాచారం అందించాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ నెలలో సాధ్యమైనంత సమాచారం సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక వేళ వీలు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా బి యెన్ రెడ్డి సినిమాల గురించి, ఆయన గురించి వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము.
ఇప్పటికే ’కథను గాలికొదిలేసిన తెలుగు సినిమా’ అనే వ్యాసంలో రాజేంద్ర గారు బి యెన్ రెడ్డి గారి ఆలోచనలను పంచుకున్నారు. బియెన్ గురించి అంతర్జాలంలోనూ పెద్దగా సమాచారం లేదు. నేను వెతికినంతలో ఈ క్రింది వ్యాసాలు ఆయన సినిమాల గురించి, ఆయన గురించి తెలియచేస్తున్నాయి.
1)పరిచూరి శ్రీనివాస్ గారు బియెన్ గురించి telugucinema.com లోనూ, ఈమాట లోనూ రెండు అధ్బుతమైన వ్యాసాలు ప్రచురించారు. వాటి వివరాలు:
2)బియెన్ గురించి తెలుగు వీకిపిడియా లోని విశిష్ట వ్యాసం
3)బిఎన్ సినిమాలైన స్వర్గసీమ, వందేమాతరం గురించి ఐడిల్‍బ్రైన్ లో రెండు సమీక్షలు వున్నయి. వాటి వివరాలు
ఇవి కాకుండా మరికొన్ని వ్యాసాల వివరాలు:
ఇవి కాకుండా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ వారి అధ్వర్యంలో ప్రముఖ సినీ చరిత్రకారుడు రాండర్ గై రచించిన మోనోగ్రాఫ్, పాటిబండ్ల దక్షిణామూర్తి రచించిన “కళాత్మక దర్శకుడు బిఎన్ రెడ్డి” అనే పుస్తకం ద్వారా బిఎన్ గురించి ఆయన సినిమాల గురించి తెలుసుకోలిగే అవకాశం వుంది.
24ఫ్రేములు, 64కళలు » నవతరంగంలో ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ వచ్చిన వ్యాసాలు says:
[...] అంతర్జాలంలో బి యెన్ రెడ్డి [...]
రవి వైజాసత్య says:
వికీపీడియా వ్యాసం లింకు వేరే వ్యాసానికి వెళ్తుంది. సరిచేయగలరు
రాకేశ్వర రావు says:
బాగుంది
రాకేశ్వర రావు says:
బి. యెన్. రెడ్డి కవిత్వం
బి. యెన్. రెడ్డి కివితా సంపుటి
రాకేశ్వర రావు says:
AVKF లో ఇంకో రెండు పుస్తకాలు
బి.యన్ రెడ్డి కవిత్వం
బి.యన్ రెడ్డి కవితా సంపుటి
రాకేశ్వర రావు says:
టాగులు ఏఁవి ?
వెంకట్ says:
రాకేశ్వరా,
ఆ కవి బి.యన్.రెడ్డి, ఈ సినిమా దర్శకుడు బి.యన్ ఒకరు కాదేమోఅనిపిస్తుంది. నేను చదివి పుస్తకంలో కూడా ఆయన కవి అన్నట్టు ప్రస్తావన లేదు. ఈ బి.యన్. రెడ్డి పేరుతో వచ్చిన తంటా అదే.
బి.యన్ రెడ్డి అని మనం లైటేసి ఫోకస్ చేస్తున్న దర్శకుడున్నారా, ఆయన తమ్ముడు మరో బి.యన్ రెడ్డి (విజయా స్టూడియోస్, నాగిరెడ్డి) వున్నారా,వాస్తుశిల్పి అప్పుడప్పుడూ సినిమాలు నిర్మించిన మరో బి.యన్.రెడ్డి వున్నారా, ఇప్పుడు ఈ కవి బి.యన్.
మొత్తానికి ఈ బి.యన్ పేరులోనే ఏదో ఉన్నట్టుంది