Menolippu Mombasaan

హైదరాబాదు ౨వ చలనచిత్రోత్సవం ౨వ రోజు (౪ – ౧ – ౨౦౦౮)

Menolippu Mombasaanసినిమా : Menolippu Mombasaan (Oneway ticket to Mombasa)
దేశం : ఫిన్‌లాండ్
భాష : ఫిన్నిష్షు
దర్శకుడు : Hannu Tuomainen.
సంవత్సరం : ౨౦౦౨

ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఒక్క మగాడు తెగనచ్చేసే రకమైనా, బొమ్మరిల్లు బోరింగు సినిమా అనిపించినా, ఈ సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. కొందరు పాత కాలం అమ్మలక్కల విషయం మాత్రం నేను చెప్పలేను.

ఈ సినిమా బ్రతికుండడమనే ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలో చెబుతుంది.
పదిహేడేళ్ల పీట్‌కి కాన్సర్ ఉందని తెలుసి ఆస్పత్రిలో వెంటనే చేరమంటారు. ఆసుపత్రిలో తన సహవాసి యూస కూడా కాన్సర్ బాధితుడే. ఇద్దరూ కలసి ఆసుపత్రినుండి పారిపోయి యూస స్వప్నలోకమైన ఆఫ్రికా ఖండంలోని మాంబస వెళ్లిపోదామని నిశ్చయించుకుంటారు. కానీ వెళ్లేముందు పీట్ తన చిరకాల ప్రేమ అయిన కాతా ని ఒక సారి కలుసుకుని వెళ్దాం అని అనుకొని వారి ప్రయాణం మొదలుపెడతారు. వారి దగ్గర పైసా వుండదు!

ఒక సారి కాన్సర్ వుంటే జీవితం లో చిన్న చిన్న విషయాలను ప్రక్కన పెట్టి ఎలా జీవిస్తారో అన్న విషయాన్ని చాలా బాగా తెరకెక్కించారు. సినిమా ఎంత అద్భుతంగా వుందంటే ఆ రోజు ఇంకేం సినిమాలూ చూడకుండా నిష్క్రమించాను. యువతకు చాలా బాగనచ్చే సినిమా ఇది. నా సందేహం అక్కడున్న మన తెలుగు దర్శకులెవరైనా చాలా హ్యాపీ డేస్ అని చెప్పి ఈ సినిమాని తెలుగులో తీసినా ఆశ్చర్యపోను.

మీకు వీలున్నా లేక పోయినా ఈ సినిమా తప్పక చూడండి. అందమైనా ఫిన్‌లాండు మఱియూ అందమైన కాతా మఱియూ అందమైన ఫిన్నిషు భాషా వున్నయీ సినిమాలో.

లంకెలు

IMDB

Filed Under: ఇతర ప్రపంచ భాషలుప్రపంచ సినిమాసమీక్ష

Tags:

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.