Menu

Teeth of Love – ప్రేమ దంతాలు

Teeth of Love

సినిమా : Teeth of Love

దేశం : చైనా

భాష : చైనీసు

దర్శకుడు : Zhuang Yuxin

ఇది మన హిఫ్‌కి ప్రారంభోత్సవ సినిమా. అంటే ఒక విధంగా మన సెలక్టర్ల దృష్టిలో ఇది ఉత్సవానికొచ్చిన కొత్త సినిమాల్లో కెల్ల అత్యుత్తమమని.

ఇక సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే,
మొదటి ముక్క, అమ్మాయి స్కూలులో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది.
రెండవ ముక్క, అమ్మాయి కాలేజీలో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది.
మూడవ ముక్క, అమ్మాయిని కాలేజీనుండి భహిష్కరించిన తరువతా పెళ్లి చేసుకుంటుంది. అతన్ని మాత్రం ప్రేమించలేక పోతుంది, కానీ విడిపోవాలని నిశ్చయించుకున్న తరువాత ఆఖరిగా ఒక్క రోజు అతనిని ప్రేమించగలుగుతుంది.
ఈ మూడూ ప్రేమలూ ఆమెపై చెఱో గాయాన్ని వదులుతాయి. ఇదంతా ఒక పదేళ్లకాలంలో, చైనా చరిత్రలో ఒక కీలక దశాబ్దిలో జరుగుతుంది.

ప్రారంభోత్సవంలో ఈ సినిమా నిర్మాత, కథానాయిక మాట్లాడారు. సహనిర్మాత మాట్లాడుతూ సినిమా తీయడానికి పది ఏండ్లు పట్టిందని చెప్పారు. సినిమా పోస్టరు చూస్తే చాలు ఇది మీకు నిజమని తెలుస్తుంది. ఇక కథానాయిక యాన్ బిఙ్యాన్ కూడా మాట్లాడారు. ఆమెకి ఆంగ్లం రావకపోవడం గమనార్హం. పిదప సినిమా గురించి పరిచయం చేస్తూ నిర్వాహకులలో ఒకతను ఈ సినిమా స్క్రీనుప్లే చూసి మేము నిర్ఘాంతపోయాం, కాబట్టి మీరు కూడా కథలో మునిగి సినిమాని ఆశ్వాదించండి అన్నారు.

నేను మామూలుగా స్క్రీనుప్లే అన్నపదం వినడమే గాని, అసలు అదేంటో అంతుపట్టేది కాదు. ఈ సినిమాలో మొదటి నుండి కడదాకా, చిత్రీకరణలో ఒక రకమైన నిజాయితీ కనిపించిది, ఆ చిత్రీకరణ సినిమా ఒక్క కళాత్మక విలువకు చాలా తోడ్పడింది. అప్పుడనిపించింది స్క్రీనుప్లే అంటే ఇదేనేమో అని.

ఇక కథ విషయానికొస్తే, అది విషాదాంతమూ కాదూ సుఖాంతమూ కాదు. నిజ జీవితంలో చాలా ఘట్టాల్లాగా దానిదో అర్థంలేని అంతము. చీకూ చింతా లేని హైస్కూలు మహరాణి, పదేళ్ల తరువాత ఒంటరిగా దుఃఖానికి అలవాటు పడిపోయిన జీవిగా ఎలా మారిపోతుందో చూడగలం. ఆ వ్యక్తి జీవితంలో తను ఆఖరుకు మిగిలిన వ్యక్తిగా ఎలా తీర్చిదిద్దబడ్డదో అన్న ఘట్టాల శృంఖల ఈ సినిమా. సినిమా చూసింతరువాత మనకో అనీజీ భవం మిగులుతంది, అఱ్ఱె ఇలా ఎందుకు జరిగింది అని (ఉత్సవంలో ఇలాంటి సినిమాలకు లోటు లేదు). కాబట్టి ఇలాంటి సినిమాలను మన భారతంలో తీయలేము. అందుకు నిదర్శనం, సినిమా బయటకు వచ్చాక ఒక వ్యక్తి అతని మిత్కుడితో “అసులు ఈ సినిమా అర్థం ఏఁవిటి” అని అడగడం.

సారాంశం – సినిమాలో కథాంశం పాత తెలుగు నవళ్లోలా చాలా సీరియస్ కథాంశం. కథనం చాలా బాగుంటుంది. నిరార్భాటంగా, నిజాయితీగా. సినిమా తీయడంలో నేను గ్రహించగల ఎలాంటి సాంకేతిక లోపాలూ లేవు (చిత్రోత్సవంలో అన్ని అంతర్జాతీయ సినిమాల్లోలా). వీలైతే చూడగలరు.

లంకెలు

http://www.10thnpc.org.cn/english/culture/237140.htm

8 Comments
  1. వెంకట్ January 18, 2008 /
  2. వీవెన్ January 19, 2008 /
  3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి January 19, 2008 /
  4. కొత్తపాళీ January 19, 2008 /
  5. వెంకట్ February 10, 2008 /
  6. Theja April 4, 2008 /
  7. bhanu April 30, 2008 /
  8. K.మహేష్ కుమార్ April 30, 2008 /