Menu

ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా

గత సంవత్సరం ప్రముఖ తెలుగు నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి రూపొందించిన ప్రయోగాత్మక సినిమా సిరా/Ink సినిమా జనవరిలో జరగనున్న ముంబాయ్ చలన చిత్రోత్సవాలకు ఎంపికయింది. ఈ సంధర్భంగా మాట్లాడుతూ తనికెళ్ళ భరణి తన సినిమా ఈ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఎంతో ఆనందం గా వుందని వ్యాఖ్యానించారు.

గతంలో హైదరాబాదు చలన చిత్రోత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్రయోగాత్మక సినిమాగా చెప్పుకోవచ్చు. Luis Bunuel, Salvador Dali లు రూపొందించిన సర్రియల్ సినిమాల ద్వారా ప్రేరణ చెంది ఒక కవి ఉగ్రవాదం పై జరిపే పోరును ఈ చిత్రంలో వైవిధ్యంగా చిత్రీకరించారు భరణి గారు.

ఈ చిత్రం అందించిన విజయంతో రాబోయే ఆరునెలల్ల్లో మరో చలన చిత్రం రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు తనికెళ్ళ భరణి. సిరా చిత్రం లాగే ఈ కొత్త సినిమా కూడా ఆయనకూ , తెలుగు సినిమాకూ మరిన్ని పేరు ప్రతిష్టలు తేగలవని ఆశిద్దాం.

2 Comments
  1. cric January 1, 2008 / Reply
  2. వెంకట్ January 1, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *