Menu

12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు

kff.jpgఈ రోజు ముగిసిన 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవాల్లో విజేతలుగా నిలిచిన దర్శకులు మరియు చిత్రాల వివరాలు:

ఉత్తమ చలన చిత్రం(మలయాళీ ):
Ore Kadal/The sea within – R శ్యామప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ బెంగాళీ రచయిత సునీల్ గంగోపాధ్యాయ్ రచించిన ’హీరక్ దీప్తి’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈయన నవలల ఆధారంగానే గతంలో సత్యజిత్ రే రూపొందించిన ప్రతిధ్వంది, అరణ్యార్ దిన్ రాత్ సినిమాలు కూడా గంగోపాధ్యాయ్ రచనల ఆధారంగానే రూపొందించబడ్డాయి.

మమ్ముట్టి, మీరా జాస్మిన్ ఈ చిత్రంలో నటీనటులు.ఈ అవార్డుతో పాటు అంతర్జాతీయ సినీ విమర్శకుల సంఘం అందించే ఉత్తమ మలయాళీ చలన చిత్రం అవార్డు కూడా అందుకోవడం విశేషం.

ఉత్తమ చలన చిత్రం(ఆసియా):
Getting Home – చైనీస్ దర్శకుడు Zhang Yang దర్శకత్వం వహించిన ఈ సినిమా పని కోసం వలస వెళ్ళిన ఒక కార్మికుడు అక్కడ మృతి చెందడంతో అతని స్నేహితుడు మృతదేహాన్ని తీసుకుని వారి స్వంత గ్రామం చేరుకునే అగచాట్ల అధారంగా హాస్యభరితంగా రూపొందించబడింది.

FIPRESCI ఉత్తమచలనచిత్రం :
Sleepwalking Land – Teresa Prata దర్శకత్వం వహించిన ఈ సినిమా మొజాంబిక్ దేశంలోని సివిల్ వార్ నేపధ్యంలో నడుస్తుంది.

స్పెషల్ జ్యూరీ అవార్డు:
Bliss – టర్కీ కి చెందిన Abdullah Oguz దర్శకత్వం వహించిన ఈ సినిమా మానభంగం చేయబడ్డ ఒక యువతి కథ గా మొదలవుతుంది. ఆచారం ప్రకారం ఆయువతి ని చంపడమే మంచిదని నిర్ణయించుకున్న అక్కడి పెద్దలు ఆమెను చంపే పనిని ఒక యువకునికి అప్పగిస్తారు. చివరి నిమిషంలో మనసు మార్చుకున్న ఆయువకుడు ఆమెతో కలిసి ఊరినుంచి పారిపోతాడు. వారికి ఇర్ఫాన్ అనే మరో వ్యక్తి పరిచయం అవుతాడు. వారి ముగ్గురి కథే Bliss.

స్వర్ణ చకోరం:
ప్రతియేటా కేరళ చలన చిత్రోత్వాల్లో ప్రదర్శించిన అత్యుత్తమ చిత్రానికి గానూ అందించే ప్రతిష్టాత్మక స్వర్ణ చకోరం అవార్డు ఈ సారి XXY మరియు 10+4 సినిమాలు పంచుకున్నాయి. ఈ రెండు సినిమాల దర్శకులకు రజత చకోరం అవార్డు కూడా అందచేసారు.

One Response
  1. varala anand October 29, 2008 /