Menu

హైదరాబాదు ఫిల్మ్ క్లబ్

ప్రతి వారం విడుదలయ్యే కమర్షియల్ సినిమాలే కాకుండా హైదరాబాదులో ప్రతి నెలా వివిధ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ప్రదర్శించే మరో చోటు వుందని మీకు తెలుసా?

హైదారాబాదు నడి బొడ్డున, అమీర్ పేట్ కూడలికి అతి దగ్గరలో సారధీ స్టూడియోస్ ప్రాంగణంలో నెలకొని వున్న హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సినీ ప్రేమికుల స్వప్నం అనొచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు రెండొందల సినిమాలు ప్రదర్శింపబడతాయి. దేశ విదేశాలనుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ సినిమాలను ఇక్కడ చూడొచ్చు.

ఈ సినిమాలన్నీ చూసే అవకాశం ప్రతి ఒక్కరికీ వుంటుంది. మీరు చేయవలిసిందల్లా ఈ ఫిల్మ్ క్లబ్ లో సభ్యత్వం పొందడమే. కేవలం 500 రూపాయల వ్యయంతో ప్రపంచంలోని మంచి సినిమాలన్నీ చూసే అవకాశం కలుగుతుంది.మీరు విధ్యార్ధి అయినా, ఉద్యోగస్తుడైనా, లేదా సినిమాలు తీయాలని ఆసక్తి కలిగిన వారైనా ఇక్కడ ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గ సినిమాలు వీక్షించే అవకాశం వుంది.

ప్రఖ్యాత సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ ద్వారా ముప్పై ఏళ్ళ క్రితం స్థాపించబడిన ఈ క్లబ్ ఇప్పుడు ప్రకాశ్ రెడ్డి, MV రఘు లాంటి వారిచే నిర్వహించబడుతోంది. కేవలం సినిమా చూడడమే కాకుండా ఆయా సినిమాల గురించి, దర్శకుల గురించిన పరిచయ కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.

మునెపెన్నడూ హైదరాబాదు ఎరుగని అంతర్జాతీయ చలన చిత్రోత్సవం గత సంవత్సరం ఆరంభం కావడం వెనుక హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ పాత్ర ఎంతో వుంది.

సినిమా అనే ప్రక్రియను కేవలం వినోద ప్రధానం గానే కాకుండా వివిధ దేశ పరిస్థితులను, అక్కడి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలనూ, వారి సమస్యలనూ తెలుసుకోవడానికి సినిమా ఒక మాధ్యమంగా వుపయోగపడుతుంది అనుకునే వారికి ఇలాంటి ఫిల్మ్ క్లబ్ లో సభ్య్త్వం పొందడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది.

అలాగే సినిమాలు తీయాలనే ఆసక్తి కలిగిన వారికి, సహాభిప్రాయాలు కలిగిన వారిని కలుసుకోవడానికి, ప్రపంచం లోని వివిధ దేశాల చిత్రాల శైళి తెలుసుకోవడానికి కూడా ఈ ఫిల్మ్ క్లబ్ ఉపయోగపడుతుంది.

హైదరాబాదు ఫిల్మ క్లబ్ గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది అడ్రస్ లో సంప్రదించడం గానీ, లేదా ఫోను చేయడం ద్వారా కానీ తెలుసుకోవచ్చు.

Hyderabad Film Club

#304, Padmavathi Mansion
Plot Number 23, Gayathri Nagar,, B.K. Guda
Sanjeevareddy Nagar
Hyderabad – 500038
Phone: 040-23730841

2 Comments
  1. koresh September 13, 2008 /
  2. Srinivas Komanapalli June 12, 2010 /