కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 7 నుంచి 14 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు.
ప్రముఖ ఇరానియన్ దర్శకుడైన Mohesen Makhmalbaf కుమార్తె Hana Makhmalbaf రూపొందించిన Budhdha Collapsed Out of Shame చిత్ర ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ఆరంభమవుతుంది.
ప్రపంచ దేశాల సినిమాలే కాకుండా భారత దేశానికి చెందిన ఎన్నో మంచి సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి. ఈ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతున్న భారతీయ చిత్రాల వివరాలు:
- Gandhi, My father-Dir. Feroze Khan
- Manorama-Six Feet under-Dir. Navdeep Singh
- Restaurant-Dir. Sachin Kundalkar
- Zero Zone/Shoonya-Dir. Arindam Mitra
- 68 pages-Dir. Sridhar Rangayan
- Staying Alive-Dir. Anant Mahadevan
- Doosra/Doosra-Dir. Anand Subramaniam
ఇక్కడ ప్రదర్శించే సినిమాల పూర్తి వివరాల కొరకై ఇక్కడ చూడండి.
ఫేస్ బుక్ కామెంట్స్