Menu

5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

Indo Cine Appreciation Foundation అనే ఫిల్మ్ సొసైటీ వారిచే నిర్వహించబడుతున్న ఐదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు చెన్నై లో మొదలు కానుంది. ఈ ఏడాడి అత్యుత్తమ Foriegn Langugae విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన The Lives of Others సినిమాతో ఈ వేడుక ప్రాంరంభం కానుంది.

ఈ వేడుకలో ౩౦కి పైగా దేశాలనుంచి సేకరించిన 125 సినిమాలు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, అవార్డులు సాధించి ప్రఖ్యాతి గాంచిన సినిమాలైన Vanaja, Ploy, 4 Months, 3 weeks, 2 days, Sankara,California Dreamin’,In the name of God,Ore kadal, Naalu Pennungal లాంటి చిత్రాలను మొదటి సారిగా వీక్షించే అవకాశం చెన్నై ప్రేక్షకులకు ఈ చిత్రోత్సవం ద్వారా కలుగుతుంది.

ప్రపంచ దేశ సినిమాలతో పాటు గత సంవత్సరమ్ రోజుల్లో విడుదలయిన అత్యుత్తమ భారతీయ సినిమాలు సైతం ఈ వేడుకలో తిలకించవచ్చు.ఇక్కడ ప్రదర్శించే సినిమా పూర్తి లిస్టు కోసం ఇక్కడ చూడండి. ఏయే సినిమాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రదర్శింప బడుతున్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఈ వేడుకలో పాలుపంచుకోవలన్నా, లేదా Indo Cine Appreciation Foundation వారు ఏడాది పొడుగునా ప్రదర్శించే సినిమాలను వీక్షించాలన్నా సభ్యత్వం తప్పనిసరి. కేవలం 500 ల రూపాయల వ్యయంతో సంవత్సరం మొత్తంలో దాదాపు 100 కి పైగా సినిమాలను చూసే అవకాశం కొరకు ఇక్కడ చూడండి.

ఒక ఫిల్మ్ సొసైటీ చే అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్నIndo Cine Appreciation Foundation మిగిలిన ఫిల్మ్ సొసైటీలకు మార్గదర్శకమవుతుందనడంలో సందేహం లేదు. పోయిన సంవత్సరం నుంచి మొదలయిన హైదరాబాదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, త్వరలో జరగబోయే ముంబాయ్ చలన చిత్రోత్సవాలు కూడా ఫిల్మ్ సొసైటి ల చే నిర్వహింపబడుతున్న విషయం ఇక్కడ గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *