Menu

తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక – చిత్ర

balance2.gifతెలుగువారి సాహితీమాస పత్రిక భారతి,1939,సెప్టెంబరు నెల సంచికలో ఒక సినిమా పత్రిక గురించి పరిచయం చేసింది.

పత్రిక పేరు ‘ చిత్ర ‘

సంపాదకుడు కే.వి.సుబ్బారావు.

సినిమా పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం వెల్వడిన ఈ మాసపత్రికా రత్నం మొదటి సంపుటం మొదటి సంచిక,జులై నెలది మా కార్యస్థానం చేరింది.ఇంగ్లీషులో సరే,పలు రంగుల మిరుమిట్లు గొలిపే ఇట్టి మాసపత్రికలెన్నో వున్నాయి.కానీ హిందూస్తానమంతలోనూ డిల్లీనుంచి వెలువడే “చిత్రపటమ”నే మాసపత్రిక తప్ప యావద్భారత సినిమాకళాభివృద్ధిని గురించి తెలిపే పత్రికే లేకుండేది ఆంధ్రదేశములో.ఇప్పుడు ఈ తిరంగీ చౌరంగీ చిత్ర ఆలోపాన్ని దీర్చి కళాభిలాషులకు ఆమోదం కూర్చిందనడం లో సందేహం లేదు.ఒక విధంగా ఇది సినీమా విశ్వరూపం వంటిది .ఆ కాలం లో అర్జునుడికి ఒకే చోట సమస్త విశ్వాన్నీ చూడగల భాగ్యమబ్బిన లాగే,ఈకాలం లో ప్రతి యాంధ్రుడికీ,ఒక్క యాంధ్రుడే ఏం,చూడగల ప్రతి మానవుడికి,సమస్త సినీమా ప్రపంచాన్ని దర్శించే భాగ్యం కల్గుతుంది.స్వీయ విషయోద్ఘాటనం తో ప్రధాన డైరెక్టరు లిచ్చిన ఆశీర్వాద నామక పుష్పాంజలులతో మిగుల రమణీయంగా ఉంది చిత్ర.సినిమా విముఖులను సైతమూ సుముఖులచేసి తమవైపునకు ఆకర్షించుకొంటు న్నాయి ఇందులోని చిత్రపటాలూ,విషయాలూనూ.ఇదే ప్రకారం వివిధాలంకారాలను గూర్చుకొని ప్రతినెలా సర్వాంగ సౌష్టవంగా ఆంధ్రులందరి హృదయాలను ఆనందం సమకూరుస్తూ వుండాలని మా హార్ధికాభిలాష.ఈశ్వరుడందుల కనుగ్రహించు గాక.పత్రిక దొరికే చోటు 1/8,ఆలీవర్ రోడ్,మైలపూర్,మదరాసు.

శివలెంక శంభు ప్రసాద్ సంపాదకత్వాన 1939 సెప్టెంబరు సంచికలో భారతి వెలిబుచ్చిన అభిప్రాయాలు క్లుప్తంగా పరిశీలిస్తే, ఆనాటికి మనకు ఉన్నది డిల్లీనుంచి వెలువడుతున్న చిత్రపటం అనే ఒక్క పత్రిక ఒక్కటే భారతసినీ పరిశ్రమ గురించి తెలియజేసేది. అలాగే సినిమా విశేషాలను గురించి అదీ అఖిల భారత స్థాయిలోని చలంచిత్ర వార్తల గురించి తెలుసుకోవాలనే అభిలాష పాఠకులకు ఉండేది కానీ ఆస్థాయి పత్రికలు మాత్రం లేవు.ఇప్పటికీ తెలుగులో ఆలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది.సినిమా పత్రికలు కుప్పలుతెప్పలుగా ఉన్నా,మూవీ పోర్టల్స్,వెబ్ సైట్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నా పాఠకులకు అందుతుంది సినిమా వార్తలే,విజ్ఞానం కాదు.అలోపం కొంత వరకూ నవతరంగం తో తీరుతుంది,అందరి సౌజన్యం,సహకారాలతో.

6 Comments
  1. వెంకట్ January 2, 2008 /
  2. Paruchuri Sreenivas January 3, 2008 /
  3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి January 3, 2008 /
  4. Sowmya January 4, 2008 /
  5. వెంకట్ January 4, 2008 /
  6. murali March 30, 2013 /