Menu

హైదరాబాదు చలనచిత్రోత్సవం – కొన్ని సూచనలు

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవంరెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం విజయవంతంగా ముగిసిందనడానికి చాలానే సాక్ష్యాలున్నాయి. 35 దేశాలనుంచి వచ్చిన 150 సినిమాలు ప్రదర్శన అందుకు ఒక సాక్ష్యమైతే, దాదాపు 30 మంది నవ దర్శకులు దర్శకత్వం వహించిన 30కి పైగా లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించడం మరో సాక్ష్యం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంతకు పదిరెట్లైనా ఆశ్చర్యం లేదు.

ఒక ప్రదేశంలో చలన చిత్రోత్సవం జరగడం ద్వారా,ఆయా రాష్ట్ర దేశాల్లోని సినీ రంగంలోకి కొత్త నీరు ప్రవహించడం జరిగితే ఆయా చిత్రోత్సవాలకి సార్థకం చేకూరుతుంది. హైదరాబాదు చలన చిత్రోత్సవం ఈ విషయంలో చెప్పుకో దగ్గ ఫలితాలే సాధించిందని చెప్పొచ్చు.

సాధారణంగా ప్రభుత్వం నిర్వహించే ఈ చలన చిత్రోత్సవాలు, మన రాష్ట్రంలో ఒక ఫిల్ము క్లబ్ చే నిర్వహింపబడుతుంది. అలాగే చలన చిత్రోత్సవాలు జరిగే సమయాన అక్కడి సినీ పరిశ్రమకు చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు మరియు ప్రేక్షకులు పాలుపంచుకున్నప్పుడే ఈ చిత్రోత్సవాల వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.

ఈ మధ్యనే ముగిసిన హైదరాబాదు చలన చిత్రోత్సవంఏ కాకుండా రాబోయే రోజుల్లో మన చలన చిత్ర పరిశ్రమ మరింతగా అభ్వృధ్ధి సాధించాలంటే ఏం చేయాలో అన్న విషయం మీద నిర్వాహకులు చేసిన సూచనలివే:

  • Government should officially begin to organise HIFF so that the festival gets international recognistion quickly.
  • A bunch of short and documentary films should be screened periodically at public places like Lalitha kala thoranam of Hyderabad.
  • Theaters should compulsorily screen documentary and short films for a specified duration along with regular screenings.
  • Film heroes, heroines and othe prominent actors should procure delegate tickets in bulk and give them to their assistants and others.
  • Hyderabad film club and other film clubs should spare some time before or after their regular screenings to discuss films.
  • Media should go in for more learned criticism of films, including commercial films.
  • Parents and elders encourage, atleast not oppose, their wards who wish to make their careers in films.
  • Telugu film industry should observe holidays during film festival days to enable all members, technicians and others to participate.

రెండవ హైదరాబాదు చలన చిత్రోత్సవాల గురించి రోజువారీ రిపోర్టు ఇక్కడ చదవొచ్చు.