Menu

బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

suchitra.jpgజనవరి మూడు నుండి పదవ తేదీ వరకూ హైదరాబాదులో సినీ అభిమానుల దాహం తీర్చనున్న రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లానే బెంగళూరు లో కూడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభం కానుంది. దాదాపుగా హైదరాబాదులో ప్రదర్శించనున్న చిత్రాలే ఇక్కడ కూడా ప్రదర్శింపబడనున్నాయి.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన స్వప్నోదనయ్ చిత్రంతో ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఈ చిత్రోత్సవంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమాలు చాలానే వున్నాయి. ఇక్కడ ప్రదర్శించే చిత్రాల పూర్తి వివరాలకై ఇక్కడ చూడొచ్చు. ఈ సంవత్సరం Retrospective విభాగంలో జపానుకి చెందిన ప్రఖ్యాత దర్శకుడు కెంజి మిజోగుచి రూపొందించిన ఐదు సినిమాలు ఇక్కడ ప్రదర్శింపబడనున్నాయి. ఉత్తమ సినిమా కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక వరమే అని చెప్పొచ్చు. చాలా ఏళ్ళుగా మిజొగుచి సినిమాలు DVDల రూపంలో కూడా లభ్యమయ్యేవి కాదు. ఇప్పుడిప్పుడే ఈయన సినిమాలు DVD లు గా వస్తున్నప్పటికీ వెండి తెరపై ఆయన రూపొందించిన కళాఖండాలు చూడగలగడం బెంగళూరు వాసుల అదృష్టమే అనాలి.కెంజి మిజోగుచి గురించి మరిన్ని వివిరాలకై ఈ సైటులోని ఫోకస్ సెక్షన్ చూడండి.

ప్రతి సంవత్సరం ఒక్కో దేశం సినిమాలపై దృష్టి సారించే ఈ చలన చిత్రోత్సవం ఈ సారి South Africa సినిమాలను ప్రదర్శించడం జరుగుతుంది.  ఈ విభాగంలో ప్రదర్శించే ఆరు సినిమాల్లో Red Dust సినిమాను మాత్రం మిస్సవ్వకండి.

హైదరాబాదు చలన చిత్రోత్సవంలానే ఈ చలన చిత్రోత్సవం కూడా ఒక ఫిల్మ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుండడం ఒక విశేషం. చూస్తుంటే రానున్న రోజుల్లో మన దేశంలోని ఫిల్మ్ క్లబ్ లు పెద్ద సంచలనమే తేనున్నట్టున్నాయి. చెన్నై లో డిశెంబర్ లో జరిగిన చలన చిత్రోత్సవం, అలాగే ముంబై లో ఫిబ్రవరిలో జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ విషయాన్ని ధృఢపరుస్తున్నాయి.

1971 లో సత్యజిత్ రే చేతుల మీదగా ప్రారంభించబడ్డ ఈ ఫిల్మ్ క్లబ్ మన దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్ క్లబ్ లో ఒకటి అని చెప్పొచ్చు. బనశంకరి లో వున్న సుచిత్ర ఫిల్మ్ క్లబ్ సందర్శించిన వారెవరైనా ఈ విషయం లో తప్పక ఏకీభవిస్తారు.

వారం రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలు చూసే అవకాశం సంవత్సరానికి ఒక్క సారే వస్తుంది కనుక ఈ అవకాశం మిస్ కాకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *