ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను. ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా. నేను Talk Cinema కి వెళ్ళినపుడు, ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను. ఇది animated చిత్రం. దీనికి Oscar nomination కూడ వచ్చింది. ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఫ్రెంచి చిత్రమయిన, కధ ఇరానీన్. నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. ఈ కధ కాస్త ఇరాన్లోను, కాస్త ఆస్ట్రియాలోను జరుగుతుంది. కధ ఎమిటి అంటే ఒక అమ్మాయి రాజకీయ చైతన్యం కలిగిన కుటంబం నించి వస్తుంది. ఆమె జీవితానుభవాలే కధావస్తువు. ధ షా పరిపాలనలో ప్రారంభం అవుతుంది. ఆ అమ్మాయి కుటుంబం షాకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంటుంది. ఆమె కుటుంబం మీద communist ప్రభావం చాలా ఉంటుంది. తిరుగుబాటు తర్వాత ఇరాన్ మత దురహంకారుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇరానియుల పరిస్థితి పెనం మీద నించి పొయ్యిలొ పడినట్టు అవుతుంది. ఆ అమ్మాయి మాతాధికారులు విధించిన కఠిన నియామాలకి సర్దుకోలేకపొతుంది. ఆ అమ్మాయిని తల్లి తండ్రులు Europe పంపించి వేస్తారు. అక్కడ మూడు ఏళ్ళు ఉంటుంది. కాని అక్కడి వొంటరితనానికి తట్టుకోలెక మళ్ళీ ఇరాన్ వచ్చేస్తుంది. అప్పటికి ఇరాన్లో పరిస్థుతులు ఇంకా దిగజారతాయి. చివరికి ఆమె ఫ్రాన్స్ వెళ్ళిపోవడంతొ కధ ముగుస్తుంది. సినిమా బావుండడానికి కారణం కధ. ఇరాన్లో రాజకీయాలు సాంఘిక పరిస్థితులు చాలా చక్కగా చూపించారు. కొన్నేళ్ళపాటు పశ్చిమలో ఉన్నతర్వాత తిరిగి స్వదేశం వచ్చాక చేసుకోవలిన సర్దుబాట్లు అవి ఇక్కడ ఉన్నవాళ్ళకి తెలిసినవే. ఏదో Animated చిత్రం కదా అని పిల్లల చిత్రం అనుకోకండి. ఇది పెద్దవాళ్ళ చిత్రం. Animation కూడ చాలా చక్కగా ఉంది. ఇది అందరూ చూడవలసిన చిత్రం.
–మంజుల
వెంకట్ says:
నిజం మంజుల గారూ, ఈ మధ్య కాలంలోనే కాదు నేను చూసిన అత్యుత్తమ యానిమేషన్ సినిమాల్లో ఇది ఒకటి. Spirtied Away తర్వాత బాగా నచ్చిన సినిమా.
కాకపోతే కొంచెం నిడివి ఎక్కువే అనిపించింది.
మరో మంచి సినిమా గురించి తెలియచేసినందుకు చాలా థాంక్స్.
రాకేశ్వర రావు says:
కథ మామూలు సినిమా కథలానే వున్నప్పుడు . దీన్ని యానిమేషన్ సినిమా ఎందుకు తీసారు
మామూలు సినిమాగా ఎందుకు తీయలేదు ?
వెంకట్ says:
నాకు అదే డౌట్ వచ్చింది.
this is based on a comic book with the same name. అలాగే ఇందులో చూపించిన ఇరాన్ ఇరాక్ యుధ్ధం, ఇరాన్ ఉద్యమం లాంటి అంశాలన్నీ ఖర్చుతో కూడిన పని. ఆందుకనేమో!
మంజుల says:
నా అభిప్రాయం ఏమంటే, మార్జీన్ సత్రాపి illustrator కాబట్టి ఆమె illustrationsలొ బాగ express చేయగలదు. అందుకనే చిత్రం animationలొ తీసి ఉంటారు.
Jonathan says:
hi majula garu,
i’ve done a short film, please watch my film and write your review, i would like to know if any mistakes.
you can watch my film here http://www.jonathanswork.com
Thanks
మంజుల says:
Hi Jonathan,
I could not watch it last night. Will check it our tonight.
Manjula
Theja says:
Nenu yee cinema chudaledhu, yee cinemani drustilo pettukoni cheppaam ledhu. Struggle for existance annadhi prathi okkariki varthisthundhi, samakaleena prapancham lo prathi desam lonu ilanti kastalu poratalu jaruguthune vunnayi, vaati meeda theesina cinema lu manchive kadananu, kaani theesina prathi cinema kooda adbutham kaadhu. konni vasthavalanu vakreekaristhey, inkonni vasthavalaku inkonni masalalu jodinchi theestharu vati manam chudagaane andhuloni emotions ki sahajamgane spandinchi yekkuva bavodveshaniki guri avuthamu alaa theesina cinema ki master piece ane birudu thagilisthamu.
Nijanni nirbayam gaa chupinche dammu vunna cinemaki manam sebash ani mechukovali….
Yee Persepolis anna cinema nenu chudaledhu kabatti deeni gurinchi nenu vyakyaninchukoledhu, ikkada ilanti cinemala meeda naa abiprayam cheppali anipinchindhi kabatti chebuthunna….