Menu

చిత్రోత్సవం స్థూలదృష్టి

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవంనేను హైదరాబాదు చలనచిత్రోత్సవానికి వెళ్లాను. అందరూ ఎలావుంది ఉత్సవం అని అడుగుతూంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. పది రోజుల కాళీ చూసుకొని, వెయ్య కీమీలు వెళ్లి చూసిన ఫలితం దక్కింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే తప్పక చూడండి. హైదరాబాదులో ఇంత మంచి సినిమాలు ఇంత మంచి థియేటరుల్లో ఆడతాయా అని అబ్బురపోతారు.

ఐదు వందల రూపయల పాసుకి, అక్కడ ముప్పై ఐదు ఆటలలో వేస్తున్న నూటయాభై సినిమాలు ఎన్నైనా చూడవచ్చు. నేను నా మటికి ఆ ముప్పై ఐదు ఆటలలో ఇఱవయ్యొక్క సినిమాలూ ఒక లఘుచిత్రం రెండు డాకుమెంటరీలూ చూసాను. ఇక చిత్రోత్సవం ఒక అద్బుతమైన అనుభూతి. అది ముగిసి నాలుగు రోజులై నాలుగు వూళ్లు వెళ్లన పిదప కూడా దాని ప్రభావం ఇంకా నాపై వుంది. అన్ని సినిమా సంభందింత మఱియు ఇతర అనుభవాలను ఒక్కటొక్కటీ ఇక్కడ మీతో పంచుకోవాలి. కాని ఎక్కడ మొదలు పెట్టాలో అర్థంకావట్లేదు.
ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి ఇలా మీ కోసం నేను చూసిన సినిమాల జాబితా ఇక్కడ ఇస్తాను. మీకు ఆంగ్ల లిపి చదవడం వచ్చని విశ్వసిస్తూ…

గురవారం జనవరి ౩
Teeth of Love – చైనీసు – ౨౦౦౬

శుక్రవారం జనవరి ౪
Surrogate Mother – కొరియను – ౧౯౮౬
Oneway ticket to Mombossa – ఫిన్నిష్షు – ౨౦౦౨

శనివారం జనవరి ౫
The Face – స్వీడిషు – ౧౯౫౮
జాతింగా ఇత్యాది – అస్సామి – ౨౦౦౭
A Time for Drunken Horses – ఇరానియను – ౨౦౦౦
Not Here to be Loved – ఫ్రెంచి – ౨౦౦౫

ఆదివారం జనవరి ౬
ఒరే కడల్ – మలయాళీ – ౨౦౦౭
Change of Address – ఫ్రెంచి – ౨౦౦౬
నీఞాస్ మల్ల్ – మెక్సికను (స్పానిషు) – ౨౦౦౭

సోమవారం జనవరి ౭
సోప్యోంజె – కొరియను – ౧౯౯౩
Upswing – ఫిన్నిష్షు – ౨౦౦౩
Forgetting Cheyenne – ఫ్రెంచి – ౨౦౦౬

మంగళవారం జనవరి ౮
Echoes of Sunshine (Documentary) – అస్సామీ
వెష్ వెష్ – ఫ్రెంచి – ౨౦౦౨
Ice Cream, I Scream – టర్కిషు – ౨౦౦౬
వైవా కూబా – క్యూబను(స్పానిషు) – ౨౦౦౫

బుధవారం జనవరి ౯
Chunhyang – కొరియను – ౨౦౦౦
El Benny – క్యూబను(స్పానిషు) – ౨౦౦౬
Borrowed Bride – టర్కిషు – ౨౦౦౬

గురువారం జనవరి ౧౦
రాళ్లు (లఘు చిత్రం) – తెలుగు – ౨౦౦౭
Shifting Prophecy (documentary) – ఇంగ్లీషు
When you descend from Heaven – ఫ్రెంచి – ౨౦౦౩
Neighbourhood Cuba – క్యూబను(స్పానిషు) – ౨౦౦౫

దేశాల వారీగా చెప్పాలంటే
ఐదు ఫ్రెంచి సినిమాలు, మూడు క్యూబను ఒక మెక్సికను ఐన మొత్తం నాలుగు స్పానిషు సినిమాలు, మూడు కొరియను, రెండు టర్కిషు, రెండు ఫిన్నిషు, తలా ఒకటిగా స్వీడిషు, మలయాళీ, అస్సమీ, ఇరానియను.

చూసిన సినిమాలన్నిటి గురించి రొజువారీగా నవతరంగంలో వ్రాస్తాను. చూసిన చాలా మంచి సినిమాల గురించి ప్రత్యేకంగా వ్రస్తాను. ఆలానే చలనచిత్రోత్సవ నిర్వాహణ గురించి కూడా టపాలు ఆశించగలరు.

One Response
  1. వెంకట్ January 14, 2008 /