ఒక్క మగాడు సినిమా సమీక్షని, సినిమా చూస్తున్న అనుభవాన్ని హాస్యభరితంగా శ్రీధర్ గారు తన బ్లాగులో వ్రాసారు.
తెలుగు భారతీయుడు-’ఒక్క మగాడు’ (సారీ! ఇది హార్ట్ పేషెంట్లకు నిషిద్దం)
ఆయన చెప్పినట్లు ఇది ఎవరినీ నొప్పించడానికి కాదు. అలానే అది సినిమా ఒక్క సాంకేతిక అంశాల సమీక్ష కాదు. చదవి ఆనందించండి.
వెంకట్ says:
నా ఉద్దేశంలో ఒక్కమగాడు యాక్షన్ సినిమాగా కాకుండా, క్యామెడి సినిమా గా చూస్తే బావుంటుందేమో?
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
ఏమిటో ఈ సంవత్శరం సినిమాలకు ఇంత అధ్వానం గా ఉంది.ఆపదమొక్కులవాడు ఆపదల్లో పడేస్తే,డాన్ ఢామ్మంటే,ఒక్కమగాడు ఓరినాయనోయ్ అనిపిస్తున్నాడు.కృష్ణ కొంత ఫర్లేదు అంటున్నారు.ఎంత డబ్బు,ఎన్ని పనిదినాలు,ఎన్ని ఆశలు,ఎంత శ్రమ వృధా ఒక్క సినిమా ఫెయిల్ ఐతే? సినిమా విజయవంతమ్య్యేందుకు ఏమీ ఫార్ములాలేదు,కధను నమ్ముకోవటం తప్ప ,సినిమా దుమ్ము కొట్టుకొనిపోవాలంటే కధను తప్ప హంగులను పట్టుకొని వేలాడాలి. ఏ సినిమా ఫ్లాప్ అయినా ఎందుకో నాకు ఈకారణాల వల్ల చాలా బాధేస్తుంది.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి