శివాజీ సినిమా నాకస్సలు నచ్చలేదు కానీ, రజనీకాంత్ నటించిన (?) యానిమేషన్ చిత్రం Sultan-The warrior కోసం మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందుకు కారణం ఈ సినిమా మనదేశంలో పూర్తి నిడివిలో వస్తున్న మొట్టమొదటి భారీ యానిమేషన్ చిత్రం కావడమే! అందులోనూ రజనీకాంత్ ప్రధానపాత్రలో వుండడంతో ఆయన వయసుతో నిమిత్తం లేకుండా ఈ సినిమాలో ఎన్నో గిమ్మిక్కులు చేసి హిట్టు కొట్టినా కొట్టొచ్చు.
గతంలో ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ యానిమేషన్ అంటే మన ప్రేక్షకులకచున్న చిన్నచూపు కారణం చేత, మరియు ఆయా సినిమాల్లో పెద్దగా నాణ్యత లేకపోవడం చేత ఆ సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదన్నది నిజం. త్వరలో హిందీలో సైఫ్ ఆలీఖాన్ నటించిన (?) రోమియో అనే ఒక యానిమేషన్ సినిమా వస్తున్నప్పటికీ, అందులో కేవలం సైఫ్ గొంతు మాత్రమే మనం వినగలం, ఇక ఆ రోమియో పాత్ర చేసేది మాత్రం ఒక కుక్క అని ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. ఈ సినిమా డిస్నీ స్టూడియోస్ నిర్మిస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా.
ఈ సినిమాలు విజయం సాధిస్తే మన దేశంలోనూ యానిమేషన్ సినిమాలకు మంచి భవిష్యత్తు వుండొచ్చు.
సుల్తాన్ సినిమా Trailer క్రింది వీడియోస్ లో చూడొచ్చు.
రాకేశ్వర రావు says:
ഹോലീ ഷിട് !!!
A legitimate way to
1) Cover up Rajani’s Age.
2) Do all stupid stunts
Technology is not substitute for creativity. At best it can be an aid.
arvind says:
నేనుకూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను, ఇప్పటివరకు విదేశి యానిమేషన్ సినిమాలు చూసి ఆనందించిన మనకు ఈ చిత్రం మనదని మనవళ్లు నిర్మించిందని సెంటిమెంటు కాస్త ఎక్కువగనే ఉంటుంది. ఇప్పటికి కొన్ని పూర్తి నిడివి యానిమెషన్ చిత్రాలు వచ్చిన అవి సుల్తాన్ అంత అందంగాలేవనే చెప్పాలి, చెప్పుకొదగ్గ హనుమాన్ 2డి యానిమషన్ కావడంతో, ఈ పూర్తి నిడివి 3డి సుల్తాన్ ఖచ్చితంగా ప్రేక్షకుల మనసును దోచుకుంటుందనడంలో సందేహం లేదు.