ఎందరో విద్యావేత్తలు తమ భాషాపాటవాన్ని సినిమా విమర్శలు, సమీక్షలు రాసేందుకు ఉపయోగించుకున్నారు. కొ.కు లాంటి ఎందరో బహుముఖ ప్రజ్ఞాశాలులు వందలాది వ్యాసాలతో దశాబ్దాల క్రితమే పాఠకులకు చలంచిత్ర రంగానికి చెందిన అన్ని అంశాలను పరిచయం చేసి వారి అవగాహనా పటిమను పెంచారు. అన్ని శాస్త్రాల లాగానే సినిమ నిర్మాణం లోఎన్నో సాంకేతికమైన మార్పులు చేర్పులు, చాలా కొత్తవిభాగాలు కాలక్రమంలో భాగాలవుతున్నాయి. నిర్మాతలు, నటీనటులకు ఈవిషయాల మీద పెద్ద అవగాహన అవసరంలేక పోయినా మిగిలిన సాంకేతిక నిపుణులకు, దర్శకుడికీ అవశ్యం. అదే విధంగా సినిమాల మీద సమగ్రమైన రచనలు చేసేవారికీ తప్పని సరి. కొన్ని సందర్భాలలో కొంతమంది విమర్శకులు దశాబ్దాల పాటు తిరుగులేని, సాటిలేని వారుగా చలామణి అవుతారు. కానీ ఎప్పుడో ఒకసారి తాడిని తన్నే వాడి తలదన్నేవాడు వచ్చినట్లు ఇంకో మేధావి వచ్చి అసలు విషయం బయటపెడతాడు.
ఇక్కడ తాడిని తన్నింది టి. జి. వైద్యనాథన్ అనే విద్యావేత్త, రచయితా కాగా, తలను తన్నిన మరో మేధావి గిరీష్ కర్నాడ్.
టి. జి. వైద్యనాథన్ బెంగలూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేశారు. క్రికెట్, సాహిత్యం, తత్వశాస్త్రం లాంటి ఎన్నో విభిన్న అంశాల మీద చాలా రచనలు చేశారు. ఐతే ఆయనకు మంచిపేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టినవి మాత్రం, కర్ణాటక లో అగ్రగామి ఆంగ్ల దినపత్రిక దెక్కన్ హెరాల్డ్ లోని సినిమా సమీక్షలే . సుదీర్ఘకాలం టి. జి. వి. నిర్వహించిన సినిమాసమీక్ష అక్కడి విద్యాధికులకు చలనచిత్ర ప్రేక్షకులకు, పాఠకులకు కరదీపికగా ఉండేది.
సుమారు మూడు దశాబ్దాల తన సమీక్షలను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారు హవర్స్ ఇన్ ది డార్క్, ఎస్సేస్ ఆన్ సినిమా గా 1996 లో ప్రచురించారు. సహజంగానే ఆ పుస్తకంమీద సమీక్షలు, ప్రశంసలు యధావిధిగానే వచ్చాయి. కొంతకాలంసినిమా, అకడమిక్ రంగాల్లో చర్చ కూడా జరిగింది. అంతాబాగానే ఉందీ అనుకుంటునంరోజుల్లో పులిమీద పుట్రలా గిరీష్ కర్నాడ్ సమీక్ష ది బుక్ రెవ్యూ ఏప్రిల్ 1997 సంచికలో వెలువడింది. అప్పటి వరకూ టి. జి. వి. సినిమా సమీక్షలను నెత్తిన పెట్టుకున్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.
పాఠకులారా ఇప్పటి వరకూ వైద్యనాథన్ గారు మనకు కొత్తగా చెపింది ఏమీ లేదు, ఇంతవరకూ ఎవరూ రాయని అంశాలు కూడా కాదు అవి. పైగా తనకు తెలియని ఎన్నో అంశాలను పేద్ద భాషాప్రయోగంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసుకొచ్చాడు అనేది కర్నాడ్ చెప్పిన మొదటి నిజం. రెండోది ఫిల్ము స్టడీస్ అనేది కాలక్రమంలో స్ట్రక్టయరిలిస్ట్-సెమీయాటిక్స్, సైకోఅనలిటిక్ క్రిటిసిజం, డికనస్ట్రక్షన్, ఫెమినిజం, ఇలా ఎన్నో శాఖోపశాఖలను అన్వయించుకుంటూ ముందుకు సాగుతుంటే, ఏనాడో అరిస్టాటిల్ చెప్పిన ప్లాట్, కారెక్టర్ దగ్గరే టి. జి. వి. నిలిచిపోయాడు అనేది రెండో వాస్తవం. ఇలా ఎన్నో విషయాలను నిశితంగా విశదీకరించిన కర్నాడ్ పేల్చిన కన్నడ బాంబు తిరుగులేనిది. మూడు డశాబ్దాల పాటు ఆంగ్ల, కన్నడ సినిమాలను సమీక్షించిన వైద్యనాథన్ కు కన్నడభాషే రాదనేది ఆ బాంబు. ఏదో వినటం, కొన్ని చిన్నచిన్న పదాలు తప్ప కన్నడ భాషే రాని టి. జి. వి. ఆభాషా సినిమాలను సమీక్షించటమే అన్నిటికంటే పెద్ద వింత అని కూడా కర్నాడ్ అన్నాడు.
మంచి ఇంగ్లీషు రాసే వాళ్ళు తక్కువగా ఉండటం, న్యూస్ పేపర్లకు డెడ్ లైన్ లోపు రాసి ఇవ్వగలగటం, తాజాగా విడుదల అయిన సినిమా సమీక్షనే పాఠకులు చదువుతారు గానీ, సమగ్ర విమర్శలను కాదు అనే అభిప్రాయంతో దినపత్రికలు స్థానికభాష తెలీకపోయినా అలాంటి వారిచేతే సమీక్షలను రాయిస్తున్నాయి అనేది కర్నాడ్ వివరణ.
సినిమా అనే కాకుండా ఏ అంశంమీదైనా నిపుణుల అభిప్రాయంతో పాటు మనకూ ఒక స్వంత నిర్ణాయకశక్తి, వైయుక్తిక భావస్వేచ్చా ఉండాలి. బుద్ధుడు ఒక సందర్భం లో తనశిష్యులతో చెప్పిన మాటలను ఇక్కడ మననం చేసుకోవటం అవసరం. బౌద్ధ ధర్మాన్ని అనుసరించటం గానీ, మరే ఇతర జీవన వ్యాపారకార్యకలాపాలలో గానీ, స్వంత నిర్ణయాలు తీసుకోండి. బుద్ధుడు చెప్పాడనో, శాస్త్రాలు ఘోషించాయనో, పెద్దలూ, తల్లితండ్రులూ చెప్పారనో, లేక బ్రాహ్మణులు చెప్పారనో మీరు మరో ఆలోచన లేకుండా ఆచరించటం కాదు, ప్రతిపనిలోనూ యుక్తాయుక్త విచక్షం జ్ఞానంతో వ్యవహరించండి అని ఉపదేశించాడు. మనం కూడా మన బుర్రలకూ పనిచెపితే చాలా మందికి మనకు ఉచితసలహాలు ఇచ్చే శ్రమ తప్పించిన వారము అవుతాము.
వెంకట్ says:
రాజేంద్ర గారు,
మరో వ్యాసం అందించినందుకు నెనర్లు.
వార్తా పత్రికలకు వ్రాయడంలో ఒక సమస్య వుందండీ,, ఆయా ఆత్రా పత్రికల యాజమాన్యం రూపోందించిన రూల్స్ కి వ్యతిరేకంగా వ్రాయలేము. అలాగే స్వంత అభిప్రాయాలకూ పెద్దగా అవకాశం వుండదు. సినిమా బావుంది, బాగోలేదు లాంటివే వ్రాయాలి. గిరీష్ కర్నాడ్ ఆన్నట్టు “స్ట్రక్టయరిలిస్ట్-సెమీయాటిక్స్, సైకోఅనలిటిక్ క్రిటిసిజం, డికనస్ట్రక్షన్, ఫెమినిజం, ” లాంటి విషయాలు రాస్తే చదివే వాళ్ళు ఎక్కడ వున్నారు చెప్పండి?
ఇప్పుడే ప్రముఖ తెలుగు సినిమా వెబ్ సైటు చూస్తుంటే చలనచిత్రోత్సవాల్లో జ్యూరీ ఎన్నుకున్న స్పెషల్ సినిమాలు మాత్రమే వుంటాయట.. ఆ సినిమాల్లో కమర్షియల్ విలువలే వుండవని అన్నారు.
ఇలా ఎవరిష్టమొచ్చిన ఒపీనియన్ వారివ్వడం ఈ రోజుల్లో కొత్తేమీ కాదు. ఈ సమస్య కు పరిష్కారమూ లేదు.
24ఫ్రేములు, 64కళలు » నవతరంగం 21-30 says:
[...] విమర్శపై విమర్శ [...]