Menu

Shakespeare నించి Bond వరకు : విశాల్ భరధ్వాజ్.

కొన్ని సార్లు కొంతమంది మీద ఏదయినా అభిప్రాయం ఏర్పదితే అది పోవడానికి చాలా కాలం పడుతుంది. నాకు విశాల్ భరధ్వజ్ అంటే ఉన్న అభిప్రాయం one film wonder. ‘మాచిస్ ‘ సినిమా కి సంగీతం తప్ప ఇంకేమీ పెద్దగా చెయ్యలేదు అని.

దాదపు ఏడాదిన్నర క్రితం rediff లొ movie reviews చదువుతున్నపుడు ‘ఓంకారా’ గురించి చదివాను. అప్పుడు నాకు కాస్త ఆసక్తి వచ్చింది. సులేఖ వాళ్ళు నాకు free tickets ఇవ్వడంతో వెళ్ళి ఆ సినిమా చూశాను. మొట్టమొదటి దృశ్యమే నన్ను ఆశ్చర్యపరిచింది. చిత్రం పూర్తి అయ్యేసరికి. నాకు చిత్రం చాల నచ్చింది. కధ పరధిలొనే ‘ఓంకారా’ వ్యక్తిత్వానికి మరొక కోణం సృష్టించాడు దర్శకుడు. కధలో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు, అక్కడి గూండాలు చక్కగా ఇమిడిపొయాయి. Shakespeare నాటకాలని భారతదేశ రాజకీయలకి అనువదించడం కొద్దిగా కష్టమే. విశాల్ ఆ పని చాలా చక్కగా చేశాడు.

ఇక పొతే Blue Umbrella గురించి చాలానే చదివాను. కొత్తపాళీగారి blogలో ఇంక మా cousin blogలోను కూడా. నాకు Ruskin Bond అంటె కూడా చాలా ఇష్టం. ఆ చిత్రం ఇక్కడ విడుదల అయితే చూద్దాం అనుకున్నను. కాని విడుదల అవలేదు. చివరికి మొన్న మా చెల్లెలి ఇంట్లొ చూడడానికి అవకాశం దొరికింది.

చిత్రం కధ చాలా బావుంది. కుళ్ళుబొతు దుకాణదారు గా పంకజ్ కపూర్ ఇంక బినియా వేషం వేసిన అమ్మాయి చాలా బాగా నటించారు. camera work బ్రహ్మండంగా ఉంది. ఇంకా కధలోని అంశాలని ఋతువులతో ముడిపెట్టడం నాకు చాల నచ్చింది. ఈ చిత్రాన్ని చంబా లోయలొ చిత్రీకరించారు. బహుశా డూన్ లోయ, మసురీ కి దగ్గిరగా ఉండడానికి కాబోలు(Ruskin Bond కధలు చాల మటుకు ఆ పరిసరాలలోనే జరుగుతాయి.).

ఒక్క విషయం ఏమిటంటే Blue Umbrella కి ఓంకారా కి ఉన్న contrast. ఒకటి Shakespeare విషాద గాధ పెద్దవాళ్ళని మాత్రమే ఉద్దేశించి తీసినది. Blue Umbrella ని పెద్దలు పిల్లలు కూడా అనందించ గలరు. చాలా ప్రతిభ ఉంటేనే గాని ఈ రెండు చిత్రాలకి న్యాయం చెయ్యడం కష్టం. విశల్ భరధ్వజ్ కి ఆ ప్రతిభ ఉందనే చెప్పాలి.

ఇది నా ఆంగ్ల blog కి అనువాదం. మీరు దీన్ని ఆంగ్లంలొ transcendentalpi.blogspot.com లో చదవచ్చు. ఎమయినా సలహాలు ఉంటే ఇవ్వగలరు.

3 Comments
  1. వెంకట్ January 12, 2008 / Reply
  2. మంజుల January 14, 2008 / Reply
  3. Jonathan September 23, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *