Menu

Monthly Archive:: January 2008

Persepolis

ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను. ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా. నేను Talk Cinema కి వెళ్ళినపుడు, ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను. ఇది animated చిత్రం. దీనికి Oscar nomination కూడ వచ్చింది. ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఫ్రెంచి చిత్రమయిన, కధ ఇరానీన్. నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. ఈ కధ కాస్త ఇరాన్లోను, కాస్త ఆస్ట్రియాలోను

తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు

చిత్రోత్సవంలో నేను రెండు అస్సామీ సినిమాలు చూసాను. కాకతీళీయంగా రెండూ ఉల్ఫా తీవ్రవాదం గురించే. కానీ వాటిలో ఒకటి మామూలు సినిమా ఇంకోటి డాకుమెంటరీ. సినిమా కల్పితం, డాకుమెంటరీ మాత్రం ఉల్ఫాలోకి లాగబడ్డ ఒక వ్యక్తి నిజ జీవితాన్ని అతనే వివరిస్తాడు. రెండిటికీ పోలిక ఏంటంటే, రెండిటిలోనూ హీరో దయగలవాడు, కానీ ఉల్ఫా యొక్క హింసాత్మక పద్ధతుల్ని సమర్ధించే వాడు కాదు. జతింగా ఇత్యాది హీరో మానబ్ కాలేజి పట్టభద్రుడు, ఉద్యోగ వేటలో లంచగొండితనం, అవినీతి ఎదుర్కొంటాడు.

Download నవతరంగం

నవతరంగం వెబ్‌సైట్ మొదలుపెట్టి ఇప్పటికి నెల కావొస్తుంది. ఈ నెలలో దాదాపు 50 వ్యాసాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలపై పాఠకుల స్పందన కూడా బాగానే వుంది. భవిష్యత్తులో మరింత మంది రచయితలు నవతరంగం రాసే అవకాశాలున్నాయి. దాంతోనే మరింతమంది పాఠకులను ఈ సైటు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు చాలానే ఉన్నప్పటికీ, ఆ వెబ్ సైట్లలో తెలుగులో వున్నవి తక్కువే. నవతరంగం ద్వారా ఆ కొరత తీర్చాలన్నది మా ప్రయత్నం.

గోదావరి లొ గూఫులు

నేను ఇంతకు ముందు ఈ చిత్రం laptopలొ చూసినప్పటికీ, ఎదో మన గోదావరి కదా(మాది తుగొజి లెండి) అని DVD తెచ్చుకు చూసా. సినిమాలో చాలానే గూఫులు కనపడ్డాయి. మొదటి సీనులో ధనుర్మాసం అంటారు. మళ్ళి ఒకటవ తారీకు అంటారు. జనవరి ఒకటి కాబోలు అనుకున్నాను. కాని అది డిసంబరు ఒకటి. ధనుర్మాసం మొదలయ్యెది డిసంబరు పదిహేనున కదా మరి డిసంబరు ఒకటిన ధనుర్మాసం ఎమిటి? అదే రొజు హీరొ పార్టి కార్యలయానికి వెళ్తాడు. వాళ్ళు అతనిని

హైదరాబాదు చలనచిత్రోత్సవం – కొన్ని సూచనలు

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం విజయవంతంగా ముగిసిందనడానికి చాలానే సాక్ష్యాలున్నాయి. 35 దేశాలనుంచి వచ్చిన 150 సినిమాలు ప్రదర్శన అందుకు ఒక సాక్ష్యమైతే, దాదాపు 30 మంది నవ దర్శకులు దర్శకత్వం వహించిన 30కి పైగా లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించడం మరో సాక్ష్యం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంతకు పదిరెట్లైనా ఆశ్చర్యం లేదు. ఒక ప్రదేశంలో చలన చిత్రోత్సవం జరగడం ద్వారా,ఆయా రాష్ట్ర దేశాల్లోని సినీ రంగంలోకి కొత్త నీరు ప్రవహించడం జరిగితే ఆయా చిత్రోత్సవాలకి