నేను Talk Cinema లో ఈ చిత్రం చూశాను. Talk Cinema అంటే, ఎప్పుడూ ప్రదర్శించని చిత్రాలు ప్రదర్శిస్తారు. ఏ సినిమా ప్రదర్శిస్తారో కూడ మనకి చెప్పరు. సాధారణంగా independent and foreign films ప్రదర్శిస్తారు. ప్రదర్శన తర్వాత సినిమా గురించి చర్చిస్తారు. ఇది నా మొట్టమొదటి Romanian చిత్రం.సినిమా 1987 లొ జరుగుతుంది. సినిమా కధాకాలం ఒక్క రొజు. ఒక అమ్మాయి 4 నెలలు, 3 వారాలు, 2 రోజుల గర్భవతి. తన గర్భాన్ని తీయించేసుకోవలి అనుకుంటుంది. కాని ఇది abortions మీద సినిమా కాదు. ఈ చిత్రం లొ స్నేహం, సంభందాలు, communist రోజులలొ రొమేనియన్ సంఘిక పరిస్థితులు ప్రధాన అంశాలు. నాకు ఈ చిత్రం ఆడవాళ్ళ సినిమా అనిపించినా, ప్రేక్షకులలో మగవారికే ఈ చిత్రం ఎక్కువ నచ్చింది. ఈ సినిమా ని చాలా బాగ తీసారు. చాల మటుకు stationary camera తొ తీసారు. మనకి setting లొ ఒక భాగమె కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ మాటలు మాత్రమే వినబడతాయి. ఇంకొక చెప్పుకొదగ్గ విషయం ఏమిటి అంటే, background score లేక పొవడం. కొన్ని దృశ్యాలు అనవసరమేమొ అనిపిస్తాయి కాని వాటి significance తర్వాత తెలుస్తుంది. నేను కధ కొన్ని మలుపులు తిరుగుతుందెమో అనుకున్నను గాని, ఆలా జరగలేదు. ఆ మలుపులు తిరిగి వుంటె నాకు ఈ చిత్రం అంతగా నచ్చేది కాదేమో. మీకు ఈ చిత్రం నచ్చినా నచ్చకపొయినా ఖచ్చితంగా మీ చేత అలోచింపచేస్తుంది.
–మంజుల
వెంకట్ says:
మంజుల గారూ,
ఈ సినిమా చూసాను. ౨౦౦౭ లో వచ్చిన ఉత్తమ సినిమాల్లో ఇది ఒకటి
సినిమా మొత్తం రియలిస్టిక్ గా వుండడానికి కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం, స్టేషనరీ కెమెరా వాడడం. ఈ చిత్రదర్శకునితో పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో అతను చెప్పింది కూడా అదే! డైనింగ్ టేబుల్ దగ్గర 10 నిమిషాలపాటు సాగే సీను నాకు చాలా నచ్చింది. ఆల్ టైమ్ ఫేవరేట్.
మీకు తెలుసా, రొమానియాలో కేవలం 20-30 సినిమాహాల్ళే వున్నాయట. ఈ సినిమా ప్రదర్శించడానికి ఒక కారావాన్లో ఊరూరా తిరిగి ఈ సినిమా ప్రదర్శించారట.
మీకు వీలైతే ఈ రొమానియన్ సినిమాలు కూడ చూడండి
California Dreamin’
Death of Mr Lazarescu
వెంకట్
మంజుల says:
Thanks for recos! ఈ సినిమాలు చూడడానికి ప్రయత్నిస్తాను. ఆ dining table scene చాలా బాగా తీశాడు. నేను క్రితం శుక్రవారం La Chinoise చిత్రం చూశాను. అది నేను చూసిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. దాని మీద నా అభిప్రాయం post చేస్తాను.
వెంకట్ says:
4 months, 3 weeks, 2 days కు ఆస్కార్ నామినేషన్ దక్కలేదు.అలాగే secret sunshine కి కూడా…
ఏంటో ఈ అస్కార్ వాళ్ళ టేస్ట్ నాకర్థం కాదు.
మంజుల says:
Oscars are probably the most overrated awards. వాళ్ళు ఏ సినిమాకి ఎందుకు awards ఇస్తారో ఇవ్వరో అర్ధం కాదు. చాలా మంచి సినిమాలకి awards ఇవ్వలేదు. చాలా చెత్త సినిమాలకి ఇస్తారు. ఈ సినిమాకి Critics choice award ఇచ్చినప్పుడు కనీసం nomination వస్తుంది అనుకున్నాను.