రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం

cal_img.jpgకొత్త సంవత్సరం ఎలా మొదలయిందో లేదో హైదరాబాదు సినీ అభిమానులకు పెద్ద పండగే మొదలవ్వబోతుంది. హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంకో రెండు రోజుల్లో మొదలవబోతుందన్న సంగతి తెలిసేవుంటుంది.2006లో హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ వారు పూనుకుని నిర్వహించిన ఈ చిత్రోత్సవం ఈ కొత్త సంవత్సరంలో కాస్త ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇది ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కాబోలు!

దాదాపు నలభై దేశాలకు చెందిన 150 సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్నాయి. వారం రోజుల్లో 150 సినిమాలు చూడడం ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ వీలయినన్ని మంచి సినిమాలు ఇక్కడ చూసే అవకాశం దక్కుతుంది. ఈ సంవత్సరం ప్రముఖ కొరియన్ సినిమా దర్శకుడు Im Kwon–taek రూపొందించిన 8 సినిమాలు retrospective విభాగంలో ప్రదర్శింపబడనున్నాయి.ఆ సినిమాల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు.

అలాగే ప్రతి సంవత్సరం ఒక్కో దేశానికి సంభందించిన సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తూ focus విభాగంలో ఈ సారి హంగరీ దేశం సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ విభాగంలో ప్రదర్శిస్తున్న సినిమాలు ఇవే:

మనకు పెద్గగా తెలియని హంగరీ దేశం నుంచి సినిమాలు ప్రదర్శించడం బాగానే వుంది కానీ, ఆ దేశానికి చెందిన అత్యంత ముఖ్యమైన దర్శకుల్లో ఒకరయిన Bela Tarr సినిమా ఒక్కటి కూడా ఈ ప్రదర్శన లో చోటు చేసుకోకపోవడం పెద్ద వెలితే!

ఇవికాకుండా ఇక్కడ ప్రదర్శించే ఎన్నోసినిమాలు ఇదివరకే వివిధ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి అవార్డులు సైతం గెలుచుకున్నాయి. ఈ చిత్రోత్సవంలో మీరు పాల్గొంటున్నట్టయితే ఈ క్రింది పేర్కొన్న సినిమాలు మాత్రం మిస్సవ్వకండి.

అలాగే ఈ చిత్రోత్సవం హాజరయ్యే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు మూడు వున్నాయి. అవి మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన భువన్ సోమే, Antonioni దర్శకత్వం వహించిన Red Desert మరియు Ingmar Bergman దర్శకత్వంలో వచ్చిన The Face. 2007 లో మరణించిన KK Mahajan (భువన్ సోమే సినిమాటోగ్రాఫర్), ప్రఖ్యాత ఇటాలియన్ సినిమా దర్శకుడు Antonioni, మరియు స్వీడెన్ కి చెందిన Ingmar Begman లకు శ్రధ్ధాంజలి ఘటిస్తూ ఈ సినిమాలు ప్రదర్శింపబడనున్నాయి. Red Desert, Bhuvan Some సినిమాలు ఫర్వాలేదు కానీ, The face (ఇదే సినిమా The Magician కూడా పిలవబడుతుంది) కంటే ఎన్నోమంచి సినిమాలు Bergman రూపొందించారు. వాటిలో ఏదైనా సినిమా ప్రదర్శిస్తే బావుండేదేమో!

ఇవే కాకుండా ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ ప్రదర్శింపబడుతాయి. ఇక్కడ ప్రదర్శించే సినిమా పూర్తి వివరాలు ఇక్కడ నుంచి పొందవచ్చు. రెండవ హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురించి మరిన్ని వార్తలు, సమీక్షలు, విశేషాల కొరకై నవతరంగం కి తిరిగిరండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

4 Comments to “రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం”

  • నాబోటి సామాన్యులు సినిమాలు చూడాలంటే ఎలా? ప్రొసీజర్ ఏమిటి? మామూలు సినిమాలాగానే టైంకి ముందు వెళ్ళి క్యూలో నిల్చోని టిక్కెట్ కొనుక్కోవచ్చా?

  • కిరణ్ గారూ, అవునండీ, మామూలు సినిమాలాగానే టైంకి ముందు వెళ్ళి క్యూలో నిల్చోని టిక్కెట్ కొనుక్కోవచ్చు.

  • ఈ టపాలో లిస్టు ఇచ్చారని ఇప్పుడే గమనించాను..
    నిన్న ప్రారంభోత్సవంలో teet of love అనే చైనీసు సినిమా వేశారు . చాలా బాగుంది.

    త్వరలోనే hiff గురించి ఇక్కడ వ్రాయడం మొదలు పెడతాను…
    రాకేశ్వర

  • Rakesh,
    చూడదగ్గ సినిమాల లిస్టు మీకు మెయిల్ లో పంపాను .చూసుకోంఛి.
    వెంకట్

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories