గోదావరి లొ గూఫులు

నేను ఇంతకు ముందు ఈ చిత్రం laptopలొ చూసినప్పటికీ, ఎదో మన గోదావరి కదా(మాది తుగొజి లెండి) అని DVD తెచ్చుకు చూసా. సినిమాలో చాలానే గూఫులు కనపడ్డాయి. మొదటి సీనులో ధనుర్మాసం అంటారు. మళ్ళి ఒకటవ తారీకు అంటారు. జనవరి ఒకటి కాబోలు అనుకున్నాను. కాని అది డిసంబరు ఒకటి. ధనుర్మాసం మొదలయ్యెది డిసంబరు పదిహేనున కదా మరి డిసంబరు ఒకటిన ధనుర్మాసం ఎమిటి? అదే రొజు హీరొ పార్టి కార్యలయానికి వెళ్తాడు. వాళ్ళు అతనిని మళ్ళి సరిగ్గా నెల తర్వాత కనిపించమంటారు. అతడు ఫిబ్రవరి పన్నెండున అంటాడు. డిసెంబరు ఒకటి నించి ఫిబ్రవరి కి నెల రోజులా? ఒక నెలరొజుల తర్వాత వీళ్ళు అందరు కళ్యాణం చూడదానికి బయలుదేరతారు. సీతరామ కళ్యాణం జరిగేది చైత్రంలొ కదా? అంటే మర్చి, ఏప్రెల్ నెలలు. జనవరిలొ ఏ కళ్యాణం జరుగుతుంది? నాకు చిరాకు వెసింది ఎక్కడ అంటె ఎదొ కధ సంభషణ రాసెయ్యడమే తప్ప, కాస్త timeline సరిపొయిందా లేదా అని చూసుకోరు? తెలుగు ప్రేక్షకులు ఏమయినా చూసెస్తారులే అన్న ధైర్యమా?

–మంజుల

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుThe Accused-నిందుతులు4 Month, 3 Weeks and 2 Days