Download నవతరంగం

logo.gifనవతరంగం వెబ్‌సైట్ మొదలుపెట్టి ఇప్పటికి నెల కావొస్తుంది. ఈ నెలలో దాదాపు 50 వ్యాసాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలపై పాఠకుల స్పందన కూడా బాగానే వుంది. భవిష్యత్తులో మరింత మంది రచయితలు నవతరంగం రాసే అవకాశాలున్నాయి. దాంతోనే మరింతమంది పాఠకులను ఈ సైటు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.

తెలుగు సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు చాలానే ఉన్నప్పటికీ, ఆ వెబ్ సైట్లలో తెలుగులో వున్నవి తక్కువే. నవతరంగం ద్వారా ఆ కొరత తీర్చాలన్నది మా ప్రయత్నం. అలాగే ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాల గురించి సమీక్షలు, వ్యాసాలు, విశ్లేషణలు ఈ వెబ్సైట్ ద్వారా అందించాలన్నది కూడా మా ఆకాంక్ష.

అలాగే ఇక్కడ ప్రచురించిన వ్యాసాలు మరింతమందికి చేరాలన్న ప్రయత్నంలో ప్రతి నెలాఖరులో ఆయా నెలలో నవతరంగంలో ప్రచురించబడ్డ వ్యాసాలన్నీ pdf ఫార్మట్ లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేస్తున్నాము. ఈ సదుపాయం కలుగచేయాలని సూచన చేసిన రాకేశ్వర్ రావు కి కృతజ్ఞతలు.

ఈ నెలలో వచ్చిన 40 వ్యాసాలు pdf ఫార్మట్ లో ఇక్కడ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి నెలలో:

వచ్చే నెలలో నవతరంగంలో స్వరీయ B N రెడ్డి గారిపై ఫోకస్ చేయాలనుకుంటున్నాము. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలపై మీ సమీక్షలు, వ్యాసాలు పంపగోరిన వారు navatarangam[at]gmail[dot]com కు మెయిల్ చేయగలరు. B N రెడ్డి సినిమాలపై ఆసక్తి కరమైన రచనలు చేసిన వారికి విలువైన బహుమతులు కూడా ఇవ్వాలనే ఆలోచన వుంది. ఈ నెలలోనే కాదు రాబోయే నెలల్లో నవతరంగం కోసం అత్యుత్తమ వ్యాస రచన చేసిన వారికి బహుమతులు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అలాగే హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ విజేతల పరిచయాలు కూడా నవతరంగం లో ప్రచురించబడతాయి.

ఈ నెలలో జరిగే అతి పెద్ద సినిమా ఏవెంట్ అయిన ఆస్కార్ అవార్డుల రేసులో వున్న సినిమాలు, వ్యక్తుల గురించి కూడా కొన్ని వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము.

ఈ నెలలో నవతరంగం మరింత మంది పాఠకులను, రచయితలను ఆకర్షిస్తుందని ఆశిస్తూ….శెలవు

టీం @ నవతరంగం

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

2 Comments to “Download నవతరంగం”

  • pdf యూనీకోడులో వుంటే ఇంకాబాగుంటుంది. కాపీ పేస్టు చేసుకునే సౌకర్యం ఉంటుంది చదువరులకు.
    అలానే, మొదటి పేజీలో విషయ సూచిక వుంటే బాగుంటుంది.
    రాకేశ్వర
    http://navatarangam.com/?author=5

  • నెలలో 40 వ్యాసాలు మంచి అంశాలు,చక్కటి విశ్లేషణలు,కొందరి కోరిక మేరకు సందర్శకుల కిటికీ ఒకటి ఉంటే బావుంటుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories